News
News
X

Demat Account: డీమ్యాట్‌కు నామినీని యాడ్‌ చేశారా?, లేదంటే అకౌంట్‌ ఫ్రీజ్‌ అవుతుంది

మీ డీమ్యాట్ ఖాతాకు నామినీ పేరును యాడ్ చేయుకంటే మీ ఖాతా ఫ్రీజ్ అవుతుంది.

FOLLOW US: 
Share:

Demat Account Nominee: మీకు డీమ్యాట్‌ అకౌంట్‌ ఉండి, ఆ ఖాతాలో నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయకపోతే తక్షణం ఆ పనిని పూర్తి చేయండి. మీకు కేవలం కొన్ని రోజులే గడువు ఉంది. నామినేషన్‌ను మీరు పూర్తి చేయకపోతే, మీ డీమ్యాట్‌ అకౌంట్‌ ఫ్రీజ్‌ అవుతుంది.

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ఆదేశం ప్రకారం, ప్రతి ఒక్క డీమ్యాట్ ఖాతాకు నామినీ పేరును జత చేయాలి. ఇందుకు 2023 మార్చి 31వ తేదీయే చివరి గడువు. ఈ లోపు మీ డీమ్యాట్ ఖాతాకు నామినీ పేరును యాడ్ చేయుకంటే మీ ఖాతా ఫ్రీజ్ అవుతుంది. అకౌంట్‌ ఫ్రీజ్‌ అయిందంటే, దాని ద్వారా మీరు ఎలాంటి స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు చేయలేరు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టలేరు, రోజువారీ ట్రేడింగ్‌ చేయలేరు. 

డీమ్యాట్ ఖాతాల్లో తప్పనిసరిగా నామినీ పేరును, కేటాయించాలనుకున్న శాతాన్ని జత చేయమని జులై 2021లో సెబీ సూచించింది. అప్పటి నుంచి కొన్ని దఫాలుగా గడువును పొడిగిస్తూ వచ్చింది. 2023 మార్చి 31వ తేదీని ఫైనల్‌ గడువుగా నిర్ణయించింది. కాబట్టి ఈలోపే నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయండి. నామినీ పేరును చేర్చడానికి మీరు చేసే దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం, కేవలం 2 రెండు నిమిషాల్లో మీ వైపు నుంచి పని పూర్తవుతుంది. ఆ అప్లికేషన్‌ను ప్రాసెస్‌ చేయడానికి 24 - 48 గంటల సమయం పడుతుంది. కాబట్టి, చివరి రోజు వరకు కాలయాపన చేయవద్దు. వీలయితే ఇవాళే, లేదా చివరి తేదీకి కనీసం మూడు రోజుల ముందయినా నామినేషన్‌ కోసం దరఖాస్తు చేయండి. 

డీమ్యాట్‌ ఖాతాలో నామినీ పేరును ఎలా జత చేయాలి?
మీ డీమ్యాట్‌ ఖాతాకు గరిష్టంగా ముగ్గురి పేర్లను నామినీలుగా జత చేయవచ్చు, మీ ఇష్టప్రకారం వాళ్లకు నామినేషన్‌ పర్సెంటేజీ ఇవ్వవచ్చు. మొత్తం పర్సంటేజీ కలిపి 100%కి మించకూడదు. ఒక్కరి పేరునే నామినీగా మీరు చేరిస్తే, ఆ ఒక్కళ్లకే  100% ఇవ్వొచ్చు. ముందుగా, నామినీ పాన్‌, ఆధార్‌ నంబర్‌, ఈ ఆధార్‌ నంబర్‌కు లింక్‌ అయిన రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ మీ దగ్గర పెట్టుకోండి.

ఒక్కో బ్రోకరేజీ వెబ్‌సైట్‌ డిజైన్‌ ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి, అన్ని వెబ్‌సైట్లకు వర్తించేలా నామినేషన్‌ ఫిల్లింగ్‌ ప్రాసెస్‌ను స్థూలంగా చెప్పుకుందాం.

మీరు డీమ్యాట్ ఖాతా తీసుకున్న బ్రోకరేజీ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. హోమ్‌ పేజీలో, మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత, ప్రొఫైల్ సెగ్మెంట్‌లోకి వెళ్లండి. ఈ సెగ్మెంట్‌లో కనిపించే నామినీ డిటెయిల్స్‌పై క్లిక్ చేయండి. మీరు ఇంతకు ముందే నామినేషన్‌ పూర్తి చేస్తే ఆ వివరాలు కనిపిస్తాయి. ఎవరి పేరును చేర్చకపోతే ఏ రికార్డ్‌ కనిపించదు. 

నామినీ పేరును గతంలో మీరు జత చేయకపోతే, ఇప్పుడు, ఆ పేజీలో నామినీ వివరాలను నమోదు చేయండి. నామినీ పేరు, పాన్‌, ఆధార్‌ నంబర్‌ పూరించండి. తర్వాత, నామినీకి కేటాయించాలనుకుంటున్న శాతాన్ని పూరించండి. గరిష్టంగా ముగ్గురిని యాడ్‌ చేయవచ్చని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. మీరు కావాలనుకుంటే.. యాడ్‌ నామినీపై క్లిక్‌ చేసి, మరో ఇద్దరి పేర్లను కూడా జోడించవచ్చు.

ఆధార్‌ నంబర్‌ యాడ్‌ చేసి, సెండ్‌ OTP బటన్‌పై క్లిక్‌ చేయండి. ఆధార్‌తో లింక్‌ అయిన ఫోన్‌ నంబర్‌కు వచ్చిన OTPని సంబంధిత గడిలో పూరించండి.

అంతే, నామినేషన్‌ కూడా దరఖాస్తు చేయడం పూర్తవుతుంది. 24-48 గంటల్లో మీ డీమ్యాట్ ఖాతాకు నామినీ పేరు జత అవుతుంది.

Published at : 13 Mar 2023 12:58 PM (IST) Tags: Nominee Stock Market news nomination Demat account SEBI

సంబంధిత కథనాలు

Stock Market News: ఫెడ్‌ ప్రకటన కోసం వెయిటింగ్‌ - అప్రమత్తంగా కదలాడిన నిఫ్టీ, సెన్సెక్స్‌!

Stock Market News: ఫెడ్‌ ప్రకటన కోసం వెయిటింగ్‌ - అప్రమత్తంగా కదలాడిన నిఫ్టీ, సెన్సెక్స్‌!

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Gautam Adani: కోటీశ్వరుల కష్టాలు! వారానికి రూ.3000 కోట్లు నష్టపోతున్న అంబానీ!

Gautam Adani: కోటీశ్వరుల కష్టాలు! వారానికి రూ.3000 కోట్లు నష్టపోతున్న అంబానీ!

Cryptocurrency Prices: బిట్‌కాయిన్‌ రూ.24 లక్షలు క్రాస్‌ చేసేనా?

Cryptocurrency Prices: బిట్‌కాయిన్‌ రూ.24 లక్షలు క్రాస్‌ చేసేనా?

Brand Value: తగ్గేదేల్యా, బ్రాండ్‌ వాల్యూ పెంచుకున్న అల్లు అర్జున్‌, రష్మిక

Brand Value: తగ్గేదేల్యా, బ్రాండ్‌ వాల్యూ పెంచుకున్న అల్లు అర్జున్‌, రష్మిక

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!