అన్వేషించండి

Budget 2025: బడ్జెట్‌ బాక్స్‌ నుంచి సీనియర్ సిటిజన్‌కు ఎంత ప్రయోజనం లభిస్తుంది?

Senior Citizen Budget 2025: రాబోయే బడ్జెట్‌లో, రూ.10 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను విధించకూడదని సీనియర్ సిటిజన్స్‌ డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్‌ విషయంలోనూ ఆశగా ఉన్నారు.

Expectations For Senior Citizen From Union Budget 2025: శనివారం రానున్న భారతదేశ బడ్జెట్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలందరి ఆశలు ఆకాశాన్ని అంటాయి. ప్రతి వర్గానికీ ఖచ్చితమైన ప్రయోజనాలు ఉంటాయని అంతా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బడ్జెట్‌ బండిలో సీనియర్‌ సిటిజన్‌ సీట్‌ ఎక్కడ ఉంటుంది?, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Nirmala Sitharaman) సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ఏం చేస్తారు?, ఎంత ప్రయోజనం కల్పిస్తారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

బడ్జెట్‌ ప్రయోజనాల్లో తమకూ ఆకర్షణీయమైన వాటా ఉండాలని వృద్ధులు కోరుకుంటున్నారు. ఇదే జరిగితే.. రిటైర్మెంట్‌ను ఆస్వాదించడంలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఎందుకంటే, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మూలధన డిపాజిట్ల రాబడి (Return on deposits)పై ఒత్తిడిని పెంచుతోంది, వృద్ధుల ఆదాయాన్ని తగ్గిస్తోంది. కాబట్టి, సీనియర్ సిటిజన్‌ల విషయంలో, రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఆదాయ పన్ను విధించకూడదని ‍‌(Income tax should not be levied on annual income up to Rs.10 lakhs) వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు, పెన్షన్ ప్రయోజనాలపై గరిష్ట రాయితీ పొందాలని కూడా ఆశిస్తున్నారు, తద్వారా గరిష్ట మొత్తంలో పెన్షన్ వారి చేతుల్లోకి వస్తుంది. 

పొదుపు పథకాలపై కూడా వడ్డీ పెరుగుతుందని ఆశ
కుటుంబం కోసం & దేశం కోసం పని చేసి, అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వయస్సులో, తమకు ఆనందం కలిగించేలా బడ్జెట్‌ ఉండాలన్నది సీనియర్‌ సిటిజన్ల భావన. దీనికోసం, పొదుపు పథకాల (High interest on senior citizen savings schemes)పై ఎక్కువ వడ్డీని కోరుతున్నారు. తద్వారా, నెలవారీ ఆదాయం లేకపోయినప్పటికీ, డిపాజిట్ చేసిన డబ్బుపై గరిష్ట రాబడిని పొందవచ్చు, వృద్ధాప్య అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.   

పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం, సీనియర్ సిటిజన్లకు రిస్క్ లేని & దీర్ఘకాలిక పెట్టుబడి సాధనం అవసరం ఉంది, ఇది మార్కెట్ రేటు కంటే ఎక్కువ రాబడిని ఇచ్చేలా ఉండాలి. శనివారం నాటి బడ్జెట్‌లో ఇలాంటి ప్రకటన రావాలి.

పింఛను ఆదాయం మాత్రమే వస్తుంటే ఐటీఆర్ నుంచి మినహాయింపు
ఆదాయ పన్ను చట్టం ‍‌(Income Tax Act) ప్రకారం, 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌ల ఆదాయ మూలం పెన్షన్ & అదే ఖాతా నుంచి పొందిన వడ్డీ మాత్రమే అయితే.. ఆదాయ పన్ను రిటర్న్ (ITR) దాఖలు నుంచి వారికి మినహాయింపు ఉంటుంది. ఈ సదుపాయాన్ని 70 ఏళ్లకు తగ్గించడం ద్వారా, పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లకు ఈ ప్రయోజనం కల్పించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

కొత్త పన్ను విధానం (New tax regime)లో, సీనియర్‌ సిటిజన్‌లకు ప్రాథమిక మినహాయింపు పరిమితిని కూడా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. మెట్రో నగరాల్లో HRA ఆధారంగా అందుతున్న ప్రయోజనాలను కూడా పెంచుతారనే ఆశ వృద్ధుల్లో వ్యక్తమవుతోంది. 

మరో ఆసక్తికర కథనం: బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ కోసం నిర్మలమ్మ ట్యాబ్‌ ఎందుకు తీసుకెళ్తారు, అది ఏ బ్రాండ్‌? 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
Kantara Chapter 1 : ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
Embed widget