Bank Holiday: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు - దీపావళి, ఛత్ పూజ సహా చాలా పండుగలు
ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్ బ్యాంకులకు కూడా హాలిడేస్ ఉన్నాయి.
Bank Holidays list in Noveber 2023: మన దేశంలో ఫెస్టివల్ సీజన్ కొనసాగుతోంది. నవంబర్ నెలలో దీపావళి, ఛత్ పూజ, కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి వంటి ముఖ్యమైన పండుగలు, జాతీయ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి, నవంబర్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్ బ్యాంకులకు కూడా హాలిడేస్ ఉన్నాయి. వచ్చే నెలలో మీకు బ్యాంక్‌లో మీకు ఏ పని ఉన్నా, ఈ బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ సేవ్ చేసుకోండి. ఆ లిస్ట్ ప్రకారం మీ పనిని ప్లాన్ చేసుకోండి.
నవంబర్ నెలలో బ్యాంక్ సెలవులు 1వ తేదీన కన్నడ రాజ్యోత్సవంతో మొదలై 30వ తేదీన కనకదాస్ జయంతితో ముగుస్తాయి. బ్యాంకు సెలవులు ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ కస్టమర్ల కోసం, ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఆ లిస్ట్‌లో ఉంటాయి.
2023 నవంబర్ నెలలో బ్యాంకుల సెలవు రోజులు:
నవంబర్ 1, 2023- కన్నడ రాజ్యోత్సవం/కుట్/కర్వా చౌత్ కారణంగా బెంగళూరు, ఇంఫాల్, సిమ్లాలో బ్యాంకులు పని చేయవు
నవంబర్ 5, 2023- ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
నవంబర్ 10, 2023- గోవర్దన పూజ/లక్ష్మీ పూజ/దీపావళి/దీపావళి కారణంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు హాలిడే
నవంబర్ 11, 2023- రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
నవంబర్ 12, 2023- ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
నవంబర్ 13, 2023- గోవర్దన పూజ/లక్ష్మీపూజ/దీపావళి కారణంగా అగర్తల, దెహ్రాదూన్, గాంగ్‌టక్, ఇంఫాల్, జైపూర్, కాన్పూర్, లక్‌నవూలో బ్యాంకులు పని చేయవు
నవంబర్ 14, 2023- దీపావళి (బలి ప్రతిపద)/విక్రమ్ సంవత్ నూతన సంవత్సరం/లక్ష్మిపూజ కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, గాంగ్‌టక్, ముంబై, నాగ్‌పూర్‌లోని బ్యాంకులకు హాలిడే
నవంబర్ 15, 2023- భాయ్ దూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మిపూజ/ నింగల్ చక్కుబా/భ్రాత్రి ద్వితీయ కారణంగా గాంగ్‌టాక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్‌నవూ, సిమ్లాలో బ్యాంకులను మూసివేస్తారు
నవంబర్ 19, 2023- ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
నవంబర్ 20, 2023- ఛత్ పూజ కారణంగా పట్నా, రాంచీలో బ్యాంకులు పని చేయవు
నవంబర్ 23, 2023- సెంగ్ కుట్ స్నెమ్/ఇగాస్ బగ్వాల్ కారణంగా దెహ్రాదూన్, షిల్లాంగ్‌లో బ్యాంకులకు హాలిడే
నవంబర్ 25, 2023- నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
నవంబర్ 26, 2023- ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
నవంబర్ 27, 2023- గురునానక్ జయంతి/కార్తీక పౌర్ణమి కారణంగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గాంగ్‌టక్, గువాహతి, హైదరాబాద్, ఇంఫాల్, కోచి, పనాజీ, పట్నా, త్రివేండ్రం, షిల్లాంగ్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
నవంబర్ 30, 2023- కనకదాస్ జయంతి కారణంగా బెంగళూరులో బ్యాంకులు పని చేయవు
బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్ అండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్'. ఏ బ్యాంక్ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPIని ఉపయోగించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: చుక్కల్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial