IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

Edible Oil Usage: వంట నూనె ధరలు పెరిగాయని ఏం చేశారో తెలుసా?

Edible Oil Usage: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్‌లోనూ ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.

FOLLOW US: 

Edible Oil Usage: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్‌లోనూ ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ధరలు కొండెక్కడంతో భారతీయులు వంట నూనె వాడకాన్ని బాగా తగ్గించేశారు. దాదాపుగా 29 శాతం మంది నూనె వాడకాన్ని తగ్గించేశారు. ముడి సరకుల ధరలు పెరగడంతో మరో 17 శాతం ఖర్చు చేయడం తగ్గించుకున్నారని ఓ నివేదిక తెలిపింది.

ప్రతి రెండు కుటుంబాల్లో ఒకరిపై ధరల పెరుగుదల ప్రభావం పడింది. వారి సేవింగ్స్‌ తగ్గిపోతున్నాయి. వంట నూనెల బ్లాక్‌ మార్కెటింగ్‌, అక్రమ నిల్వ, అనుచిత ధరల పెంపు, నూనెపై పరిమితులు విధించడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని వినియోగదారులు కోరుకుంటున్నారని కమ్యూనిటీ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ నివేదిక వెల్లడించింది. పెరిగిన ధరల భారాన్ని ప్రజలపై వేయకుండా నూనె తయారీ సంస్థల వద్ద ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అంటున్నారు.

Also Read: వెంటాడుతున్న ద్రవ్యల్బణం భయాలు! మార్కెట్లకు మళ్లీ నష్టాలే!

కొవిడ్‌ ముందునాటితో పోలిస్తే పొద్దు తిరుగుడు, పల్లి, కెనోలా నూనెల ధర 50-70 శాతం వరకు పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధమే ఇందుకు కారణం. అర్జెంటీనా నుంచి 85 శాతం సోయాబీన్‌ ఆయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంటుంది. రష్యా, ఉక్రెయిన్‌ నుంచి 90 శాతం వరకు పొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకుంటుంది. ఇండోనేషియా, మలేసియా ఎక్కువగా భారత్‌కు పామ్‌ ఆయిల్‌ను ఎగుమతి చేస్తాయి. 

వంట నూనెల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యుడి బడ్జెట్‌, వినియోగ ప్యాట్రెన్‌పై తీవ్ర ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది. గతంలోనే ధరలు పెరగడంతో డిసెంబర్లో ప్రభుత్వం పామ్‌ ఆయిల్‌పై 17.5 శాతంగా ఉన్న ఇంపోర్టు డ్యూటీని 12.5 శాతానికి తగ్గించింది. దాంతో వంటనూనెలపై ఉన్న సగటు ద్రవ్యోల్బణం 3 నుంచి 1.3 శాతానికి తగ్గిపోయింది. మళ్లీ ఇప్పుడు యుద్ధం వల్ల అది బాగా పెరిగిపోయింది.

Also Read: LPG ధరల్లో భారత్ నం.1, పెట్రోల్‌లో 3వ ర్యాంక్- బాదుడే బాదుడు, వీర బాదుడు!

గత 12 నెలలుగా వంట నూనెల ధరలు పెరుగుతున్నప్పటికీ వాడకం తగ్గించలేదని సగం మంది వినియోగదారులు అన్నారు. అయితే ప్రతి నెలా సేవింగ్స్‌ తగ్గిపోయి ఖర్చులు పెంచాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు ధరలు ఎక్కువవ్వడంతో సామాన్యులు తక్కువ ధరకు లభించే నాణ్యత లేని నూనెల తెచ్చుకుంటున్నారని తెలిసింది. వీటివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Also Read: హ్యుండాయ్ క్రెటాలో కొత్త వేరియంట్ లాంచ్ - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?

Published at : 12 Apr 2022 04:56 PM (IST) Tags: edible oil Sunflower oil Edible Oil Usage Indian households Russia ukrain war effect

సంబంధిత కథనాలు

Bharti Airtel Q4 Earnings: జియోను బీట్‌ చేసిన ఎయిర్‌టెల్‌ ARPU, రూ.2007 కోట్ల బంఫర్‌ ప్రాఫిట్‌

Bharti Airtel Q4 Earnings: జియోను బీట్‌ చేసిన ఎయిర్‌టెల్‌ ARPU, రూ.2007 కోట్ల బంఫర్‌ ప్రాఫిట్‌

Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్‌! బిట్‌కాయిన్‌ సహా మేజర్‌ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!

Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్‌! బిట్‌కాయిన్‌ సహా మేజర్‌ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!

Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!

Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!

PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!

PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!

Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్

Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్

YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

YSRCP Rajyasabha Equation :   వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ?  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?