అన్వేషించండి

Bank Holiday: గురువారం బ్యాంకులకు సెలవు, మీ ప్రాంతంలో పరిస్థితేంటో తెలుసుకోండి

బుధవారం కూడా చాలా చోట్ల బ్యాంకులు మూసేశారు.

Bakrid 2023 Holiday to Banks: గురువారం, ఈద్ ఉల్-అజా (బక్రీద్) పర్వదినం. ఆ పండుగ సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. బుధవారం కూడా చాలా చోట్ల బ్యాంకులు మూసేశారు. గురువారం రోజు మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే, దానిని శుక్రవారానికి పోస్ట్‌పోన్‌ చేసుకోవాల్సిందే. 

బుధవారం ఈ నగరాల్లో బ్యాంకులకు సెలవు:
బక్రీద్ సందర్భంగా.. బేలాపూర్, జమ్ము, కోచి, ముంబై, నాగ్‌పూర్, శ్రీనగర్, తిరువనంతపురంలో బుధవారం బ్యాంకులను మూసేశారు.

గురువారం ఈ నగరాల్లో బ్యాంకులకు సెలవు:
హైదరాబాద్, విజయవాడ, న్యూదిల్లీ, శ్రీనగర్, చండీగఢ్, ఇంఫాల్, జైపూర్, అహ్మదాబాద్, అగర్తల, బెంగళూరు, ఐజ్వాల్, పనాజీ, పట్నా, చెన్నై, దెహ్రాదూన్, రాంచీ, జమ్మూ, కోల్‌కతా, లక్నో, షిల్లాంగ్, సిమ్లా, భోపాల్, గువాహటి, కాన్పూర్‌లో బ్యాంకులకు పబ్లిక్ హాలిడే.

జులై నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 15 రోజులు సెలవులు ఉన్నాయి. రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా కలిసి 15 రోజులు పబ్లిక్‌ హాలిడేస్‌ వచ్చాయి. జులై 02న ఆదివారంతో మొదలై 31న షహీద్ ఉధమ్ సింగ్ అమరవీరుల దినోత్సవంతో హాలిడేస్‌ అయిపోతాయి. బ్యాంకు సెలవుల జాబితా ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి మారుతుంది. 2000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి గానీ, మరో పని కోసం గానీ వచ్చే నెలలో బ్యాంక్‌కు వెళ్లాలని మీరు అనుకుంటుంటే, ఆ నెలలో బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను కచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ లిస్ట్‌కు తగ్గట్లుగా మీ పనిని ప్లాన్‌ చేసుకోవచ్చు.

2023 జులైలో బ్యాంకులకు సెలవు రోజులు:

జులై 02, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 05, 2023- గురు హరగోవింద్ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 06, 2023- MHIP డే కారణంగా మిజోరంలో బ్యాంక్‌లకు సెలవు
జులై 08, 2023 - రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 09, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- భాను జయంతి సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- బోనాలు సందర్భంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- అమరవీరుల దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 16, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 17, 2023- యు టిరోట్ సింగ్ డే సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు
జులై 22, 2023 - నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 23, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 29, 2023- మొహర్రం సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
జులై 30, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 31, 2023- షహీద్ ఉధమ్ సింగ్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా హరియాణాలో బ్యాంకులకు సెలవు

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్‌ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: కొత్త కనెక్షన్‌ కోసం కాళ్లరిగేలా తిరగొద్దు, వాట్సాప్‌ ఉంటే చాలు! 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Rapido Data Leak: యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Embed widget