News
News
X

Bank Strike: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయా, సమ్మెపై ఏ నిర్ణయం తీసుకున్నారు?

వారంలో ఐదు రోజుల బ్యాంకింగ్, పింఛను పెంపు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అనే మూడు ఉమ్మడి అంశాల మీద జనవరి 31న చర్చించాలని రాజీ సమావేశంలో నిర్ణయించారు.

FOLLOW US: 
Share:

Bank Strike: జనవరి 30, 31 తేదీల్లో (సోమవారం, మంగళవారం) మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే నిరభ్యంతరంగా బ్యాంకులకు వెళ్లవచ్చు. ఎందుకంటే, ఆ రెండు రోజుల్లో తలపెట్టిన బ్యాంక్‌ సమ్మె వాయిదా పడింది. ముంబైలో జరిగిన రాజీ సమావేశంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఏకాభిప్రాయానికి రావడంతో.. జనవరి 30, 31 తేదీల్లో తలపెట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను అన్ని బ్యాంక్‌ యూనియన్లు వాయిదా వేశాయి.

తమ డిమాండ్లపై బ్యాంకు యూనియన్లు జనవరి 31న చర్చిస్తాయని బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. జనవరి 31న యూనియన్లతో సమావేశం నిర్వహించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) అంగీకరించిందని వెల్లడించారు. వారంలో ఐదు రోజుల బ్యాంకింగ్, పింఛను పెంపు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అనే మూడు ఉమ్మడి అంశాల మీద జనవరి 31న చర్చించాలని శుక్రవారం జరిగిన రాజీ సమావేశంలో నిర్ణయించారు. ఇతర సమస్యల మీద సంబంధిత అధికారులు, కార్మిక సంఘాలతో విడివిడిగా చర్చిస్తామన్నారు.

బ్యాంకు యూనియన్ల సమూహం UFBU, తమ వివిధ డిమాండ్ల కోసం సమ్మె చేయాలని గతంలోనే నిర్ణయించింది. తమ డిమాండ్లను చాలా కాలం క్రితమే మంత్రివర్గం ముందు ఉంచినా, ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీహెచ్ వెంకటాచలం ఆవేదన వ్యక్తం చేశారు. 

బ్యాంక్‌ సిబ్బంది డిమాండ్లు ఇవి
బ్యాంకు యూనియన్లు 5 రోజుల బ్యాంకింగ్ వర్కింగ్ కల్చర్‌తో పాటు అనేక డిమాండ్లు చేశాయి. పెన్షన్ అప్‌గ్రేడేషన్, ఇతర సమస్యలకు పరిష్కారం, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) రద్దు, వేతన సవరణ కోసం తక్షణమే చర్చలు ప్రారంభించడం, అన్ని కేడర్‌లలో ఖాళీల భర్తీ కోసం వెంటనే రిక్రూట్‌మెంట్ వంటి అనేక సమస్యలను బ్యాంక్ యూనియన్లు వెల్లడించాయి. డిమాండ్స్‌ చార్టర్‌పై చర్చలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ, UFBU సమ్మెకు పిలుపునిచ్చింది.

ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు 10 రోజుల సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం... 2023 ఫిబ్రవరి నెలలో బ్యాంకుకు చాలా సెలవులు ఉన్నాయి. ఆ నెల మొత్తంలో, వివిధ రాష్ట్రాల్లో మొత్తం 10 రోజుల పాటు బ్యాంకులను మూసివేస్తారు. ఫిబ్రవరి నెలలో వచ్చే సెలవుల్లో శని, ఆదివారాలు కాకుండా.. మహాశివరాత్రి వంటి పర్వదినాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలోని మొత్తం 28 రోజుల్లో, వివిధ రాష్ట్రాల్లో 10 రోజులు బ్యాంకులు పని చేయవు. ఈ సెలవు తేదీలు వివిధ రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. 

2023 ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలవుల జాబితా ఇది:

ఫిబ్రవరి 5, 2023 - ఆదివారం (భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 11, 2023 - రెండో శనివారం (భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 12, 2023 - ఆదివారం (భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 15, 2023- Lui-Ngai-Ni పండుగ (హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 18, 2023 - మహాశివరాత్రి (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, హైదరాబాద్, కాన్పూర్, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పుర్, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 19, 2023 - ఆదివారం (భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 20, 2023 - మిజోరం రాష్ట్ర దినోత్సవం (ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 21, 2023- లోసార్ పండుగ (గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 25, 2023 - మూడో శనివారం (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 26, 2023 - ఆదివారం (భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు)

Published at : 28 Jan 2023 01:57 PM (IST) Tags: Bank bank strike Bank Holidays in February 2023 Bank Holidays in February February Bank Holidays

సంబంధిత కథనాలు

Gold-Silver Price 26 March 2023: బంగారం శాంతించినా వెండి పరుగు ఆగలేదు, ₹76 వేల మార్క్‌ను చేరింది

Gold-Silver Price 26 March 2023: బంగారం శాంతించినా వెండి పరుగు ఆగలేదు, ₹76 వేల మార్క్‌ను చేరింది

Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?

Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?

RBI: ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

RBI: ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

Vedanta: డబ్బు కోసం వేదాంత పడుతున్న పాట్లు వర్ణనాతీతం, RBI అనుమతి కోసం విజ్ఞప్తి

Vedanta: డబ్బు కోసం వేదాంత పడుతున్న పాట్లు వర్ణనాతీతం, RBI అనుమతి కోసం విజ్ఞప్తి

SBI Fixed Deposit: 7.6% వడ్డీ అందించే ఎస్‌బీఐ స్కీమ్‌ - ఆఫర్‌ ఈ నెలాఖరు వరకే!

SBI Fixed Deposit: 7.6% వడ్డీ అందించే ఎస్‌బీఐ స్కీమ్‌ - ఆఫర్‌ ఈ నెలాఖరు వరకే!

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం