Cryptocurrency Prices Today: మళ్లీ పడిపోయిన బిట్‌కాయిన్ విలువ! ఎథిరియమ్ కాస్త ఫర్వాలేదు
గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 0.11 శాతం తగ్గి రూ.37.68 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.66.92 లక్షల కోట్లుగా ఉంది.
Cryptocurrency Prices Today, 03 January 2022: క్రిప్టో మార్కెట్లు సోమవారం ఒడుదొడుకుల్లో ఉన్నాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 0.11 శాతం తగ్గి రూ.37.68 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.66.92 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 2.19 శాతం పెరిగి రూ.3,05,960 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.33.86 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 1.18 శాతం పెరిగి రూ.42,330, టెథెర్ 0.01 శాతం పెరిగి రూ.79.76, సొలానా 0.71 శాతం తగ్గి రూ.13,945, కర్డానో 0.21 శాతం పెరిగి రూ.110, యూఎస్‌డీ కాయిన్ 0.06 శాతం పెరిగి 79.82 వద్ద కొనసాగుతున్నాయి. యార్న్ ఫైనాన్స్, ఆవె, ఓక్స్ యూనిస్వాప్, రిపబ్లిక్, కాంపౌండ్, చైన్ లింక్ 7 నుంచి 12 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. స్వైప్, అయిలెఫ్, గోలెమ్, అవలాంచె, డియా, చిలిజ్, ఐఎక్స్‌సీ 1 నుంచి 8 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Car Sales Dec 2021: హ్యూందాయ్‌కు 'టాటా' మోటార్స్ సెగ.. డిసెంబర్లో కార్లను మామూలుగా అమ్మలేదు మరి!
Also Read: Housing sales: హైదరాబాద్ తగ్గేదే లే! మూడు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
Also Read: IPO craze: 23 కంపెనీలు.. రూ.44000 కోట్లు! 2022లోనూ ఐపీవో క్రేజ్
Also Read: Tesla: మళ్లీ సర్‌ప్రైజ్ చేసిన మస్క్! ఆటోపైలట్ హెడ్‌గా చెన్నై వ్యక్తి ఎంపిక