Zomato Special Offer: కేవలం రూ.30కే 6 నెలల పాటు 'ఫ్రీ'గా ఫుడ్ డెలివరీ - జొమాటో ఆఫర్ ప్లాన్
Zomato Gold Membership: ఇప్పటికే జొమాటో గోల్డ్ సభ్యత్వం ఉన్న కస్టమర్ ఈ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే, అతని ప్రస్తుత సభ్యత్వం చెల్లుబాటు మరో 6 నెలలు పెరుగుతుంది.
Free Food Delivery Offer From Zomato: క్విక్ కామర్స్ చిన్న పట్టణాల్లోకి కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఆహారం కోసం బయటికి వెళ్లే ట్రెండ్ క్రమంగా తగ్గుతోంది. ఫుడ్ డెలివరీ కంపెనీల పుణ్యమా అని ప్రజలు కోరుకున్న హోటల్ లేదా రెస్టారెంట్ ఫుడ్‌ను ఇంటి నుంచి కదలకుండా గుమ్మం వద్దే పొందుతున్నారు. ఫుడ్ డెలివెరీ మార్కెట్‌లో పోటీని తట్టుకుని కస్టమర్లను ఆకర్షించడానికి, ఫుడ్ డెలివరీ కంపెనీలు ఆహార ధరలపై డిస్కౌంట్ వంటి ఆఫర్‌లు కూడా ప్రకటిస్తున్నాయి. దీనివల్ల కస్టమర్‌ల జేబులపై భారం తగ్గుతోంది, కోరుకున్న ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (Zomato), తన కస్టమర్ల కోసం ఇటీవలే ప్రత్యేక ఆఫర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు, యూజర్లు జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్‌ను (Zomato Gold Membership) కేవలం 30 రూపాయలకే పొందొచ్చు. ఈ మెంబర్‌షిప్ కింద, కస్టమర్‌లు 6 నెలల పాటు అనేక గొప్ప ప్రయోజనాలు పొందుతారు. వాటిలో.. ఉచిత డెలివరీ (Free delivery), ఆకర్షణీయమైన తగ్గింపులు (Atractive discounts), ప్రత్యేక ఆఫర్‌లు (Special offers) ఉన్నాయి.
6 నెలల పాటు ఉచిత డెలివరీ ప్రయోజనం
జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ కింద, కస్టమర్‌లు రూ. 200 కంటే ఎక్కువ విలువైన ఆర్డర్‌లపై 7 కిలోమీటర్ల పరిధిలో ఉచిత డెలివరీని పొందవచ్చు. జొమాటో డెలివరీ నెట్‌వర్క్‌లో చేర్చిన రెస్టారెంట్‌లకు ఇది వర్తిస్తుంది. ఇది కాకుండా, కస్టమర్లు ఈ ప్లాన్ ద్వారా ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా ఆస్వాదించవచ్చు.
చెల్లుబాటును కూడా పెంచే అవకాశం
ఒక కస్టమర్ ఇప్పటికే జొమాటో గోల్డ్ సభ్యత్వాన్ని కలిగి ఉన్నట్లయితే, అతను ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా అతని ప్రస్తుత సభ్యత్వం చెల్లుబాటును మరో 6 నెలల పాటు పొడిగించవచ్చు. రూ. 30 చెల్లించి కొత్త ప్లాన్ తీసుకుంటే, ఇప్పటికే ఉన్న ప్లాన్ గడువు ముగిసిన తక్షణం కొత్త ప్లాన్ ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. దీని కారణంగా కస్టమర్ ఎలాంటి అంతరాయం లేకుండా గోల్డ్ మెంబర్‌షిప్ సౌకర్యాలు పొందుతాడు.
బ్లాక్ ఫ్రైడే సేల్ కింద ప్రత్యేక డిస్కౌంట్
జొమాటో గోల్డ్ మెంబర్లు బ్లాక్ ఫ్రైడే సేల్‌లో (Zomato Black Friday Sale) మరింత ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. దేశవ్యాప్తంగా 20,000కు పైబడి ఉన్న పార్టనర్ రెస్టారెంట్‌ల నుంచి ఆర్డర్ చేసినప్పుడు కస్టమర్‌లు 30% వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. జొమాటో డెలివరీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసిన రెస్టారెంట్లు ఉన్న నగరాల్లో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ ఆఫర్‌ను ఎలా పొందాలి?
ముందుగా జొమాటో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత దానిని ఓపెన్ చేయండి. యాప్ పై వైపున కుడి మూలలో ఉన్న మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయండి. జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ ఆఫర్‌కు సంబంధించిన బ్యానర్ అక్కడ కనిపిస్తుంది. ఆ బ్యానర్‌పై క్లిక్ చేసి, పేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి. రూ. 30 చెల్లించిన తర్వాత మీరు జొమాటో గోల్డ్ మెంబర్ అవుతారు. మీరు ఇప్పటికే గోల్డ్ మెంబర్‌గా ఉన్నట్లయితే, ఈ ప్లాన్ కోసం డబ్బులు కట్టిన తర్వాత, మీ మెంబర్‌షిప్ చెల్లుబాటు మరో 6 నెలలు పెరుగుతుంది.
ఫుడ్ డెలివెరీ సెక్టార్‌లో జొమాటోకు పోటీగా నిలుస్తున్న స్విగ్గీ (Swiggy) కూడా ఇలాంటి ఆఫర్‌లను అందిస్తోంది.
మరో ఆసక్తికర కథనం: రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్- ఉచితంగా "అమరన్, లక్కీ భాస్కర్" సహా లేటెస్ట్ సినిమాలు