Hyundai Creta iMT: హ్యుండాయ్ క్రెటాలో కొత్త వేరియంట్ లాంచ్ - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ తన క్రెటాలో కొత్త గేర్ బాక్స్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. అదే ఐఎంటీ వేరియంట్.

FOLLOW US: 

హ్యుండాయ్ తన క్రెటా కారులో కొత్త గేర్ బాక్స్ వేరియంట్‌ను తీసుకువచ్చింది. ఇది క్లచ్‌లెస్ మాన్యువల్ మోడల్. ఈ ఐఎంటీ కారు ఇప్పటికే వెన్యూ, ఐ20ల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు క్రెటాలో కూడా ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం క్రెటాలో మాన్యువల్, సీవీటీ, డీసీటీ, టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

క్రెటా డీసీటీ లేదా సీవీటీ పెట్రోల్ ఆప్షన్ కొనాలనుకునేవారి ప్రస్తుతం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది. వారికి మరో ఆప్షన్‌గా ఈ ఐఎంటీ వేరియంట్ లాంచ్ అయింది. ఇందులో టర్బో 1.4 లీటర్ పెట్రోల్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

దీంతో కొనుగోలుదారులు క్రెటా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో సీవీటీ, ఐఎంటీ గేర్ బాక్స్ వేరియంట్లు ఉండనున్నాయి. ఐఎంటీ వెర్షన్ కేవలం ట్రిమ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ.12.68 లక్షలుగా నిర్ణయించారు. మాన్యువల్ వేరియంట్ కంటే ఇది రూ.20 వేలు మాత్రమే ఎక్కువ.

ఐఎంటీ వేరియంట్లో కారును మాన్యువల్ మోడల్ తరహాలోనే డ్రైవ్ చేస్తాం. కానీ క్లచ్ అవసరం ఉండదు. దీంతోపాటు క్రెటా నైట్ ఎడిషన్ కూడా ఉంది. ఇది పూర్తిగా బ్లాక్ లుక్‌లో ఉంది. స్టాండర్డ్ క్రెటా తరహాలో కాకుండా... ఇది పూర్తిగా బ్లాక్ కలర్‌లో రానుంది. చివరికి దీని అలోయ్స్ కూడా బ్లాక్ కలర్‌లోనే డిజైన్ చేశారు.

ఈ కారు లోపలి భాగంలో ఇంటీరియర్ కూడా గ్లాస్ బ్లాక్ లుక్‌లోనే లాంచ్ అయింది. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. 1.4 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్‌లో దీన్ని అందించలేదు. కియా సెల్టోస్‌లో ఐఎంటీ వేరియంట్ అందుబాటులో ఉంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

View this post on Instagram
 
A post shared by Om Prakash Dheeraj (@om_journo)

Published at : 11 Apr 2022 05:26 PM (IST) Tags: Hyundai New Car Hyundai Creta iMT Gearbox Hyundai Creta iMT Variant Hyundai Creta iMT Price Hyundai Creta iMT Features

సంబంధిత కథనాలు

Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?

Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?

Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!

Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!

Hyundai Santro: చిన్న కార్లు కొనే కస్టమర్లకు ‘హ్యుందాయ్’ బ్యాడ్ న్యూస్, ఆ హ్యాచ్‌బ్యాక్ కారు ఇక కనిపించదా?

Hyundai Santro: చిన్న కార్లు కొనే కస్టమర్లకు ‘హ్యుందాయ్’ బ్యాడ్ న్యూస్, ఆ హ్యాచ్‌బ్యాక్ కారు ఇక కనిపించదా?

New Range Rover Sport Price: కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రివీల్ చేసిన కంపెనీ - రేటు మాత్రం అమ్మ బాబోయ్!

New Range Rover Sport Price: కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రివీల్ చేసిన కంపెనీ - రేటు మాత్రం అమ్మ బాబోయ్!

Tata Ace EV: డెలివరీ వ్యాపారులకు గుడ్‌న్యూస్ - టాటా ఏస్ ఈవీ వచ్చేసింది - సింగిల్ చార్జ్‌కు ఎన్ని కిలోమీటర్లు రానుందంటే?

Tata Ace EV: డెలివరీ వ్యాపారులకు గుడ్‌న్యూస్ - టాటా ఏస్ ఈవీ వచ్చేసింది - సింగిల్ చార్జ్‌కు ఎన్ని కిలోమీటర్లు రానుందంటే?

టాప్ స్టోరీస్

CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!

CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!

Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Russia Ukraine War :  ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్