News
News
వీడియోలు ఆటలు
X

Anil Ambani House: అనిల్ అంబానీ ఇంటి విలువ తెలిస్తే మీ గుండె ఒక్క క్షణం ఆగుతుంది!

అనిల్‌ అంబానీ దీనస్థితిలో ఉన్నాడని మాత్రం భావించొద్దు. ఒక కుబేరుడు ఎప్పుటికీ కుబేరుడిగానే జీవిస్తాడు.

FOLLOW US: 
Share:

Anil Ambani House: దీరూభాయ్‌ అంబానీ కుటుంబంలోని ఒక విచిత్రాన్ని మీరు గమనించే ఉంటారు. ఆయన పెద్ద కుమారుడు ముకేష్‌ దీరుభాయ్‌ అంబానీ (Mukesh Dhirubhai Ambani) ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, చిన్న కుమారుడు అనిల్‌ దీరూభాయ్‌ అంబానీ (Anil Dhirubhai Ambani -ADA) అప్పుల్లో ఉన్నారు. ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మన దేశంలోనే ఎక్కువ మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీ కాగా, అనిల్‌ అంబానీకి చెందిన కొన్ని కంపెనీలు అప్పుల్లో & కోర్ట్‌ కేసుల్లో ఉన్నాయి. ప్రస్తుతం, రిలయన్స్ క్యాపిటల్ రెండో దఫా వేలం ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ విషయాలు చదివాక, అనిల్‌ అంబానీ దీనస్థితిలో ఉన్నాడని మాత్రం భావించొద్దు. ఒక కుబేరుడు ఎప్పుటికీ కుబేరుడిగానే జీవిస్తాడు. రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌ (Reliance ADA Group) ఛైర్మన్‌ అనిల్‌ దీరూభాయ్‌ అంబానీ. భారతదేశంలోని అతి పెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకరు.

నటి టీనా అంబానీని అనిల్ అంబానీ వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు జై అన్మోల్ అంబానీ, జై అన్సుల్ అంబానీ. కోడలు పేరు క్రిషా షా. తన కుటుంబంతో కలిసి ముంబైలోని పాలి హిల్‌లో (Pali Hill) నివసిస్తున్నారు. తల్లి కోకిలా బెన్‌ కూడా అనిల్‌ అంబానీ ఇంట్లోనే ఉంటారు. 

అనిల్‌ అంబానీ ఇంటి పేరు, విలాసాలు
ముకేష్ అంబానీ తరహాలోనే అనిల్ అంబానీ కూడా విలాసవంతమైన అతి భారీ భవనంలో నివసిస్తున్నారు. అనిల్ అంబానీ ఇంటి పేరు అడోబ్ (Abode). దీనిని బయట నుంచి చూసినా, లోపలికి వెళ్లి చూసినా అత్యంత రాజ ప్రాసాదాన్ని తలపిస్తుంది.

అనిల్ అంబానీ నివసిస్తున్న భవనంలో మొత్తం 17 అంతస్తులు ఉన్నాయి. ఆ ఇంటి నుంచి చూస్తే అరేబియా సముద్రం అద్భుతంగా కనిపిస్తుందట.

ఇంటిపైన హెలిప్యాడ్ నుంచి ఇంటి లోపల స్విమ్మింగ్ పూల్, జిమ్, హోమ్‌ థియేటర్‌ వరకు అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలు అనిల్‌ అంబానీ ఇంట్లో ఉన్నాయి. ఆ భవనం 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

అనిల్ అంబానీ ఇంట్లోని సోఫాలు, మంచాలు వంటి వాటిని విదేశాల నుంచి వచ్చిన కళాకారులు సిద్ధం చేశారు. సాధారణంగా, కాస్త డబ్బున్న వాళ్లు ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, లేదా అపార్ట్‌మెంట్స్‌ వంటి నిర్మాణాలకు ఇంజినీర్ల సాయం తీసుకుంటారు. అనిల్‌ అంబానీ హోదాయే వేరు కాబట్టి, తన ఇంట్లోని మంచాలు, సోఫాల రూపకల్పనకు కూడా ఇంజినీర్లను నియమించారు. పైగా, వాళ్లను ఇతర దేశాల నుంచి రప్పించారు. ఇందుకోసం కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. 

అంబానీ కార్ కలెక్షన్‌లను ప్రదర్శించే లాంజ్ ఏరియా కూడా ఈ ఇంట్లో ఉంది. మీడియా నివేదికల ప్రకారం, అనిల్ అంబానీకి రోల్స్ రాయిస్, లెక్సస్ XUV, పోర్షే, ఆడి Q7, మెర్సిడెస్ GLK350 సహా చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి.

అనిల్ అంబానీ ఇంటి ఖరీదు
అనిల్ అంబానీ విలాసవంతమైన ఇంటి ఖరీదు రూ. 5000 కోట్లు, ఇది ముంబైలో మూడో అత్యంత ఖరీదైన ఇల్లు.

అనిల్‌ అంబానీ ఇంటి ఎత్తు సుమారు 66 మీటర్లు. ఈ ఇంటిని 150 మీటర్లకు పెంచాలని భావించారు, కానీ ముంబై అధికారుల నుంచి అనుమతి పొందలేకపోయారు.

అనిల్‌ అంబానీ, వ్యక్తిగత ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిరోజూ జిమ్‌లో కష్టపడతారు, ఎప్పడూ ఫిట్‌గా కనిపిస్తారు, మారథాన్‌లలో తరచూ పాల్గొంటారు. కొంతకాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు. ఒకప్పుడు, ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోనే ఆరో సంపన్నుడిగా ఉన్నారు. 

Published at : 29 Apr 2023 09:34 AM (IST) Tags: anil ambani Anil Ambani Luxury House Anil Ambani House Photos

సంబంధిత కథనాలు

Gautam Adani: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, మళ్లీ పాత పొజిషన్‌లోకి వచ్చిన అదానీ

Gautam Adani: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, మళ్లీ పాత పొజిషన్‌లోకి వచ్చిన అదానీ

Repo Rate: రెపో రేట్‌ మారలేదు, ఇప్పుడు బ్యాంక్‌ EMIల పరిస్థితేంటి?

Repo Rate: రెపో రేట్‌ మారలేదు, ఇప్పుడు బ్యాంక్‌ EMIల పరిస్థితేంటి?

RBI: లోన్లు తీసుకునేవాళ్లకు భారీ ఊరట - ఈసారి కూడా వడ్డీ రేట్లు పెరగలేదు

RBI: లోన్లు తీసుకునేవాళ్లకు భారీ ఊరట - ఈసారి కూడా వడ్డీ రేట్లు పెరగలేదు

Stocks To Buy: డబ్బు సంపాదించే షేర్ల కోసం వెతకొద్దు, ఇదిగో స్టాక్స్‌ లిస్ట్‌!

Stocks To Buy: డబ్బు సంపాదించే షేర్ల కోసం వెతకొద్దు, ఇదిగో స్టాక్స్‌ లిస్ట్‌!

RBI MPC: బీ అలెర్ట్‌, బ్యాంక్‌ వడ్డీ రేట్లపై కాసేపట్లో కీలక ప్రకటన!

RBI MPC: బీ అలెర్ట్‌, బ్యాంక్‌ వడ్డీ రేట్లపై కాసేపట్లో కీలక ప్రకటన!

టాప్ స్టోరీస్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!