Gas Cylinder Price Hike: షాకింగ్ న్యూస్! గ్యాస్ సిలిండర్ ధరపై మళ్లీ బాదుడు, ఈ సారి ఎంతంటే
Cylinder Rates Hike: బుధవారం (జూలై 6) నుంచి డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో ప్రస్తుతం రూ.1,003 ఉండగా, తాజా పెంపుతో రూ.1,053 అయింది.
వంట గ్యాస్ వినియోగిస్తున్న వారికి చేదు వార్త. ఇప్పటికే కొద్ది నెలలుగా పెరుగుతూ వస్తున్న వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ ధర తాజాగా రూ.50 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో బుధవారం నుంచి డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో ప్రస్తుతం రూ.1,003 ఉండగా, తాజా పెంపుతో రూ.1,053 అయింది.
మెట్రో సిటీల్లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ కొత్త ధర ఇలా ఉంది.
Hyderabad - Rs.1105
Delhi - Rs.1,053
Mumbai - Rs 1,052.50
Kolkata - Rs 1,079
Chennai - Rs 1068.50
ఏపీలో సిలిండర్ ధరలు ఇలా
Vijayawada - Rs.1077
Guntur - Rs.1092
Visakhapatnam - Rs.1061
Anantapuram - Rs.1119.50
Chittor - Rs.1089
Kadapa - Rs.1103
East Godavari - Rs.1081.50
Also Read: Gold-Silver Price: నేడు బంగారం ధర షాక్! రెండ్రోజుల తర్వాత పెరిగిన పసిడి - వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ
ప్రస్తుతం దేశంలోని సామాన్యులకు ద్రవ్యోల్బణం నుంచి ఊరట లభిస్తుందనే ఆశ కనిపించడం లేదు. హైదరాబాద్‌లో గ్యాస్ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ప్రతి నెల 1న వంట గ్యాస్ ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్ ధర మాత్రం పెంచాయి.
Domestic 14.2 kg LPG cylinder's prices increased by Rs 50/cylinder with effect from today. Domestic LPG cylinder will now cost Rs 1053 in Delhi. 5kg domestic cylinder price increase by Rs 18/cylinder. 19kg commercial cylinder prices decreased by Rs 8.50.
— ANI (@ANI) July 6, 2022
గత మార్చి 22న కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. అంతకుముందు గతేడాది అక్టోబర్, ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ.899.50గా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో సామాన్యుడి జేబులపై మరింతగా ప్రభావం పడనుంది.
Also Read: ఎంపీ జేబులో పెన్ను మిస్సింగ్! కలం కోసం కంటతడి, ఎంపీని ఓదార్చిన సన్నిహితులు-ధర ఎంతో తెలుసా?