Budget 2025 Agriculture Sector: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త, వ్యవసాయానికి నిర్మలమ్మ ఏం ఇచ్చిందంటే!
Budget 2025 Agriculture Sector Highlights: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Budget 2025 Agriculture Sector Highlights: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో రైతులకు శుభవార్త చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని కేంద్రం పెంచింది. ఇప్పటి వరకు ఇచ్చే 3 లక్షల రూపాయలను ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు కేంద్రం తన బడ్జెట్‌లో ప్రకటించింది. భారతదేశ సాంప్రదాయ పత్తి పరిశ్రమను ప్రోత్సహించడంపై మోదీ సర్కార్ ఫోకస్ చేసింది. పత్తి ఉత్పత్తికి 5 సంవత్సరాలలో చేయూత అందించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
జిల్లాలను అభివృద్ధి చేసి వలసలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 100 జిలాల్లోల ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పెట్టబోతున్నట్టు ఆర్థికమంత్రి ప్రకటించారు. దీని ద్వారా 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభించనుంది. ప్రజలకు తక్కువ ధరకే ఎరువులు అందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం మూడు యూరియా ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
ఈసారి చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలతో పాటు స్టార్టప్‌లపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వారి కోసం కేంద్రంలో ప్రత్యేక ఫండ్ పెట్టనుంది. ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌లకు గరిష్టంగా 20 కోట్ల రుణాలు ఇవ్వనుంది. వారికి సైతం కిసాన్ క్రెడిట్ కార్డ్ తరహాలో ప్రత్యేక క్రెడిట్ కార్డులు జారీ చేయాలని చూస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల పేర్కొన్నారు.





















