Budget 2022: దయ చూపాలమ్మా 'నిర్మలమ్మ'! బడ్జెట్‌కు ముందు వేతన జీవుల వేడుకోలు!!

కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండటంతో కొన్ని రిబేట్లు ఇస్తారేమోనని వేతన జీవులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉద్యోగులకు ఖర్చులు పెరిగాయి.

FOLLOW US: 

Budget 2022 Telugu, Union budget 2022: ఫిబ్రవరి 1, కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలమ్మ' తమకు మరిన్ని మినహాయింపులు ఇవ్వాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. దీనికి తోడు రిబేట్లు, అదనపు అలవెన్సులు వచ్చేలా చూడాలని అర్థిస్తున్నారు.

ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండటంతో కొన్ని రిబేట్లు ఇస్తారేమోనని వేతన జీవులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉద్యోగులకు ఖర్చులు పెరిగాయి. ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, ఇంట్లో కార్యాలయం కోసం ఫర్నీచర్‌, అదనంగా విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. పైగా ద్రవ్యోల్బణం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. వైద్య, ఆరోగ్య ఖర్చులూ కొండెక్కాయి.

Also Read: ITR Filing Date Extended: టాక్స్‌ పేయర్లకు గుడ్‌న్యూస్‌! మార్చి 15 వరకు గడువు పెంపు

Also Read: Paytm Shares Down: ఇదేంది సామి!! 50% పతనమవ్వనున్న పేటీఎం షేరు! రూ.900కి వస్తుందంటున్న బ్రోకరేజ్‌ సంస్థలు

Also Read: Vodafone Idea Shareholders: వొడాఫోన్‌ ఐడియాలో కేంద్రానికి '36%' వాటా.. 19% నష్టపోయిన షేరు!!

అందుకే ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితి పెంచాలని ఉద్యోగ వర్గాలు కోరుకుంటున్నాయి. 2018లో ఉద్యోగుల వేతనం నుంచి రూ.50,000 వరకు పన్ను మినహాయింపుగా ఇస్తున్నారు. దీనిని మరింత పెంచాలని వారు వినతి చేస్తున్నారు. 'కరోనా వల్ల ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. దీనివల్ల వారి ఖర్చులు పెరిగాయి. కాబట్టి యజమానులు వారికి ఆ ఖర్చులను అలవెన్స్‌ రూపంలో ఇవ్వాలి' అని డెలాయిట్‌ ఇండియా ప్రిబడ్జెట్‌ అంచనాల్లో వివరించింది. ఇప్పుడిస్తున్న రూ.50,000కు అదనంగా మరో రూ.50000 వరకు మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది.

మరికొన్ని సంస్థలైతే ఉద్యోగుల ఆదాయపన్ను విధానంలో మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నాయి. రాబోయే ఆర్థిక ఏడాది నుంచి కొత్త వేతన విధానం అమల్లోకి వస్తుందని భావిస్తున్నాయి. ఇక ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) ఇంటి నుంచి పని చేయడం వల్ల అయ్యే ఖర్చులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. రూ.లక్ష వరకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. మరి 'నిర్మలమ్మ' ఏం చేస్తుందో చూడాలి!!

Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!

Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్‌.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్‌!

Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్‌! సర్వీస్‌ ఛార్జెస్‌ పెంచేసిన పంజాబ్‌ బ్యాంక్‌

Published at : 12 Jan 2022 05:56 PM (IST) Tags: Nirmala Sitharaman Employees Abp Desam Business Budget 2022 telugu Budget 2022 Union budget 2022 Budget 2022 for Salaried Budget 2022 Taxpayers Expectation

సంబంధిత కథనాలు

Delhivery Listing Price: డెల్హీవరీ లిస్టింగ్‌ ప్రీమియం తక్కువే! ముగింపులో రూ.49 లాభం

Delhivery Listing Price: డెల్హీవరీ లిస్టింగ్‌ ప్రీమియం తక్కువే! ముగింపులో రూ.49 లాభం

Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! రేంజ్‌బౌండ్‌లో కదలాడిన సూచీలు చివరికి..!

Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! రేంజ్‌బౌండ్‌లో కదలాడిన సూచీలు చివరికి..!

Cryptocurrency Prices Today: భారీ నష్టాల్లో క్రిప్టోలు! బిట్‌కాయిన్‌ @ రూ.24.20 లక్షలు

Cryptocurrency Prices Today: భారీ నష్టాల్లో క్రిప్టోలు! బిట్‌కాయిన్‌ @ రూ.24.20 లక్షలు

Petrol-Diesel Price, 24 May: వాహనదారులకు షాక్! నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే తగ్గుదల

Petrol-Diesel Price, 24 May: వాహనదారులకు షాక్! నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే తగ్గుదల

Gold-Silver Price: స్వల్పంగా ఎగబాకిన బంగారం ధరలు, నేటి ధరలు ఇవీ - వెండి కూడా నేడు పైపైకి

Gold-Silver Price: స్వల్పంగా ఎగబాకిన బంగారం ధరలు, నేటి ధరలు ఇవీ - వెండి కూడా నేడు పైపైకి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!