News
News
X

Telangana Budget 2023 : నేడే తెలంగాణ బడ్జెట్‌- 3 లక్షల కోట్లు దాటిపోనున్న పద్దు!

Telangana Budget 2023 : మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. అందుకే ఈసారి ప్రవేశ పెట్టే బడ్జెట్‌ వాటిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమానికి భారీగా కేటాయింపులు ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

Telangana Budget 2023 : తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఈ విడతకు సంబంధించిన తన ఆఖరి బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల కోట్లతో ఈ పద్దును రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రవేశ పెడతారు. బడ్జెట్‌ను ఆదివారం సమావేశమైన క్యాబినెట్‌ ఆమోదించింది. సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. 

మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. అందుకే ఈసారి ప్రవేశ పెట్టే బడ్జెట్‌ వాటిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమానికి భారీగా కేటాయింపులు ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఈసారి బడ్జెట్‌ 3 లక్షల కోట్లకు పైగానే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. రుణ మాఫీకి కూడా భారీగా నిధులు ఇస్తున్నట్టు సమాచారం. 

కేంద్రం పన్నుల వాటా తగ్గిపోతున్న వేళ సొంతంగా నిధులు వేటను సాగిస్తోంది ప్రభుత్వం. భూముల అమ్మకాలు, పన్నుల పెంపు ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల్లో తెలంగాణ వాటా   2.10 శాతం. ఈ ప్రకారం రూ.21,470 కోట్లు తెలంగాణకు వస్తాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు.. ఇతర గ్రాంట్స్ కూడా కలిపి రాష్ట్రానికి రూ.38 వేల కోట్లు మాత్రమే  అందనున్నాయి. అప్పుల పరిమితిపై కూడా కేంద్రం నియంత్రణ విధించనుంది. ఈ ఏడాది కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులను కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిబంధనల ప్రకారం రావాల్సిన అప్పులను కూడా నియంత్రించడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే.. బడ్జెట్‌లో ఎంత మేర అప్పులను లక్ష్యంగా పెట్టుకున్నా.. వాటి లక్ష్యం మేర బహిరంగ మార్కెట్ రుణాలను సాధించుకోవడం అంత తేలిక కాదు. 

స్వల్పంగా వివిధ రకాల పన్నుల పెంపు ఉండే చాన్స్ ! 

భూముల అమ్మకంపై ఎక్కువ ఆశలు ! 

హైదరాబాద్ శివార్లలో భూములను వేలం వేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకుంది.  ఈ సారి జిల్లాల్లో కూడా భూములు వేలం వేయాలన్న ఆలోచన చేస్తోంది.  నిరుపయోగ భూములు 32 జిల్లాల్లో గుర్తిం చిన వివరాల సేకరణ, అమ్మకం, రాజీవ్‌ స్వగృహ ఇండ్లు, కార్పొ రేషన్‌ పరిధిలోని భూముల అమ్మకం, దిల్‌కు సంబంధించిన భూములపై ఉన్న కేసును పరిష్కరించుకుని వీటి విక్రయాలు నిర్వహించి ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.  తెలిసింది. అదేవిధంగా పలు శాఖల్లో పేరుకుపోయిన బకాయిలు, వన్‌టైం సెటిల్‌మెంట్లకు ఉన్న అవకాశాలు, కేంద్రం వద్ద ఉన్న బకాయిలను వసూలు చేసుకునే అవకాశాలతో బడ్జెట్‌లో అంచనాలను ప్రతిపాదించనున్నట్లుగా తెలుస్తోంది. 

Published at : 06 Feb 2023 08:27 AM (IST) Tags: Telangana Budget Harish Rao CM KCR Budget 2023 Telangana budget 2023 Telangana Finance Minister Harish Rao

సంబంధిత కథనాలు

FM Nirmala Sitharaman: బ్యాంకుల ఎండీలతో నిర్మల మీటింగ్‌ - ఏదైనా షాకింగ్‌ న్యూస్‌ ఉండబోతోందా!

FM Nirmala Sitharaman: బ్యాంకుల ఎండీలతో నిర్మల మీటింగ్‌ - ఏదైనా షాకింగ్‌ న్యూస్‌ ఉండబోతోందా!

AP Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట, దేనికెంత కేటాయించారంటే?

AP Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట, దేనికెంత కేటాయించారంటే?

2 లక్షల 79 వేల కోట్లతో ఏపీ బడ్జెట్‌- రెవెన్యూ లోటు 22,316 కోట్లుగా పేర్కొన్న బుగ్గన

2 లక్షల  79  వేల కోట్లతో ఏపీ బడ్జెట్‌- రెవెన్యూ లోటు  22,316 కోట్లుగా పేర్కొన్న బుగ్గన

బడ్జెట్‌ 2023-24కు ఏపీ కేబినెట్ ఆమోదం- అన్ని వర్గాలకు, అభివృద్ధికి ప్రాధాన్యత ఉంటుందన్న బుగ్గన

బడ్జెట్‌ 2023-24కు ఏపీ కేబినెట్ ఆమోదం- అన్ని వర్గాలకు, అభివృద్ధికి ప్రాధాన్యత ఉంటుందన్న బుగ్గన

PM Modi: ప్రైవేటు కంపెనీలకు ఈ రంగం ఒక బంగారు గని - ప్రధాని మోదీ

PM Modi: ప్రైవేటు కంపెనీలకు ఈ రంగం ఒక బంగారు గని - ప్రధాని మోదీ

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204