అన్వేషించండి

Aha Nenu Super Woman: ఈ బిజినెస్‌ ఐడియాలకు ఏంజెల్స్‌ ఫిదా! ఇన్వెస్ట్‌ చేసేందుకు రెడీ!

Aha Nenu Super Woman: ఆహా.. నేను సూపర్‌ విమెన్‌ షోకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది! చక్కని బిజినెస్‌ ఐడియాలతో వచ్చిన ఔత్సాహిక మహిళలకు ఏంజెల్స్‌ పెట్టుబడి సహకారం అందిస్తున్నారు.

Aha Nenu Super Woman: 

ఆహా.. ఓటీటీ వేదికలో ప్రసారమవుతున్న నేను సూపర్‌ విమెన్‌ షోకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది! చక్కని బిజినెస్‌ ఐడియాలతో వచ్చిన ఔత్సాహిక మహిళలకు ఏంజెల్స్‌ పెట్టుబడి సహకారం అందిస్తున్నారు. అలాగే మెంటార్‌షిప్‌ ఇస్తున్నారు. మొత్తంగా మూడు వారాల్లోనే ఈ షో ద్వారా 9 కంపెనీల్లో రూ.3.9 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేసేందుకు అంగీకరించారు. మూడో వారం రూ.90 లక్షల మేర పెట్టుబడికి ఒప్పుకొన్నారు. మరి ఎవరి ఆలోచనకు ఎంత విలువ దక్కిందో చూద్దామా!

లావణ్య సూన్కారి - ఫౌండర్ అఫ్ లారిక్

అందరికీ ఆది గురువు అమ్మ. ఫైనాన్షియల్‌ ఫ్రీడమ్‌ గురించి ఆమె చెప్పిన పాఠాలు విన్న లావణ్య తనదైన దారి ఎంచుకుంది. 26 ఏళ్లకే ఫార్చ్యూన్ 500 కంపెనీ కి మార్కెటింగ్ హెడ్ పనిచేసింది. 32 ఏళ్ళకి లారిక్ కంపెనీ ని స్థాపించింది. తాము తయారు చేసే హెల్త్‌ సప్లిమెంట్లు అమ్మ పాలలాగే స్వచ్ఛమైనవని అంటోంది ఈ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ న్యూట్రిషన్ స్పెషలిస్ట్. ఈ కంపెనీకి 36,౦౦౦ కస్టమర్స్ ఉన్నారు. అమెరికా నుంచి క్లీన్ లేబిల్ సర్టిఫైడ్ బ్రాండ్‌ వచ్చింది. ఇలాంటి అరుదైన ఘనత పొందిన కంపెనీలు భారత్‌లో మూడే ఉన్నాయి.  2 శాతం వాటా ఆఫర్‌ చేస్తూ రూ.70 లక్షలు అడుగుతూ ఆహా నేను సూపర్ వుమెన్ షోకి వచ్చింది లావణ్య. ఆమె పట్టుదలకు ఫిదా అయిన ఏంజెల్స్ రేణుక, కరణ్ బజాజ్ రూ. 50 లక్షలకు నాలుగు శాతం వాటా కోరారు. అందుకు లావణ్య అంగీకరించింది.
 
 
మాధురి ఆకెళ్ళ - ఫౌండర్సె అఫ్ సెకండ్ ఇన్నింగ్స్

అమ్మ ఒడి  గుడి కన్నా చాలా ప్రశాంతతను ఇస్తుంది. ఆ అనుభూతులను పంచిన తలితండ్రులని చాలామంది  ఒంటరిగా ఇంట్లో వదిలిసే బయటికి వెళ్లిపోతున్నారు. అలాంటి వాళ్ళ ఒంటరి తనాన్ని దూరం చేయడానికి వచ్చిందే - ఈ సెకండ్ ఇన్నింగ్స్.  ఇందులో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఒక్క రోజు నుంచి ఆరు నెలల వరకు ఉండొచ్చు. ఇది వృద్ధాశ్రమం కాదు. ఒక డే కేర్ సెంటర్. ఇక్కడ యోగ, ఇండోర్ గేమ్స్, మొబిలిటీ థెరపీ చేసుకోవచ్చు. మాధురి రెండు శాతం వాటాకు రూ. 40 లక్షలు అడగ్గా Dr సింధూర నారాయణ 15 శాతం వాటా, రూ. 20 లక్షలు ఆఫర్‌ చేశారు. 
 
ప్రత్యూష - ఫౌండర్ అఫ్ గ్రెయిల్ మేకర్స్ ఇన్నోవేషన్స్

"సర్వేంద్రియానాం నయనం ప్రధానం" అన్నారు పెద్దలు. అందుకే 26 ఏళ్ళ ప్రత్యూష గ్రెయిల్ మేకర్స్ ఇన్నోవేషన్స్‌తో ముందుకొచ్చారు. చిన్నపుడు ఆమె డిస్‌లెక్సియాతో బాధపడ్డారు. అందుకే తనలా బాధ పడే వారికి చేయూతను అందించేందుకు ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి లో వాలంటీర్ గా పనిచేసారు. అపుడే విజువల్ ఇంపైరెడ్ అయిన ఐశ్వర్యతో పరిచయం అయింది. వారి స్నేహం నుండి వచ్చిందే గ్రెయిల్ మేకర్స్. ప్రత్యూష రెండు ప్రొడక్ట్స్ రూపొందించారు. విసిఒన్ నానీ (చిన్నపిల్లలా కోసం), స్పేస్ ఫెల్ట్ (పెద్దవాళ్ళ కోసం). స్పేస్ ఫెల్ట్ ద్వారా, ఒక క్యూ ర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ రూమ్ లో లేదా ఒక ప్రోడక్ట్ గురించి వివరాలు వస్తాయి. ప్రత్యూష, నేను సూపర్ ఉమెన్ షో కి వచ్చి 5 శాతం వాటాకు రూ.50 లక్షలు కోరగా ఏంజెల్ సింధూర నారాయణ రూ.20 లక్షలు, 20% వాటాకు అంగీకరించారు.

 
నిష్క అగర్వాల్ - ఫౌండర్ అఫ్ సెప్టెంబర్ షూస్

పెళ్లి అనగానే డ్రెస్సుల నుంచి పందిరి వరకు అన్నీ డిజైనింగ్‌ చేయించుకుంటారు. కానీ చెప్పుల గురించి పట్టించుకొనేది తక్కువే. చాలా మందికి తనకు దుస్తులకు తగినట్టు పాదరక్షలు దొరకవు. తమ బరువు, ఆకారానికి తగిన విధంగా వెడ్డింగ్‌ ఫుట్‌వేర్‌ను రూపొందిస్తుంది ఈ సెప్టెంబర్ షూస్‌! నిష్క ఈ షో లో 15 శాతం వాటాకు రూ. 50 లక్షలు కోరగా ఏంజెల్స్ సింధూర నారాయణ, కరణ్ బజాజ్ మెంటార్‌షిప్‌ అందిస్తామన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sitaram Yechury Passed away | సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి | ABP Desamకొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బంది

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget