By: ABP Desam | Updated at : 14 Dec 2022 05:43 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు ( Image Source : Michael Förtsch/Unsplash )
Cryptocurrency Prices Today, 14 December 2022:
క్రిప్టో మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెద్ద కాయిన్లు కొనుగోలు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 1.87 శాతం పెరిగి రూ.14.72 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.28.32 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 2.75 శాతం పెరిగి రూ.109,538 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.13.19 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.29 శాతం తగ్గి రూ.82.60, బైనాన్స్ కాయిన్ 1.45 శాతం పెరిగి రూ.22,547, యూఎస్‌డీ కాయిన్ 0.22 శాతం తగ్గి 82.53, రిపుల్ 0.71 శాతం పెరిగి రూ.32.22, బైనాన్స్ యూఎస్‌డీ 0.22 శాతం తగ్గి రూ.82.61 వద్ద కొనసాగుతున్నాయి. టోన్‌కాయిన్, సియా కాయిన్, ఆప్టిమిజమ్, వైట్ బిట్‌కాయిన్, బైనరీ ఎక్స్, ఓకేసీ, బోన్ షిబా స్వాప్ లాభపడ్డాయి. జీఎంఎక్స్, టెన్సెంట్, స్టాక్స్, ఎంఎక్స్‌సీ, పాకెట్ నెట్‌వర్క్, ఎన్‌ఎఫ్వో, సైనాప్స్ నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్ యూజర్లు, "నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్" రికార్డ్ ఇది
LIC WhatsApp Services: 11 రకాల ఎల్ఐసీ సేవల్ని వాట్సాప్ నుంచే పొందొచ్చు, మీరు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు
Credit Card Charges: అద్దె బాదుడు లిస్ట్‌లో IDFC ఫస్ట్ బ్యాంక్, ఛార్జీలు వర్తిస్తాయ్
Income Tax New Rules: పాత-కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
Paytm Q3 Result: పేటీఎం ఫలితాలు సూపర్ - భారీగా పెరిగిన ఆదాయం, సగానికి తగ్గిన నష్టం
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్
BRS Nanded Meeting : నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !
Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ
Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?