Union Budget 2025: జాతీయ అణుశక్తి మిషన్ కోసం రూ.20 వేల కోట్లు .. AI అభివృద్ధికి రూ.500 కోట్లు!
Union Budget 2025: భారతదేశం అణుశక్తి ఉన్న దేశంగా మారుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మేరకు చిన్నస్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్ ఏర్పాటు...

Union Budget 2025 Nirmala Sitharaman : భారతదేశం అణుశక్తి ఉన్న దేశంగా మారనుంది..ఈ మేరకు భారత ప్రభుత్వం 20 వేల కోట్ల నిధిని ప్రారంభించింది . ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ మేరకు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అణు రంగానికి నిధిని తెరిచారు. ఇప్పుడు భారతదేశం కొత్త అణు కేంద్రంగా ఉద్భవిస్తుందన్నారు
చిన్నస్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చెప్పారు. ఇందు కోసం రూ.20 వేల కోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుత్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు నిర్మలా సీతారామన్. ఇంకా ప్రైవేట్ రంగంలో క్రియాశీలక భాగస్వామ్యం కోసం అణుశక్తి చట్టానికి, అణుశక్తి పౌర బాధ్యత చట్టానికి సవరణలు చేస్తామని నిర్మలా స్పష్టం చేశారు.
Also Read: బడ్జెట్ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
2025 బడ్జెట్‌లో Artificial intelligence కు పెద్ద పీట వేశారు నిర్మలా సీతారామన్. దీంతో పాటూ ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. బీమా రంగంలో FDIలు 100 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు... అలాగే AI అభివృద్ధికి రూ.500 కోట్లతో 3 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనదేశం సాంకేతిక, విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ మొత్తం కేటాయించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మూడు ఎక్సలెన్స్ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
2023లో వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర పట్టణాలకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మూడు ఎక్సలెన్స్ సెంటర్లు ప్రకటించిన విషయం ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ హైలైట్ చేశారు. 5 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా ప్రకటించారు. ప్రపంచ తయారీ అవకాశాల కోసం అవసరమైన నైపుణ్యాలతో భారతీయ యువతను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించామని చెప్పారు. ఇంకా టెక్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారత్ పాత్రను దృష్టిలో పెట్టుకుని దాదాపు 6500 మంది అదనపు విద్యార్థులకు ఐఐటీలలో మౌలిక సదుపాయాలు విస్తరించేలా ప్రభుత్వం యోచిస్తోందని పార్లమెంట్ ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
Also Read: ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌లకు అదిరిపోయే న్యూస్ - ఏకంగా రూ.20 కోట్ల వరకు రుణాలు
చిన్నస్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని బడ్జెట్ లో ప్రకటించారు నిర్మలా సీతారామన్. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తున్నామని.. ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని చెప్పారు. ఇంకా మెడికల్ టూరిజం ప్రోత్సాహానికి వీసా నిబంధనలు సులభతరం చేయనున్నామని... విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే జనవిశ్వాస్ 2.O బిల్లున ప్రవేశపెట్టనున్నాం అని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్.
Also Read: అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

