By: ABP Desam | Updated at : 19 Apr 2022 04:05 PM (IST)
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో.. క్రిప్టోలు భారీ లాభాల్లో!
Cryptocurrency Prices Today, 17 April 2022: క్రిప్టో మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి పెట్టుబడి పెడుతున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 4.45 శాతం పెరిగి రూ.32.47 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.59.07 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 4.60 శాతం పెరిగి రూ.2,43,178 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.27.97 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.79.99, బైనాన్స్ కాయిన్ 4.62 శాతం పెరిగి రూ.33,615, యూఎస్‌డీ కాయిన్ 0.04 శాతం పెరిగి 79.99, సొలానా 5.44 శాతం పెరిగి రూ.8,180, రిపుల్ 4.27 శాతం పెరిగి రూ.61.49 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్, రిపబ్లిక్, టెర్రా, స్వైప్, సింథెటిక్స్, లూప్‌రింగ్, ఎల్‌రాండ్ 10-31 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. పాక్స్ డాలర్ ఒక్కటే స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Cryptocurrency Prices Today: కొద్దిగా లాభపడ్డ బిట్‌కాయిన్! ఎథీరియమ్కు సపోర్ట్!
Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా
Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?
F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్ ఫైనల్ ఫాంటసీ XIలో బెస్ట్ టీమ్ ఇదే!
Drone Shot Down: అమర్నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం
Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా