News
News
X

Budget 2022: ఈ-పాస్‌పోర్టు ఎలా ఉంటుంది? చిప్‌లో ఏం స్టోర్‌ చేస్తారు?

ఎలక్ట్రానిక్‌ చిప్స్‌తో కూడిన ఈ-పాస్‌పోర్టులను ప్రభుత్వం విడుదల చేయనుంది. 2022-23 ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిసింది. ఈ కొత్త పాస్‌పోర్టులతో మరింత రక్షణ లభిస్తుంది.

FOLLOW US: 

భారత్‌ మరో ముందడుగు వేసింది! ఇకపై ఎలక్ట్రానిక్‌ చిప్స్‌తో కూడిన ఈ-పాస్‌పోర్టులను విడుదల చేయనుంది. 2022-23 ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిసింది. ఈ కొత్త పాస్‌పోర్టులతో మరింత రక్షణ లభిస్తుంది. ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం, వేలి ముద్రలు, ప్రయాణిస్తున్న వివరాలు నిక్షిప్తం చేస్తారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వీటి గురించి వివరించారు.

గతంలోనే ప్రకటన

వాస్తవంగా చిప్‌తో కూడిన ఈ-పాస్‌ పోర్టులను జారీ చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించుకుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (RFID), బయోమెట్రిక్‌ను ఇందులో ఉపయోగిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్‌ భట్టాచార్య ఈ విషయాన్ని గత నెల్లోనే తెలియజేశారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా ఇది ఉంటుందన్నారు. ఈ పాస్‌పోర్టు జాకెట్‌లోని ఎలక్ట్రానిక్‌ చిప్‌లో భద్రత సంబంధ వివరాలు ఎన్‌కోడ్‌ చేసి ఉంటాయి.

Also Read: Budget 2022: గుడ్ న్యూస్.. 80 లక్షల ఇళ్ల నిర్మాణం.. రూ.44 వేల కోట్లు కేటాయింపు

Also Read: Union Budget 2022 : రాష్ట్రాలకు "నిర్మల"మైన కానుక.. వడ్డీ లేని రూ. లక్ష కోట్ల రుణాలు !

జైశంకర్‌ కృషి

ప్రస్తుతం పాస్‌పోర్టులను ముద్రించి ఇస్తున్నారు. చిప్‌ ఆధారిత ఈ-పాస్‌ పోర్టులను జారీ చేయడంపై ఇంతకు ముందే విదేశాంగ మంత్రి జైశంకర్‌ చర్చలు జరిపారు. 'ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌'తో మాట్లాడారు. త్వరలోనే కల నిజం అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఈ-పాస్‌పోర్టు ఫీచర్లు ఇవే

* అధునాతన భద్రతా ఫీచర్లతో ఈ-పాస్‌ పోర్టు ఉంటుంది.
* దరఖాస్తు దారుల సమాచారం, డిజిటల్‌ సంతకం చిప్‌లో భద్రపరుస్తారు.
* ఎవరైనా చిప్‌ను ట్యాంపర్‌ చేయాలని ప్రయత్నిస్తే వెంటనే తెలిసిపోతుంది.
* పాస్‌పోర్టు చెల్లకుండా అవుతుంది.
* ఈ-పాస్‌ పోర్టులను చదివేందుకు కొన్ని సెకన్ల సమయం పడుతుంది.
* అమెరికా ప్రభుత్వ గుర్తింపు పరిశోధన శాలలో దీని నమూనాను పరీక్షించారు.
* ఈ-పాస్‌పోర్టు కవర్లు మందంగా ఉంటాయి. అక్షరాలు కాస్త బోల్డుగా కనిపిస్తాయి.
* బ్యాక్‌ కవర్‌లో చిన్న చిప్‌ ఉంటుంది.
* చిప్‌లో 64కేబీ సమాచారం పడుతుంది.
* 30 పర్యటనల వివరాలు పడుతాయి.

Published at : 01 Feb 2022 12:21 PM (IST) Tags: PM Modi Budget 2022 telugu Budget 2022 Union budget 2022 Budget Telugu News Union Budget 2022 India Union Budget 2022 Live Budget 2022 Live Budget LIVE News Budget 2022 LIVE Updates Nirmal Sitharaman Live Budget 2022 Highlights Budget 2022 Key Announcment Budget 2022 Reaction Budget 2022 Twitter Reaction E-passports Chip Embedded E-passports

సంబంధిత కథనాలు

Crypto Tax India: క్రిప్టో బిల్లుకు లోక్ సభ ఆమోదం, ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ అమలు

Crypto Tax India: క్రిప్టో బిల్లుకు లోక్ సభ ఆమోదం, ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ అమలు

AP Socio Economic Survey: ఏపీ ఆర్థిక సర్వే-రూ.31 వేలు పెరిగిన తలసరి ఆదాయం, వృద్ధి రేటులో భేష్!

AP Socio Economic Survey: ఏపీ ఆర్థిక సర్వే-రూ.31 వేలు పెరిగిన తలసరి ఆదాయం, వృద్ధి రేటులో భేష్!

AP Budget 2022-23: 2,56,257 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌, నాలుగు కీలకాంశాలపైనే దృష్టి పెట్టామన్న ఆర్థిక మంత్రి

AP Budget 2022-23: 2,56,257 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌, నాలుగు కీలకాంశాలపైనే దృష్టి పెట్టామన్న ఆర్థిక మంత్రి

AP Budget 2022 : నేడే ఏపీ బడ్జెట్, ఎన్నో సవాళ్లు - అభివృద్ధా? సంక్షేమమా?

AP Budget 2022 : నేడే ఏపీ బడ్జెట్, ఎన్నో సవాళ్లు -  అభివృద్ధా? సంక్షేమమా?

Telangana budget 2022-23: 75వేల రూపాయల్లోపు రుణం ఉన్న రైతులకు హరీష్‌ తీపి కబురు

Telangana budget 2022-23: 75వేల రూపాయల్లోపు రుణం ఉన్న రైతులకు హరీష్‌  తీపి కబురు

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

భగవంతుని ఆగ్రహానికి గురి కావద్దు- టీటీడీకి విజయ శంకర స్వామి వార్నింగ్

భగవంతుని ఆగ్రహానికి గురి కావద్దు- టీటీడీకి విజయ శంకర స్వామి వార్నింగ్

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?