By: ABP Desam | Updated at : 09 Jan 2023 02:58 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు ( Image Source : Getty )
Cryptocurrency Prices Today, 09 January 2022:
క్రిప్టో మార్కెట్లు సోమవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 1.63 శాతం పెరిగి రూ.14.16 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.27.26 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 3.87 శాతం పెరిగి రూ.107,980 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.13.01 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.05 శాతం పెరిగి రూ.82.36, బైనాన్స్ కాయిన్ 6.29 శాతం పెరిగి రూ.22,821, యూఎస్‌డీ కాయిన్ 0.10 శాతం పెరిగి 82.36, రిపుల్ 2.85 శాతం పెరిగి రూ.28.84, బైనాన్స్ యూఎస్‌డీ 0.10 శాతం పెరిగి రూ.82.39 వద్ద కొనసాగుతున్నాయి. షిడో ఫైనాన్స్, ఈకాయిన్, గాలా, జిలికా, ఆంక్రూ, మేరినాడ్ స్టేక్డ్ సోల్, ఆప్టిమిజమ్ కాయిన్లు లాభపడ్డాయి. సాంగ్‌బర్డ్, ఎక్స్‌వైవో నెట్‌వర్క్, ఈఎవ్‌మోస్, చైన్, అయిలెఫ్, వీవీఎస్ ఫైనాన్స్, క్రెడిట్ కాయిన్ నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్
Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!
FII stake: మూడు నెలల్లోనే ఎఫ్ఐఐ పెట్టుబడులు రెట్టింపు, ఈ బ్యాంక్‌పై ఎందుకంత నమ్మకం?
Telangana Budget 2023: రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులు - 1,721 పోస్టుల మంజూరు!
Stock Market News: మార్కెట్లు డల్ - కేక పెట్టించిన అదానీ షేర్లు, సెన్సెక్స్ 335 డౌన్!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Minsiter Errabelli : బీఆర్ఎస్ నేత కన్నుమూత, పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి