By: ABP Desam | Updated at : 21 Jan 2022 05:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ
Cryptocurrency Prices Today, 21 January 2022: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం భారీగా పతనం అవుతున్నాయి. ట్రేడర్లు విక్రయాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 7.70 శాతం తగ్గి రూ.31.45 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.55.00 లక్షల కోట్లుగా ఉంది. ఒక్క రోజులోనే రూ.5 లక్షల కోట్ల మేర విలువ ఆవిరైంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 9.49 శాతం తగ్గి రూ.2,29,993 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.25.55 లక్షల కోట్లుగా ఉంది. దాదాపు రూ.2 లక్షల కోట్లు తగ్గిపోయింది.
బైనాన్స్ కాయిన్ 7.50 శాతం తగ్గి రూ.34,461, టెథెర్ 0.03 శాతం పెరిగి రూ.81.21, సొలానా 11.41 శాతం తగ్గి రూ.9,819, కర్డానో 9.66 శాతం తగ్గి రూ.97, యూఎస్‌డీ కాయిన్ 0.01 శాతం పెరిగి 81.24 వద్ద కొనసాగుతున్నాయి. టెథర్, యూఎస్‌డీ స్వల్పంగా పెరగడం మినహా మరేవీ లాభాల్లో లేవు. లూప్‌రింగ్, లైవ్‌పీర్, యార్న్ ఫైనాన్స్, హార్మొని, ఎన్‌కేఎన్, కీప్ నెట్‌వర్క్, అల్గొరాండ్ 13 నుంచి శాతం వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!
Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Adani Group Investment Plan: ఇన్ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు
Train Ticket: కన్ఫర్మ్డ్ ట్రైన్ టిక్కెట్ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్ ప్రయత్నించండి
Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్ ఛెస్ట్ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు
GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>