అన్వేషించండి

Adani Telecom : అదానీ బ్రాండ్ 5 జీ కూడా వస్తుందా? టెలికాం రంగంలోకి నయా కుబేరుడు !

5జీ స్పెక్ట్రం వేలంలోకి అదానీ కూడా అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా 5జీ సర్వీసుల వ్యాపారంలోకి అదానీ ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది.

Adani Telecom :  భారత్‌లో 5 జీ సర్వీసులు అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న దిగ్గజాలకు తోడు కొత్తగా అదానీ కూడా టెలికాం రంగంలోకి ఎంటరయ్యేందుకు 5జీనే ఆధారంగా చేసుకుంటోంది. 5 జీ టెలికాం స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రేసులో రిలయన్స్‌ జియోకి చెందిన ముఖేష్‌ అంబానీ, ఎయిర్‌టెల్‌ అధినేత భారతి మిట్టల్‌కు పోటీ ఇవ్వాలనే యోచనలో అదానీ గ్రూపు ఉన్నట్టు వ్యాపార ప్రపంచంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

5 జీ స్పెక్ట్రం వేలం రేసులో అదానీ గ్రూప్ ? 

ఐదో తరం లేదా అల్ట్రా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ వంటి 5జీ టెలికాం సేవలను అందించగల సామర్థ్యం ఉన్న సంస్థల నుంచి జూలై 26న నిర్వహించే స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి దరఖాస్తులు శుక్రవారంతో ముగిశాయి. నాలుగు అప్లికేషన్లు వచ్చినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీటిలో మూడు ఇప్పటికే టెలికాం రంగంలో ఉన్న జియో, ఎయిర్‌టెల్‌, వొడాపోన్‌-ఐడియావి కాగా, నాలుగోది అదానీ గ్రూప్‌ కు సంబంధించిన కంపెనీ ్ని తెలుస్తోంది.  ఇదే సమయంలో అదానీ గ్రూపు ఇటీవలనే నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌(NLD), ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌(ILD) లైసెన్స్‌లు పొందినట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే టెలికాం లైసెన్స్‌లు పొందిన అదానీ !

  5 జీ స్పెక్ట్రమ్ తో ‘ప్రైవేట్ క్యాప్టివ్ నెట్ వర్క్’ ను అదానీ గ్రూప్  ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని కంపెనీలకు ప్రైవేటు క్యాప్టివ్ నెట్ వర్క్ లను తయారుచేసి అందించే సేవలకు శ్రీకారం చుట్టే చాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ టెలికాం సేవల రంగంలోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టాలని అదానీ భావిస్తే.. యూనిఫైడ్ లైసెన్సును తీసుకుంటారని చెబుతున్నారు. దేశవ్యాప్త యూనిఫైడ్ లైసెన్సు కోసం కేంద్ర ప్రభుత్వానికి రూ.15 కోట్ల లైసెన్సింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 మెగా హెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ను కేంద్ర ప్రభుత్వం వేలం వేయనుంది. 

పన్నెండో తేదీన క్లారిటీ 

  5 జీ స్పెక్ట్రమ్ ను పొందే కంపెనీలు దాన్ని 20 ఏళ్లపాటు వినియోగించుకునే హక్కులను సొంతం చేసుకుంటాయి.  5జీ స్పెక్ట్రమ్ ను వేలంలో ఎంత మొత్తానికైతే కంపెనీలు దక్కించుకుంటాయో.. ఆ మొత్తాన్ని 20 ఈఎంఐలలో, 20 ఏళ్ల పాటు చెల్లించే వెసులుబాటును కల్పిస్తారు. ప్రతి ఏడాది తొలి త్రైమాసికంలోగా కేంద్ర ప్రభుత్వానికి ఈఎంఐ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్ల పాటు స్పెక్ట్రమ్ ను వినియోగించే ఆసక్తి లేని కంపెనీలు దాన్ని.. పదేళ్ల తర్వాత బకాయి ఈఎంఐలతో పాటు ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు.  5 జీ స్పెక్ట్రమ్ కోసం దరఖాస్తు చేసిన కంపెనీల పేర్లు తెలియాలంటే జులై 12 వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజున బిడ్డింగ్ సమర్పించిన కంపెనీల వివరాలను వెల్లడించనున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Embed widget