News
News
X

Budget 2023: కేంద్ర బడ్జెట్‌ నుంచి స్టాక్‌ మార్కెట్‌ ఏం కోరుకుంటోంది, ఇన్వెస్టర్ల ఆశలేంటి?

మార్కెట్‌ ఆశించినట్లు సమతౌల్య బడ్జెట్‌ వస్తే, మార్కెట్ కదలికల మీద అది గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

FOLLOW US: 
Share:

Budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను (Union Budget 2023) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, మోదీ ప్రభుత్వం 2.0 ప్రవేశపెట్టే పూర్తి స్థాయి చివరి ఇదే. ఈ పద్దు మీద ప్రతి రంగంలో, ప్రతి వర్గంలోఎన్నెన్నో అంచనాలు కనిపిస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదార్ల వరకు కేంద్ర పద్దు కోసం ప్రత్యేక ఆశలతో ఎదురు చూస్తున్నారు. 

దేశంలోని అన్ని రకాల పెట్టుబడులకు సహకరించి, ఆర్థిక వృద్ధికి ఇతోధికం సాయపడిన పెట్టుబడిదార్లు, కేంద్రం ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలో తిరిగి ఆశిస్తున్నారు. ముఖ్యంగా సమతుల బడ్జెట్‌ ఉంటుందని భావిస్తున్నారు. బడ్జెట్‌ 2023 ద్వారా, కేంద్ర ప్రభుత్వం ఉపాధిని సృష్టిని, మౌలిక సదుపాయాలపై వ్యయాలను పెంచాలని, ద్రవ్య లోటును అధిగమించాలని, భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు వీలైనన్ని నిర్ణయాలు, ప్రతిపాదనలు తీసుకోవాలని ఆశిస్తున్నారు. మార్కెట్‌ ఆశించినట్లు సమతౌల్య బడ్జెట్‌ వస్తే, మార్కెట్ కదలికల మీద అది గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్ల మందగమనం
కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో, కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్‌ ఒక రేంజ్‌ బౌండ్‌లోనే అప్‌ & డౌన్ చేస్తోంది. ఇండెక్స్‌ పడినప్పుడు స్టాక్స్‌ను కొంటున్నారు తప్ప, ఆ తర్వాత ఫాలో-అప్‌ కొనుగోళ్లు చేయడం లేదు. అందువల్లే ఇండెక్స్‌ ఏకీకృతం అయింది. జనవరి నెలలో BSE సెన్సెక్స్ ‌(హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రభావాన్ని మినహాయించి చూస్తే) దాదాపు ఫ్లాట్‌గా ఉంది. అదే సమయంలో, కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్లను ర్యాలీ చేయించగలిగేలా ప్రత్యేకంగా లేవు. కేవలం ఐటీ, బ్యాంక్ వంటి కొన్ని సూచీల్లో మాత్రమే కొంత సానుకూల కదలిక కనిపించింది.

గత పదేళ్లలో పరిస్థితి ఎలా ఉంది?
చరిత్రను తిరగేస్తే, సాధారణ బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లలో నీరసమైన వాతావరణం కనిపిస్తుంది. గత నాలుగు సంవత్సరాల మార్కెట్ డేటా ప్రకారం... రెండు నెలల వ్యవధిలో ‍(బడ్జెట్‌కు ఒక నెల ముందు, ఒక నెల తర్వాత) నాలుగు సంవత్సరాల్లో 3 సార్లు సెన్సెక్స్ (BSE Sensex) నెగెటివ్‌గా ముగిసింది. యూనియన్‌ బడ్జెట్‌కు నెల ముందు, నెల తర్వాత.. ఈ రెండు వైపులా మార్కెట్‌ భారీగా పడిపోయింది. 2019 జులై బడ్జెట్‌ సమయంలో, రెండు నెలల వ్యవధిలో ఈ ఇండెక్స్ 8.4% నష్టంతో ముగిసింది. గత 10 ఏళ్లలో బడ్జెట్ కంటే ముందు 6 రెట్లు పెరగ్గా, బడ్జెట్ తర్వాత 6 రెట్లు తగ్గింది.

2024 సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కాబట్టి... కాపెక్స్, రూరల్‌ ఇండియా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులతో పాటు మరికొన్ని ప్రధాన ప్రాజెక్ట్ ప్రకటనలను బడ్జెట్‌లో వినే అవకాశం ఉందని ప్రభుదాస్ లిల్లాధర్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ చెబుతున్నారు. REC, PFC వంటి బడ్జెట్‌తో సంబంధం ఉన్న స్టాక్స్‌; IRB, GMR ఇన్‌ఫ్రా వంటి ఇన్‌ఫ్రా స్టాక్స్‌; రైల్‌టెల్, RITES, IRFC, IRCON వంటి రైల్వే స్టాక్స్‌, ఎరువుల స్టాక్స్‌ ఇకపై ర్యాలీ చేస్తాయని అంచనా వేశారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 27 Jan 2023 02:17 PM (IST) Tags: Nirmala Sitharaman Finance Minister Budget Expectations Stock Market Expectations Stock investors Industry Budget 2023

సంబంధిత కథనాలు

Stock Market News: బాగా పెరిగి మళ్లీ డౌన్‌ - సెన్సెక్స్‌  126, నిఫ్టీ 40 పాయింట్లు అప్‌!

Stock Market News: బాగా పెరిగి మళ్లీ డౌన్‌ - సెన్సెక్స్‌ 126, నిఫ్టీ 40 పాయింట్లు అప్‌!

Home Loan Rates: తెలియకుండానే రెండేళ్లు అదనంగా హోమ్‌లోన్‌ వడ్డీ కట్టేస్తున్న జనం! రీఫైనాన్సింగ్‌ బెటర్‌!

Home Loan Rates: తెలియకుండానే రెండేళ్లు అదనంగా హోమ్‌లోన్‌ వడ్డీ కట్టేస్తున్న జనం! రీఫైనాన్సింగ్‌ బెటర్‌!

Mamaearth IPO: మామఎర్త్‌ ఐపీవోకి బ్రేక్‌, పబ్లిక్‌ ఆఫర్‌ను పక్కనబెట్టిన స్కిన్‌ కేర్ కంపెనీ

Mamaearth IPO: మామఎర్త్‌ ఐపీవోకి బ్రేక్‌, పబ్లిక్‌ ఆఫర్‌ను పక్కనబెట్టిన స్కిన్‌ కేర్ కంపెనీ

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

Cryptocurrency Prices: క్రిప్టో కరెన్సీ ఏ వైపు? బిట్‌కాయిన్‌కు వరుస నష్టాలు

Cryptocurrency Prices: క్రిప్టో కరెన్సీ ఏ వైపు? బిట్‌కాయిన్‌కు వరుస నష్టాలు

టాప్ స్టోరీస్

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక

Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక

HBD Ram Charan: చెర్రీకి ఎన్టీఆర్, మహేష్ బాబు శుభాకాంక్షలు, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్!

HBD Ram Charan: చెర్రీకి ఎన్టీఆర్, మహేష్ బాబు శుభాకాంక్షలు, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్!

కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!

కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!