అన్వేషించండి

New Home Loan Rules : హోమ్ లోన్ కోసం చూస్తున్నారా ? ఆర్బీఐ పెట్టిన కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి

హోమ్ లోన్ రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఇస్తున్న దాని కన్నా తక్కువ మొత్తం మంజూరు అవుతుంది.


New Home Loan Rules : గృహరుణల విషయంలో ఆర్బీఐ కొత్త రూల్స్ పెట్టింది. రుణం వడ్డీ రేట్లు ఖరారు చేసే వద్దతిని కఠినం చేసింది ఫలితంగా ఈఎంఐలు పెరగనున్నాయి.  ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కొన్ని గృహ రుణాలకు ఈఎంఐ పెంచాల్సి ఉంటుంది. ఆర్బీఐ తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఇకపై బ్యాంకులు రుణగ్రహీతలకు వడ్డీ రేట్ల రీసెట్ సమయంలో ఫిక్స్ డ్ రేట్ లోన్ కు మారే వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. అలాగే, భవిష్యత్తులో రుణాన్ని ఫ్లోటింగ్ నుండి నిర్ణీత రేటుకు మార్చడానికి ఛార్జీలను ప్రకటించాల్సి ఉంది. రేట్లు విపరీతంగా పెరిగితే, రుణదాతలు రుణంపై నెలవారీ వడ్డీని ఈఎంఐ కవర్ చేస్తూనే ఉండేలా చూసుకోవాలి. అలాగే  ఈఎంఐ చెల్లించిన తర్వాత రుణ బకాయిలు ము నుపటి నెల స్థాయి నుండి పెరగకుండా చూసుకోవాలి.
 
ఇటీవలి కాలంలో  వడ్డీ రేట్లు ఆరు శాతం వరకు పెరిగాయి. రుణాలు ఇచ్చే సంస్థలు ఎల్లప్పుడూ ఈఎంఐని మార్చరు.  ఈఎంఐ కాలాన్ని  పొడిగించడం ద్వారా ఎక్కువ వడ్డీని పొందుతారు. కొత్త నిబంధనల ప్రకారం రుణదాతలు ప్రస్తుత రేటు కంటే ఎక్కువ రీపేమెంట్ సామర్థ్యాన్ని లెక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బ్యాంకులు లెక్కిస్తున్నాయి. ఉదాహరణకు  రూ .1 కోటి రుణానికి రూ .74,557 ఈఎంఐని 6.5% వడ్డీ రేటుతో  భరించగలిగే వ్యక్తికి రుణం ఇవ్వాల్సి వస్తే..  11 శాతం వడ్డీ రేటుతో మంజూరు అయ్యే రుణం  రూ.72 లక్షలకు తగ్గుతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఫిక్స్ డ్ రేట్ లోన్స్ ఇవ్వడం లేదు  
 
కాలపరిమితి పొడిగింపు, ఈఎంఐ పెరుగుదలకు తగినంత మార్జిన్ అందుబాటులో ఉండేలా రుణగ్రహీతల రీపేమెంట్ సామర్థ్యాన్ని  సంస్థలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ తెలిపింది. వడ్డీ రేట్లు పెరిగిన తర్వాత బ్యాంకులు గృహ రుణాలను అనవసరంగా పొడిగించడంపై ఆందోళన ఉన్నందున   ఈఎంఐ నిబంధనలను సవరిస్తుందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇప్పటికే ప్రకటించారు.  రుణగ్రహీత చెల్లింపు సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని బ్యాంకులు తగిన కాలపరిమితిని అంచనా వేయాల్సి ఉంటుందని, వయస్సును బట్టి అతని చెల్లింపు సామర్థ్యం ఎంతకాలం ఉంటుందో అంచనా వేయాల్సి ఉంటుందని  ఆర్బీఐ చీఫ్ ప్రకటించారు. 

కొత్త, పాత రుణగ్రహీతలకు 2023 డిసెంబర్ 31 నుంచి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. రుణదాతలు ఇప్పటి వరకు వసూలు చేసిన అసలు మరియు వడ్డీ, ఈఎమ్ఐ మొత్తం, మిగిలి ఉన్న ఈఎంఐల సంఖ్య మరియు మొత్తం రుణ కాలపరిమితికి వార్షిక వడ్డీ రేటు / వార్షిక శాతం రేటు  వెల్లడించాలి కాబట్టి ఇవి మరింత పారదర్శకతను తెస్తాయని ఆర్బీఐ చెబుతోంది.  చారిత్రాత్మకంగా రుణదాతలు రుణగ్రహీత అర్హతను నిర్ణయించేటప్పుడు ఆదాయం పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటారు.  సమాన నెలవారీ వాయిదా రుణాలతో పాటు, వివిధ కాలపరిమితి కలిగిన అన్ని సమాన వాయిదా ఆధారిత రుణాలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది.  

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget