By: ABP Desam | Updated at : 15 Mar 2023 07:43 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ( Image Source : Getty )
Cryptocurrency Prices Today, 15 March 2023:
క్రిప్టో మార్కెటు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.28 శాతం పెరిగి రూ.20.56 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.39.51 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.01 శాతం పెరిగి రూ.1,39,696 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.16.73 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.19 శాతం పెరిగి రూ.83.22, బైనాన్స్ కాయిన్ 0.74 శాతం తగ్గి రూ.25,566, రిపుల్ 0.54 శాతం తగ్గి రూ.30.72, యూఎస్‌డీ కాయిన్ 0.67 శాతం పెరిగి రూ.82.74, కర్డానో 5.40 శాతం తగ్గి రూ.27.98, డోజీ కాయిన్ 0.18 శాతం తగ్గి 5.80 వద్ద కొనసాగుతున్నాయి. కాయిన్ మెట్రో, హాలో కాయిన్, ఈకాయిన్, మాస్క్ నెట్‌వర్క్, సింగులారిటీ నెట్, రిబ్బన్ ఫైనాన్స్, రాప్‌డ్ సెంట్రిఫ్యూజ్ లాభపడ్డాయి. లిక్విడిటీ, హీలియం, బ్లర్, కోర్, సినాప్సీ, కాన్‌స్టల్లేషన్, యాక్సెస్ ప్రొటొకాల్ నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Petrol-Diesel Price 31 March 2023: సాధారణ జనానికి ఊరట, ఇవాళ కొంచం తగ్గిన చమురు ధరలు
Gold-Silver Price 31 March 2023: నగలు కొందామంటే భయపెడుతున్న బంగారం ధర, ఇవాళ కూడా పెరిగిన రేటు
Mahindra Thar SUV: సైలెంట్‌గా సూపర్ హిట్ అవుతున్న మహీంద్రా ఎస్‌యూవీ - కీలకమైన మైలురాయి!
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్ ఢమాల్.... కానీ బిట్‌కాయిన్!
Gold-Silver Price 30 March 2023: 3 రోజులు మురిపించి మళ్లీ పెరిగిన పసిడి, స్థిరంగా వెండి
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు