By: ABP Desam | Updated at : 16 Jan 2022 04:47 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు
Cryptocurrency Prices Today, 16 January 2022: క్రిప్టో మార్కెట్లు ఆదివారం స్తబ్దుగా ఉన్నాయి. నేడు ట్రేడర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూపడం లేదు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 0.38 శాతం తగ్గి రూ.34.34 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.60.27 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 0.38 శాతం తగ్గి రూ.2,64,426 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.29.21 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 0.08 శాతం పెరిగి రూ.39,552, టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.80.30, సొలానా 2.07 శాతం పెరిగి రూ.11,921, కర్డానో 8.30 శాతం పెరిగి రూ.111 యూఎస్‌డీ కాయిన్ 0.10 శాతం పెరిగి 80.30 వద్ద కొనసాగుతున్నాయి. ఫాంటామ్, కాస్మోస్, పవర్‌లెడ్జ్, యాక్సీ ఇన్ఫినిటీ, టెర్రా, యూనిస్వాప్ 2 నుంచి 12 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లూప్‌రింగ్, గోలెమ్, కర్వ్‌డావో, డోజీకాయిన్, సుషి, ఎల్‌రాండ్, కాంపౌండ్ 3 నుంచి 7 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Hero Xtreme 160R: కొత్త బైక్ కొనాలనుకుంటే జూన్ 14 వరకు ఆగండి - సూపర్ బైక్ లాంచ్ చేస్తున్న హీరో!
Maruti Suzuki Jimny: ఎట్టకేలకు లాంచ్ అయిన మారుతి సుజుకి జిమ్నీ - ధర ఎంతంటే?
Stock Market News: స్టాక్ మార్కెట్లో జజ్జనక! 18,700 పైన నిఫ్టీ, 63,142 వద్ద సెన్సెక్స్ క్లోజింగ్!
Insurance: బ్రిటిష్ కాలం నాటి బెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ & బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా?
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్స్ జూమ్ - రూ.78వేలు పెరిగిన బిట్‌కాయిన్
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
IND Vs AUS Final: రవిచంద్రన్ అశ్విన్‌కు దక్కని చోటు - భారత్‌కు ప్రమాదంగా మారుతుందా?