Cancer Spot Test: ఒక్క చుక్క రక్తంతో క్యాన్సర్ గుర్తింపు - 'గేమ్ ఛేంజర్'ను ఆవిష్కరించిన రిలయన్స్
Cancer Test: సాధారణ రక్త నమూనా ద్వారా క్యాన్సర్ స్పాట్ టెస్ట్ చేస్తారు. జన్యు శ్రేణి & విశ్లేషణ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తిస్తారు.
Reliance Industries: క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే, మెరుగైన చికిత్సతో ఆ వ్యాధి నుంచి పూర్తి స్థాయిలో బయపడొచ్చని చాలా మంది బాధితులు నిరూపించారు. కానీ, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్యాన్సర్ తొలి దశలో గుర్తించడం ఖర్చును దాదాపు అసాధ్యమంగా మారింది. ఎందుకంటే క్యాన్సర్‌ను గుర్తించే పరీక్షలే కాదు, ట్రీట్‌మెంట్ ఖర్చు కూడా సామాన్య జనానికి అందుబాటులో లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Limited) అనుబంధ సంస్థ 'స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్' (Strand Life Sciences Private Limited) ఆవిష్కరిన 'అద్భుతం'తో, క్యాన్సర్ పరీక్ష సామాన్య జనానికి అందుబాటులోకి రాబోతంది.
జెనోమిక్స్, బయోఇన్ఫర్మేటిక్స్‌లో అగ్రగామి కంపెనీగా ఉన్న స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, 'క్యాన్సర్ స్పాట్' (CancerSpot) అనే కొత్త రక్త ఆధారిత పరీక్షను ఆవిష్కరించింది. ఈ టెస్ట్ ద్వారా, సాధారణ రక్త నమూనా ద్వారా క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించవచ్చు.
క్యాన్సర్ స్పాట్ టెస్ట్ ఎలా పని చేస్తుంది?
క్యాన్సర్ స్పాట్, డీఎన్‌ఏ మిథైలేషన్ సిగ్నేచర్‌ను (DNA methylation signatures / DNAm signatures) ఉపయోగిస్తుంది. జీనోమ్ సీక్వెన్సింగ్, ఎనాలిసిస్ ప్రత్యేక ప్రక్రియ ద్వారా ప్రారంభ లక్షణాలను ఇది గుర్తిస్తుంది. ఈ సిగ్నేచర్‌ను భారతీయుల డేటా ఆధారంగా అభివృద్ధి చేశారు. అయినప్పటికీ, ఈ టెస్ట్ ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలకు కూడా ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష క్యాన్సర్‌కు ప్రోయాక్టివ్, రొటీన్ స్క్రీనింగ్ కోసం సులభమైన, అనుకూలమైన ఆప్షన్‌ను అందిస్తుంది.
క్యాన్సర్ స్పాట్ ఆవిష్కరణపై, ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు సభ్యురాలు అయిన ఇషా అంబానీ (Isha Ambani) సంతోషం వ్యక్తం చేశారు. "మానవ జాతికి సేవ చేయడానికి రిలయన్స్ ఔషధాల రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్యాన్సర్ అనేది వేగంగా పెరుగుతున్న వ్యాధి. భారతదేశం ఇది రోగులపై భారీ ఆర్థిక, సామాజిక, మానసిక భారాన్ని మోపుతున్న తీవ్రమైన సమస్య. ఈ కొత్త క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మార్చగల శక్తికి గొప్ప ఉదాహరణ. భారతదేశంతో పాటు ప్రపంచ ప్రజల ఆరోగ్యం & జీవితాలను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కట్టుబడి ఉంది" - ఇషా అంబానీ
"క్యాన్సర్‌ను ఓడించే యుద్ధంలో, ఆ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యమైన ఘట్టం. ప్రజలకు సహాయపడే ఒక సాధారణ, అందుబాటులో ధరలో ఉండే పరీక్షను ఆవిష్కరించినందుకు మేము గర్విస్తున్నాం. స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ 24 సంవత్సరాలుగా జెనోమిక్స్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఇది భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో మరో గొప్ప విజయం" - స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ వ్యవస్థాపకుడు & సీఈవో డాక్టర్ రమేష్ హరిహరన్
ఈ టెస్ట్ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, కేన్సర్ నిర్ధరణ పరీక్షల్లో 'గేమ్ ఛేంజర్'గా మారుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
మరో ఆసక్తికర కథనం: కేవలం రూ.30కే 6 నెలల పాటు 'ఫ్రీ'గా ఫుడ్ డెలివరీ - జొమాటో ఆఫర్ ప్లాన్