అన్వేషించండి

Cryptocurrency Prices: కరెక్షన్‌ మోడ్‌లో క్రిప్టో - రూ.1000 తగ్గిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices Today, 18 January 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు.

Cryptocurrency Prices Today, 18 January 2023:

క్రిప్టో మార్కెట్లు బుధవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.28 శాతం తగ్గి రూ.17.29 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.33.34 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.04 శాతం పెరిగి రూ.128,371 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.15.48 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.50 శాతం తగ్గి రూ.81.45, బైనాన్స్‌ కాయిన్‌ 0.82 శాతం తగ్గి రూ.24,480, రిపుల్‌ 1.47 శాతం తగ్గి రూ.31.50, యూఎస్‌డీ కాయిన్‌ 0.55 శాతం తగ్గి రూ.81.38, బైనాన్స్‌ యూఎస్డీ 0.50 శాతం తగ్గి 81.47, డోజీ కాయిన్ 0.26 శాతం పెరిగి 7.01 వద్ద కొనసాగుతున్నాయి. స్టీమ్‌, బ్లాక్స్‌, షిడో ఫైనాన్స్‌, రాకెట్‌ పూల్‌, సింగులారిటీ నెట్‌, షిబా ఇను, కస్పర్‌ నెట్‌వర్క్‌ లాభపడ్డాయి. ఈ కాయిన్‌, సీరమ్‌, నూసైఫర్‌, ఆర్బ్‌సిటీ, సీయూఎస్‌డీటీ, ఆప్టిమిజమ్‌, స్టెప్‌ఎన్‌ నష్టపోయాయి. 

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Andhra Pradesh Land Rates: ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
CM Chandrababu: ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం, ఎన్ని ఉద్యోగాలో తెలుసా?
ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం, ఎన్ని ఉద్యోగాలో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Andhra Pradesh Land Rates: ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
CM Chandrababu: ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం, ఎన్ని ఉద్యోగాలో తెలుసా?
ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం, ఎన్ని ఉద్యోగాలో తెలుసా?
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Embed widget