Airtel Postpaid Prime Membership: అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌పై యూజర్లకు ఎయిర్‌టెల్ షాక్
అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు ఎయిర్‌టెల్ షాక్ ఇచ్చింది. ఏడాది వరకు ఉండే సబ్‌స్క్రిప్షన్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ చూపించి చందాదారులను ఆకర్షించిన ఎయిర్‌టెల్ ఇప్పుడు షాక్ ఇస్తోంది. ఇప్పటి వరకు ఏడాది వరకు ఉండే సబ్‌స్క్రిప్షన్ ఇకపై ఆరు నెలలకు కుదించింది.
తగ్గించిన ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ సంస్థ.. రూ.499, 999, 1199, 1599 ప్లాన్లు ఎంచుకున్న వారికి అప్పట్లో భారీ ఆఫర్స్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్‌ను ఏడాది పాటు ఉచితంగా ఇచ్చింది. ఇప్పుడు ఆ సబ్‌స్క్రిప్షన్ గడువును సగానికి కోత పెట్టింది. ఇకపై ఈ నాలుగు ప్లాన్‌లు తీసుకున్న కస్టమర్‌కు అమెజాన్ ప్రైమ్ కేవలం ఆరు నెలలే ఇస్తారు.
ఈ కొత్త ప్లాన్ ఇప్పటికే అమలు అయిందని సంస్థ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా చేరే కస్ట్‌మర్‌లకు కేవలం ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌తోనే అమెజాన్ ప్రైమ్‌ను ఇస్తోంది. ఇతర బ్రాండ్‌లపై ఇచ్చే ఆఫర్ ఎప్పటిలాగానే కొనసాగుతుందని ప్రకటించింది. వాటిలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.
ఏప్రిల్ 1 కంటే ముందే తీసుకున్న చందాదారులకు మాత్రం ఏడాది సబ్ స్క్రిప్షన్ ఉంటుందని ప్రకటించింది. ఎయిర్‌టెల్ ప్రకటించిన ఈ ఆఫర్ మిగతా టెలికాం సంస్థలపై ప్రభావం చూపించింది. వాళ్లు కూడా ఇదే బాట పట్టాల్సి వచ్చింది.
కొత్త ప్లాన్‌లు
ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. అవే రూ.296, రూ.319 ప్లాన్లు. వీటిలో రూ.296 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా... రూ.319 ప్లాన్ వ్యాలిడిటీ పూర్తిగా ఒక నెల. జియో మనదేశంలో రూ.259 ప్లాన్‌ను లాంచ్ చేసిన అనంతరం ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను లాంచ్ చేయడం విశేషం. 30 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కనీసం ఒక్కటైనా అందుబాటులో ఉండాలని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఎయిర్‌టెల్ రూ.296 ప్లాన్ లాభాలు
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఇక డేటా లాభాల విషయానికి వస్తే... మొత్తంగా 25 జీబీ డేటాను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. రోజువారీ పరిమితి లేదు.
ఎయిర్‌టెల్ రూ.319 ప్లాన్ లాభాలు
ఇక ఎయిర్‌టెల్ రూ.319 వ్యాలిడిటీ నెల రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తున్నారు. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ 2 జీబీ డేటా అయిపోతే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది.
ఈ రెండు ప్లాన్లతో 30 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్ కూడా లభించనుంది. దీంతోపాటు అపోలో 24×7 సర్కిల్, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. దీంతోపాటు వింక్ మ్యూజిక్‌కు ఉచిత యాక్సెస్, ఉచిత హలో ట్యూన్స్ కూడా లభించనున్నాయి.
ట్రాయ్ ఆదేశాల మేరకు వొడాఫోన్ ఐడియా కూడా రూ.327, రూ.337 ప్లాన్లను లాంచ్ చేసింది. వీటిలో రూ.327 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా, రూ.337 ప్లాన్ వ్యాలిడిటీ 31 రోజులుగా ఉంది. ఈ రెండు ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందించనున్నారు. ఇక రూ.327 ప్లాన్ ద్వారా 25 జీబీ, రూ.337 ప్లాన్ ద్వారా 28 జీబీ డేటాను అందిస్తున్నారు. వీటితో పాటు వీఐ మూవీస్, టీవీ యాప్‌కు యాక్సెస్ లభించనుంది.
Also Read: DDMA Covid-19 Guidelines: మళ్లీ అదే కథ- దిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఇక మాస్కు పెట్టుకోకపోతే!