By: ABP Desam | Updated at : 28 Jan 2022 02:12 PM (IST)
Edited By: Ramakrishna Paladi
బడ్జెట్ 2022, ఆరోగ్య రంగం
Budget 2022 Telugu Healthcare Sector Expectations: వైద్య, ఆరోగ్య రంగంలో సంస్కరణలు ఎంత అవసరమో కరోనా మహమ్మారి నొక్కి చెప్పింది. ఇప్పుడున్న మౌలిక సదుపాయాలు అసలు సరిపోవని చూపించింది. మున్ముందు ఇలాంటి మహమ్మారుల నుంచి దేశాన్ని కాపాడాలంటే మరిన్ని నిధుల కేటాయింపులు అవసరం. అందుకే త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఔషధాలపై పన్నులు తగ్గించాలని కోరుతున్నారు.
కేటాయింపులు పెంచాలి: భారత్‌లో ప్రజారోగ్యానికి కేటాయిస్తున్న మొత్తం జీడీపీలో 1.2 శాతమే. ఇది ఏమాత్రం సరిపోదు. ఈ సారి బడ్జెట్‌లో జీడీపీలో 2.5-3.5 శాతం వరకు ఆరోగ్య రంగానికి నిధులు కేటాయించాలి.
విధాన సంస్కరణలు: ఆరోగ్య రంగంలో సంస్కరణలు చేపట్టాలి. వృద్ధుల సంక్షేమం కోసం జాతీయ మిషన్ ఏర్పాటు చేయాలి. సంస్కరణల కోసం ఒకే పాలక మండలి ఉండాలి.
ఆర్థిక రక్షణ: చిన్నారులు, యువత కోసం తప్పనిసరి, పన్నుల్లో ఆదా చేసుకోగలిగే హెల్త్ సేవింగ్ ప్లాన్ తీసుకురావాలి. పెద్దలు, చిన్నారులకు అన్ని వ్యాధులను కవర్ చేసేలా ప్రైవేటు ఆరోగ్య బీమాలో సంస్కరణలు తీసుకురావాలి.
పీపీపీ విధానం అమలు: వైద్యారోగ్య రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరిగేలా, ప్రజలకు అవకాశం కల్పించేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌కు వీలయ్యే విధానాలను గుర్తించి అమలు చేయాలి.
అత్యుత్తమ శిక్షణ: రోగులకు అత్యుత్తమ సేవలు అందించేలా మానవ వనరులకు శిక్షణ ఇప్పించాలి. డిజిటల్ మౌలిక సదుపాయాలు రూపొందించాలి. ఈ రంగం అభివృద్ధి చెందేలా మద్దతు కల్పించాలి.
పన్ను సబ్సిడీలు: సీనియర్ కేర్ సేవలు, ఉత్పత్తులు స్వీకరించే వినియోగదారులు, అందించే ఉత్పత్తిదారులకు పన్ను మినహాయింపులు కల్పించాలి. సీనియర్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. ఆరోగ్య రంగంలో అంకుర సంస్థలు, వ్యాపారస్థులకు పన్ను ప్రయోజనాలు కల్పించాలి.
అన్నీ పెంచాలి: కరోనా కాలంలో ఆస్పత్రుల్లో పడకల కొరత వేధించింది. సరిపడా ఆక్సీజన్ సరఫరా లేకపోవడంతో చాలామంది మరణించారు. ఇలాంటివి జరగకుండా దేశంలో ప్రతి వెయ్యి మందికి వైద్యులు, పడకలు, ఆస్పత్రుల సంఖ్య పెంచాలని కేపీఎంజీ కోరుతోంది. ప్రపంచ సగటు 2.7తో పోలిస్తే దేశంలో 1.1గా ఉంది.
వైద్య రంగంలో రీట్స్: కాలం గడిచే కొద్దీ దేశంలో ఆరోగ్య రంగం మెరుగైంది. ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో ఆస్పత్రులు నిర్మించాలి. వైద్యుల సంఖ్య పెంచాలి. జీడీపీతో పోలిస్తే కేటాయింపులు పెంచాలి. హెల్త్‌కేర్‌లోనూ రీట్స్‌ను రూపొందించాలి.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!
Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Stock Market Weekly Review: గతవారం నష్టంతో పోలిస్తే రూ.10 లక్షల కోట్లు మిగిలినట్టే!
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి