అన్వేషించండి

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు 18 రోజులు సెలవులు, బ్యాంక్‌ సిబ్బంది సమ్మె కూడా!

Bank Holidays: డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 18 రోజుల సెలవులు వచ్చాయి. స్థానిక పండుగలు, సందర్భాల కారణంగా ఈ సెలవులు ఓ రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి మారుతుంటాయి.

Bank Holidays list in December 2023: డిసెంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 18 రోజులు సెలవులు వచ్చాయి. క్రిస్మస్‌తో పాటు కొన్ని స్థానిక పండుగలు, సందర్భాల కారణంగా బ్యాంకులు మూతబడతాయి. ఈ హాలిడేస్‌ లిస్ట్‌లో.. రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి. వీటితో పాటు డిసెంబరు 4 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెకు దిగుతున్నాయి. కాబట్టి, వచ్చే నెలలో మీకు బ్యాంక్‌లో మీకు ఏ పని ఉన్నా, ముందు బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను చూసుకోండి. 

డిసెంబర్‌ నెలలో బ్యాంక్‌ సెలవులు 1వ తేదీన అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో ప్రారంభమై, 31వ తేదీన ఆదివారంతో ముగుస్తాయి. స్థానిక పండుగలు, సందర్భాల కారణంగా బ్యాంకు సెలవులు ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి  మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్‌ కస్టమర్ల కోసం, ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్‌ సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. 

2023 డిసెంబర్‌ నెలలో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in December 2023):

డిసెంబర్ 1, 2023 - రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 3, 2023 - ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 4, 2023  - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివల్ కారణంగా గోవాలో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 9, 2023  - రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 10, 2023 - ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 12, 2023  - ప-టోగన్ నెంగ్మింజా సంగ్మా కారణంగా మేఘాలయలో బ్యాంకులను మూసివేస్తారు
డిసెంబర్ 13 & 14, 2023 - లోసంగ్/నామ్‌సంగ్ కారణంగా సిక్కింలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 17, 2023 - ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 18, 2023  - యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్ 19, 2023  - విమోచన దినోత్సవం కారణంగా గోవాలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 23, 2023 - నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 24, 2023  - ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 25, 2023  - క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 26, 2023  - క్రిస్మస్ వేడుకల కారణంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 27, 2023 - క్రిస్మస్ వేడుకల కారణంగా నాగాలాండ్‌లో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 30, 2023 - యు కియాంగ్ నంగ్‌బా దృష్ట్యా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్ 31, 2023 - ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

డిసెంబర్‌ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్‌ సిబ్బంది సమ్మెకు (Bank Employees On Nationwide Strike) దిగుతున్నారు. ఆయా రోజుల్లో బ్యాంక్‌ సేవలు అందవు.

ఏయే రోజుల్లో ఏయే బ్యాంకుల సమ్మె?

డిసెంబర్ 4, 2023: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
డిసెంబర్ 5, 2023: బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BoI)
డిసెంబర్ 6, 2023: కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిసెంబర్ 7, 2023: ఇండియన్ బ్యాంక్, యూకో (UCO) బ్యాంక్
డిసెంబర్ 8, 2023: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
డిసెంబర్ 11, 2023: అన్ని ప్రైవేట్ బ్యాంకులు

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?

RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్‌ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: 26 ఏళ్లకే శ్రీమంతుడు - వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నాడు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget