Cryptocurrency Prices: రూ.5000 తగ్గిన బిట్‌కాయిన్ - క్రిప్టో మార్కెట్లో మిశ్రమ స్పందన!
Cryptocurrency Prices Today, 20 October 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.12 శాతం తగ్గి రూ.15.87 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.30.45 లక్షల కోట్లుగా ఉంది.
![Cryptocurrency Prices: రూ.5000 తగ్గిన బిట్‌కాయిన్ - క్రిప్టో మార్కెట్లో మిశ్రమ స్పందన! Cryptocurrency Prices On October 20 2022 Know Rate of Bitcoin, Ethereum, Litecoin, Ripple, Dogecoin And Other Cryptocurrencies Cryptocurrency Prices: రూ.5000 తగ్గిన బిట్‌కాయిన్ - క్రిప్టో మార్కెట్లో మిశ్రమ స్పందన!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/4f609c3716fff2dc054d0da37a4579aa_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cryptocurrency Prices Today, 20 October 2022: క్రిప్టో మార్కెట్లు నేడు మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.12 శాతం తగ్గి రూ.15.87 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.30.45 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.02 శాతం పెరిగి రూ.1,07,503 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.12.95 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.38 శాతం తగ్గి రూ.82.62, యూఎస్‌డీ కాయిన్ 0.28 శాతం తగ్గి 82.65, బైనాన్స్ కాయిన్ 0.44 శాతం పెరిగి రూ.22,543, రిపుల్ 1.61 శాతం పెరిగి రూ.38.30, బైనాన్స్ యూఎస్‌డీ 0.32 శాతం తగ్గి రూ.82.70 వద్ద కొనసాగుతున్నాయి. జీఎక్స్ చైన్, ఎండెక్స్, మెడిబ్లాక్, టెర్రా క్లాసిక్ యూఎస్డీ, చైన్, లుక్సో, ఏప్‌ఎన్‌ఎఫ్టీ 7-16 శాతం వరకు పెరిగాయి. పాకెట్ నెట్‌వర్క్, కన్‌స్టిట్యూషన్ డీఏవో, రిబ్బన్ ఫైనాన్స్, ఫ్రాక్స్ షేర్, అప్టోస్, కిరోబో, క్వాంట్ 6-21 శాతం మేర నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)