Patanjali Ayurveda: వారు దివ్యాంగులు కాదు, దివ్య ఆత్మలు- 250 మందికి కృత్రిమ అవయవాలు, కాలిపర్స్, క్రచెస్ పంపిణీ
Patanjali Wellness and Udhaar Jeffries | పతంజలి యోగపీఠ్ అనుభవజ్ఞులైన వైద్యులు, నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుల సహకారంతో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసింది. .

Patanjali Yogpeeth | పతంజలి యోగపీఠ్‌లో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 250 మందికి పైగా దివ్యాంగులు ఉచితంగా కృత్రిమ అవయవాలు, వారి సహాయక పరికరాలను పొందారు. పతంజలి వెల్నెస్, ఉధార్ జెఫ్రీస్ నాగ్‌పూర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
హరిద్వార్‌లో ఉచిత శిబిరం
జూలై 26, 27 తేదీలలో హరిద్వార్‌లోని పతంజలి వెల్నెస్ సెంటర్‌లో పతంజలి వెల్నెస్, ఉధార్ జెఫ్రీస్ నాగ్‌పూర్ సంయుక్తంగా రెండు రోజుల ఉచిత కృత్రిమ అవయవాల మార్పిడి శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమం దివ్యాంగులకు అవయవ మార్పిడి, వారి జీవితాలలు మార్పు తీసుకురావడంపై దృష్టి సారించారు. 250 మందికి పైగా లబ్ధిదారులు ఉచిత సహాయక పరికరాలను పొందారని పతంజలి యోగ్‌పీఠ్ తెలిపింది. వీటిలో కృత్రిమ చేతులు, కాళ్లు, కాలిపర్స్, క్రచెస్ సైతం ఉన్నాయి.
ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకసారి శిబిరం
పతంజలి వెల్నెస్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమం విజయవంతం కావడంతో, ప్రతి 3, 4 నెలలకు ఒకసారి ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పతంజలి యోగపీఠ్ వ్యవస్థాపకుడు స్వామి రామ్‌దేవ్ బాబా, జాయింట్ జనరల్ సెక్రటరీ ఆచార్య బాలకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు వ్యక్తిగతంగా హాజరై.. దివ్యాంగులకు అవసరమైన పరికరాలను పంపిణీ చేసి, ఆత్మనిర్భరత దిశగా వారి ప్రయాణం కొనసాగడంలో లబ్ధిదారులను ప్రోత్సహించారు.
విభిన్న సామర్థ్యం కలిగిన వారు కాదు, దైవిక ఆత్మలు: బాబా రామ్‌దేవ్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ.. "వారు విభిన్న సామర్థ్యం కలిగిన వారు కాదు. వారిని దైవిక ఆత్మలుగా భావించాలి. వారికి ఎవరి నుంచి ఎలాంటి సానుభూతి అవసరం లేదు, వారికి సాధికారత కావాలి" అని అన్నారు. ఆచార్య బాలకృష్ణ కూడా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ.. "పతంజలి మిషన్ కేవలం ఆయుర్వేద ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రతి మనిషిని స్వయం సమృద్ధిగా, ఎవరి మీద ఆధారపడకుండా మార్చడమే మా లక్ష్యం. అదే మా దేశానికి చేసే సేవ" అని అన్నారు.
పలువురి మద్దతుతో కార్యక్రమం సక్సెస్
ఈ సేవా కార్యక్రమాన్ని భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయ సమితి, ఉధార్ సేవా సమితి, అనుభవజ్ఞులైన డాక్టర్లు, నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, పతంజలి సేవా విభాగానికి చెందిన అంకితభావం కలిగిన స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. వారికి పరికరాలను పంపిణీ చేయడంతో పాటు, శిబిరంలో లబ్ధిదారుల కోసం కొలతలు, అమరికలు, ఫిజియోథెరపీ సంప్రదింపుల సేవలు కూడా అందిస్తున్నాయి.
దివ్యాంగులకు సంకల్పం బలోపేతం
ఈ కార్యక్రమం దివ్యాంగులకు శారీరక మద్దతును అందించడమే కాకుండా అంతర్గత, మానసిక సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. పతంజలి యోగపీఠ్ ద్వారా చేపట్టిన ఈ చొరవ మానవ సేవ పట్ల వారికి ఉన్న నిబద్ధతను స్పష్టం చేస్తుంది. స్వామి విదేహదేవ్, స్వామి పుణ్య దేవ్, సిస్టర్ పూజ వంటి ప్రముఖులు ఉధార్ బృందం నిర్వహణ సభ్యులతో కలిసి దివ్యాంగులకు పరికరాల ఉచిత శిబిరంలో పాల్గొన్నారు. సంజయ్, శ్రుతి, ప్రద్యుమన్, రవి, రుచికా అగర్వాల్, దివ్యన్షు, కృష్ణ, నిహారిక, దివ్య, దీనదయాల్ ఇతరులు ఈ ఉచిత శిబిరం విజయవంతం కావడానికి సహాయం చేశారు.





















