By: ABP Desam | Updated at : 10 Dec 2021 07:38 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ప్యాసింజర్ వాహనాల సేల్స్ పడిపోయాయి.
భారతదేశంలో పాసింజర్ వాహనాల హోల్‌సేల్స్ నవంబర్‌లో 19 శాతం వరకు పడిపోయాయి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా వాహనాల ఉత్పత్తిపై ప్రభావం పడిందని, ఇది డీలర్స్ డెలివరీపై కూడా పడింది. కాబట్టి సేల్స్ మందగించాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చర్ తెలిపింది.
ఆటో ఇండస్ట్రీ బాడీ ప్రకటన ప్రకారం.. గత నెలలో ప్యాసింజర్ వాహనాల సేల్స్ 2,15,626 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది నవంబర్‌లో 2,64,898 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే మొత్తంగా 19 శాతం తగ్గిందన్న మాట. అదేవిధంగా, మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు గత నెలలో 16,00,379 యూనిట్ల నుంచి 34 శాతం తగ్గి 10,50,616 యూనిట్లకు తగ్గాయి.
మొత్తం త్రీ-వీలర్ డిస్పాచ్‌లు 22,471 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది నవంబర్‌లో ఈ సంఖ్య 24,071 యూనిట్లుగా ఉంది. ఇవి కూడా 7 శాతం మేర తగ్గాయి. కేటగిరీల వారీగా చూస్తే మొత్తం ఆటోమొబైల్ విక్రయాలు గత నెలలో 18,89,348 యూనిట్ల నుంచి 12,88,759 యూనిట్లకు పడిపోయాయి.
“గ్లోబల్ సెమీ కండక్టర్ షార్టేజ్ కారణంగా పరిశ్రమ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పండుగల సీజన్‌లో, నష్టపోయిన సేల్స్‌ను భర్తీ చేయాలని పరిశ్రమ భావిస్తోంది. అయితే 2021 నవంబర్‌లో విక్రయాలు భారీగా పడిపోయాయి. నవంబర్ విక్రయాలు ప్రయాణీకుల వాహనాలకు ఏడేళ్లలో అత్యల్పంగా, ద్విచక్ర వాహనాలకు 11 ఏళ్లలో అత్యల్పంగా, త్రీ వీలర్స్‌కు 19 సంవత్సరాల్లో అత్యల్పంగా నమోదయ్యాయి.” అని SIAM డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నందున ఉద్యోగుల భద్రత, సప్లై చైన్ సమస్యల విషయాలను ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Union Budget 2023: మరింత తగ్గనున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధర - ఆటోమొబైల్స్ హైలెట్స్ ఇవే!
CAEV Expo 2023: ఇండియాలో మరో ఆటో ఎక్స్పో - ఆసియాలోనే అతి పెద్దది, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Maruti Suzuki: గ్రాండ్ విటారా కొన్నారా? - తక్షణం కంపెనీకి తిరిగి పంపండి, లేదంటే డేంజర్
Bajaj Qute Auto Taxi: సామాన్యుల కోసం ‘బజాజ్ క్యూట్’ - మారుతీ ఆల్టోకు గట్టిపోటీ, ధర ఎంతంటే..
IND vs NZ 3rd T20: శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ - చివరి టీ20లో భారత్ భారీ స్కోరు
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Union Budget 2023: ఇది బ్యాలెన్స్డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం