Amazon offer on Tecno Pop 5: అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌.. Rs. 5,670కే టెక్నోపాప్‌ 5.. ఫీచర్లివే!

టెక్నో పాప్‌, టెక్నో స్పార్క్‌ మొబైల్స్‌పై అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. తక్కువ ధరకే టెక్నో పాప్‌ లైట్‌ మొబైల్‌ను విక్రయిస్తోంది. దీని అసలు ధర రూ.6,299 కాగా ఆఫర్‌తో రూ.5,670కే అందిస్తోంది.

FOLLOW US: 

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా రిపబ్లిక్‌ సేల్‌ మొదలైంది. వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లను తక్కువ ధరకే అందిస్తున్నారు. ముఖ్యంగా టెక్నో పాప్‌, టెక్నో స్పార్క్‌ మొబైల్స్‌పై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. అతి తక్కువ ధరకే టెక్నో పాప్‌ లైట్‌ మొబైల్‌ను విక్రయిస్తోంది. దీని అసలు ధర రూ.6,299 కాగా బ్యాంకు ఆఫర్‌తో కలిపి రూ.5,670కే అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ఏంటంటే!

అమెజాన్ సేల్ లో  కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

టెక్నో పాప్ 5 ఎల్టీఈ స్మార్ట్ ఫోన్ సేల్ జనవరిలో మొదలైంది. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. టెక్నో పాప్ 5 ఎల్టీఈ 14 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. యువత లక్ష్యంగా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు టెక్నో తెలిపింది. డీప్ సీ క్లస్టర్, ఐస్ బ్లూ, టర్కోయిస్ సియాన్ రంగుల్లో టెక్నో పాప్ 5 ఎల్టీఈని కొనుగోలు చేయవచ్చు.

టెక్నో పాప్ 5 ఎల్టీఈ స్పెసిఫికేషన్లు

ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో పాప్ 5 ఎల్టీఈ పనిచేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డాట్ నాచ్ డిస్‌ప్లేను అందించారు. వాల్ట్ 2.0, స్మార్ట్ ప్యానెల్ 2.0, సోషల్, టర్బో, డార్క్ థీమ్స్, పేరెంటల్ కంట్రోల్, డిజిటల్ వెల్‌బీయింగ్, జెస్చర్ కాల్ పికర్ వంటి ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో టెక్నో అందించింది. ఇందులో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా అందించారు. ఫోన్ వెనకవైపు డ్యూయల్ ఫ్లాష్ లైట్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. తెలుగు, హిందీ, బెంగాలీ, ఉర్దూ సహా మొత్తం 14 భారతీయ భాషలను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఐపీఎక్స్2 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై, జీపీఆర్ఎస్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లను అందించారు. 

Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 19 Jan 2022 03:13 PM (IST) Tags: smartphone Affordable Smartphone Amazon Great Republic Sale Tecno Pop 5 Tecno spark

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా

Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా

Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ

Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!

టాప్ స్టోరీస్

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !