Cryptocurrency Prices Today: రూ.2.5 లక్షల కోట్లు తగ్గిన ఎథిరియమ్.. అదే బాటలో బిట్‌కాయిన్!
గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 1.00 శాతం పెరిగి రూ.39.66 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది.

Cryptocurrency Prices Today, 12 December 2021: క్రిప్టో మార్కెట్ ఆదివారం స్తబ్దుగా ఉంది. మదుపర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 1.00 శాతం పెరిగి రూ.39.66 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 0.38 శాతం తగ్గి రూ.3,25,847 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.36 లక్షల కోట్లుగా ఉంది. రెండు రోజుల్లో రెండున్నర లక్షల కోట్లు తగ్గింది.
బైనాన్స్ కాయిన్ 2.15 శాతం పెరిగి రూ.45,881, టెథెర్ రూ.81.27, సొలానా 2.22 శాతం తగ్గి రూ.13,681, కర్డానో 3.30 శాతం తగ్గి రూ.109, యూఎస్‌డీ కాయిన్ 0.18 శాతం తగ్గి రూ.81.46 వద్ద కొనసాగుతున్నాయి. ఎన్‌జిన్ కాయిన్, ఎన్‌కేఎన్, పొల్కాడాట్, క్వాంట్‌స్టాంప్, బైనాన్స్ కాయిన్, బేసిక్ అటెన్షన్ 2 శాతం మేర లాభాల్లో ఉన్నాయి. యార్న్ ఫైనాన్స్, ఠీటా ఫ్యూయెల్, యూనిస్వాప్, ఎయిర్‌స్వాప్, టెర్రా, ఈఓఎస్, టెజోస్ 3 నుంచి 8 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Social Media: భార్యను ట్రోల్ చేశారని.. బ్లాక్‌చైన్‌తో సొంత సోషల్ మీడియా!
Also Read: Passenger Vehicle Sales: భారీగా పడిపోయిన వాహనాల సేల్స్.. కారణం అదే.. ఇలా అయితే సమస్యలు తప్పవు!
Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్.. రూ.140 పెరిగిన ధర, ఎగబాకిన వెండి రేటు
Also Read: Aadhaar Card News: ఆధార్ కార్డులో అడ్రెస్, పేరు, పుట్టిన తేదీ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

