అన్వేషించండి

77th Republic Day: విద్య, ఆరోగ్య సంరక్షణ , ఆర్థిక వ్యవస్థలో స్వదేశీ ముద్ర - రిపబ్లిక్ డే సందర్భంగా బాబా రామ్ దేవ్ పిలుపు

Patanjali: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వదేశీ విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వ్యవస్థ కోసం స్వామి రామ్‌దేవ్ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర, అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలన్నారు.

Baba Ramdev Calls For Indigenous Education:    దేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతంజలి యోగపీఠం ఛైర్మన్ స్వామి రామ్‌దేవ్, ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ పతంజలి వెల్నెస్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, భారతదేశాన్ని ఆత్మనిర్భర్  దేశంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ  పంచ ప్రాణాల ను స్వీకరించాలని స్వామి రామ్‌దేవ్ పిలుపునిచ్చారు.

టారిఫ్ తీవ్రవాదంపై విమర్శలు - సనాతన ధర్మానికి రక్షణ

ప్రపంచం ప్రస్తుతం ప్రమాదకరమైన దశలో ఉందని, అమెరికా వంటి దేశాలు కెనడా, భారతదేశంపై విపరీతమైన టారిఫ్ తీవ్రవాదం  ప్రయోగిస్తున్నాయని రామ్‌దేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపద మత్తు, అధికార గర్వం, మత మౌఢ్యం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయని విమర్శించారు. భారతదేశంలో కూడా సనాతన ధర్మ అనుచరుల మధ్య అంతర్గత ఆరోపణలు, గోమాత, గంగ పేరుతో మతోన్మాదం వ్యాపించడం శోచనీయమన్నారు. స్వదేశీ విద్య, స్వదేశీ ఆరోగ్యం, స్వదేశీ ఆర్థిక వ్యవస్థ మరియు సనాతన జీవనశైలి ద్వారానే 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

 డాలర్‌ను శాసించే స్థాయికి భారత రూపాయి

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక, సైనిక, ఆధ్యాత్మిక శక్తిగా ఎదగాలనేది తన ఆకాంక్ష అని స్వామి రామ్‌దేవ్ పేర్కొన్నారు.  ఒక భారత రూపాయి 100 అమెరికన్ డాలర్లకు సమానమయ్యే రోజును చూడాలని, అది 140 కోట్ల భారతీయుల కృషివల్లే సాధ్యమని ఆయన అన్నారు. మెకాలే తరహా విద్యావిధానాన్ని, బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యాన్ని వీడి స్వదేశీని అవలంబించాలని పిలుపునిచ్చారు.  మన పాస్‌పోర్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా వీసా రహిత గుర్తింపు రావాలంటే దేశం అన్ని రంగాల్లో బలోపేతం కావాలని, లేనిపక్షంలో మిత్రదేశాలు కూడా దూరం అవుతాయని హెచ్చరించారు.

అంతర్గత కలహాలు వీడాలి - హిందువుల భద్రత

సన్యాసులు, శంకరాచార్యుల మధ్య వివాదాలు ఉండకూడదని, కుల, మత, ప్రాంతీయ, భాషా పరమైన వైషమ్యాలకు స్వస్తి పలకాలని రామ్‌దేవ్ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ బలంగా ఉండటం వల్లే ప్రపంచంలో యూదుల జోలికి ఎవరూ వెళ్లలేకపోతున్నారని ఉదాహరిస్తూ.. భారతదేశం శక్తివంతంగా మారినప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు రక్షణ ఉంటుందని  గుర్తుచేశారు. ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలును సమర్థిస్తూ.. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం దిశగా చట్టపరమైన, భావజాల పరమైన విస్తరణ జరగాలని ఆకాంక్షించారు.

 గోసేవలో నూతన విధానం

గోమాతను కేవలం జాతీయ తల్లిగానే కాకుండా, ప్రపంచ మాతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.  ప్రతి పౌరుడు రోజుకు కనీసం రూ . 10 విలువైన గో ఆధారిత ఉత్పత్తులను వాడితే, గోమాత సంరక్షణ కోసం రోజుకు ₹10,000 కోట్ల నిధి సమకూరుతుందని గణాంకాలను వివరించారు.  సాధువులు, మత నాయకులు తమ మఠాల నుండి బయటకు వచ్చి కనీసం 1,000 నుండి లక్ష ఆవులను పెంచేలా బాధ్యత తీసుకోవాలని, కేవలం ప్రసంగాలతో సరిపెట్టకుండా ఆచరణలో చూపాలని కోరారు.

  ఆచార్య బాలకృష్ణ సందేశం

పతంజలి ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం అమరవీరుల త్యాగాలను స్మరించుకునే రోజని అన్నారు. మానవ జీవితం కేవలం స్వల్ప లక్ష్యాల కోసం కాదని, దేశాన్ని 'విశ్వగురువు'గా నిలబెట్టే గొప్ప లక్ష్యం కోసం ప్రతి భారతీయుడు శ్రమించాలని సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పతంజలి ప్రతినిధులు, యోగ సాధకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget