Import Licence: ల్యాప్‌టాప్ ఇంపోర్ట్ లైసెన్స్ కోసం అప్లై చేస్తే 48 గంటల్లోనే అనుమతి - చైనానే టార్గెటా?
ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లలో 75 శాతానికి పైగా డ్రాగన్ కంట్రీ పంపింది.
Laptop, Tablet Imports Licence: విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్లు (PCలు) దిగుమతి చేసుకోవాలనుకునే కంపెనీల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ మరో స్టెప్ తీసుకుంది. ఆ డివైజ్‌ల ఇంపోర్ట్ ప్రక్రియ మొత్తాన్ని కంట్రోల్‌లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. లైసెన్సింగ్ అనుమతులను ఫాస్ట్ ట్రాక్‌లో పెడుతోంది.
48-72 గంటల్లోనే అప్రూవల్
ఫారిన్ నుంచి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్లు ఇంపోర్ట్ చేసుకోవాలనుకునే కంపెనీలు, గవర్నమెంట్ రిలీఫ్ ఇచ్చిన ఈ మూడు నెలల లోపు, ఇంపోర్ట్ లైసెన్సింగ్ కోసం అప్లై చేసుకోవాలి. లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే, సూపర్ ఫాస్ట్‌గా దానిని అప్రూవ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన 48 నుంచి 72 గంటల్లోనే (2-3 రోజుల్లో) లైసెన్స్ రిక్వెస్ట్ క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
లైసెన్స్ కోరుతున్న కంపెనీలు.. ఆ కన్‌సైన్‌మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, దిగుమతి చేసుకునే యూనిట్ల సంఖ్య, వాళ్ల గత దిగుమతి చరిత్ర గురించి కచ్చితమైన సమాచారాన్ని అందించాలి. లైసెన్స్ రికెస్ట్‌ను వేగంగా ప్రాసెస్ చేయడానికి ఈ డేటా కీలకం.
HSN కోడ్ 8471 కిందకు వచ్చే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై గురువారం రోజు హఠాత్తుగా బ్యాన్ విధించి కేంద్ర ప్రభుత్వం, ఆ ఆర్డర్ తక్షణం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో, హార్డ్‌వేర్ కంపెనీల కన్‌సైన్‌మెంట్స్ అన్నీ కస్టమ్స్ దగ్గర నిలిచిపోయాయి. ఆ ఎఫెక్ట్‌తో ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)తో ఇండస్ట్రీ చర్చలు జరిపింది.
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, పర్సనల్ కంప్యూటర్లు తయారు చేసే ఆపిల్ (Apple), శామ్‌సంగ్ (Samsung), హెచ్‌పీ (HP), డెల్ (Dell) వంటి గ్లోబల్ కంపెనీలు కూడా ఇండియాలోని పరిస్థితులపై ఫోకస్ పెట్టాయి. ఇండియన్ హార్డ్‌వేర్ ఇండస్ట్రీ-ఇండియన్ గవర్నమెంట్ మధ్య జరుగుతున్న చర్చలను ఆసక్తిగా గమనించాయి.
నిషేధం 3 నెలలు వాయిదా
హార్డ్‌వేర్ ఇండస్ట్రీ రిక్వెస్ట్ ఫలించింది, సెంట్రల్ గవర్నమెంట్ రిలీఫ్ ప్రకటించింది. HSN కోడ్ 8471 కిందకు వచ్చే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, పర్సనల్ కంప్యూటర్ల ఇంపోర్ట్స్‌పై విధించిన నిషేధాన్ని 3 నెలల పాటు పక్కన పెడుతూ, శుక్రవారం రోజున ఫ్రెష్‌గా మరో నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి బ్యాన్ అమలవుతుందని అప్‌డేట్ ఇచ్చింది. దీంతో, ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఆయా డివైజ్‌ల దిగుమతులపై ఆంక్షలు రద్దయ్యాయి. ఇంపోర్ట్స్ యథావిధిగా కొనసాగుతాయి.
చైనానే టార్గెటా?
మన దేశానికి వస్తున్న ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో ఎక్కువ భాగం చైనా నుంచే వస్తున్నాయి. 2022-23లో, భారతదేశం దిగుమతి చేసుకున్న $5.33 బిలియన్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లలో 75 శాతానికి పైగా డ్రాగన్ కంట్రీ పంపింది. గవర్నమెంట్ డెసిషన్ వల్ల చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీదే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది.
అయితే, తన నిర్ణయానికి స్పష్టమైన కారణాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చెప్పలేదు. చైనాతో జరుగుతున్న ట్రేడ్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుందని కొందరు, దేశంలో సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయడానికే లైసెన్సింగ్ విధానాన్ని తప్పనిసరి చేసిందని మరికొందరు చెబుతున్నారు.
"దేశంలో ట్రస్టెడ్ హార్డ్‌వేర్, సిస్టమ్స్ అందుబాటులో ఉండేలా చూడడం & దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఆ ప్రొడక్ట్స్ ఉత్పత్తిని దేశంలో పెంచడం ప్రభుత్వ లక్ష్యం" అని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.
మరో ఆసక్తికర కథనం: హమ్మయ్య - ల్యాప్‌టాప్స్, కంప్యూటర్లపై బ్యాన్ 3 నెలలు వాయిదా
Join Us on Telegram: https://t.me/abpdesamofficial