అన్వేషించండి

Adani Group Stocks Down: అదానీ గ్రూప్ స్టాక్స్‌ ర్యాలీకి బిగ్‌ బ్రేక్, మార్కెట్ తుపానులో 5-10% పతనం, మల్టీబ్యాగర్లూ డౌన్‌

పరిస్థితులు ఎటుపోయి ఎటు వస్తాయో అన్న భయంతో, ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి రిటైల్‌ ఇన్వెస్టర్ల వరకు ఈ స్టాక్స్‌లో ప్రాఫిట్‌ బుకింగ్స్‌కు దిగారు.

Adani Group Stocks Down: 2022లో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదారుల పాలిట గౌతమ్‌ అదానీ (Gautam Adani) దేవుడిలా మారారు. అదానీ తీసుకున్న దూకుడైన వ్యాపార విస్తరణ నిర్ణయాలు, కొత్త కంపెనీల కొనుగోళ్లు కలిసి ఈ గ్రూప్ కంపెనీల షేర్లను అమాంతం పైకి లేపాయి. మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చి, ఇన్వెస్టర్ల సంపదను కొన్ని రెట్లు పెంచాయి. 

ప్రస్తుతం, వడ్డీ రేట్ల మీద ప్రపంచ సెంట్రల్‌ బ్యాంకుల వైఖరికి కరోనా కొత్త వేరియంట్ (BF 7) తోడు కావడంతో, ప్రపంచ దేశాల్లో మళ్లీ అల్లకల్లోల పరిస్థితులు తలెత్తాయి. మన దేశంలో కొత్త వేరియంట్‌ కేసులు లేకపోయినా, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఇండియన్‌ స్టాక్ మార్కెట్లోనూ కొన్ని రోజులుగా క్షీణత కనిపిస్తోంది. అన్ని స్టాక్స్‌ లాగే అదానీ గ్రూప్ షేర్లు కూడా ఈ భారాన్ని భరించాల్సి వచ్చింది. గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లలో భారీ తగ్గుదల నమోదైంది. 

శుక్రవారం అదానీ కంపెనీల షేర్లు 5 నుంచి 10 శాతం మేర తగ్గాయి. పరిస్థితులు ఎటుపోయి ఎటు వస్తాయో అన్న భయంతో, ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి రిటైల్‌ ఇన్వెస్టర్ల వరకు ఈ స్టాక్స్‌లో ప్రాఫిట్‌ బుకింగ్స్‌కు దిగారు.

7 లిస్టెడ్‌ స్టాక్స్‌
అదానీ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises Ltd) స్టాక్ 5.85 శాతం క్షీణించి రూ. 3,642 వద్ద ముగిసింది. అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas Ltd) షేర్ ధర 8.98 శాతం క్షీణించి రూ. 3,232 వద్ద ముగిసింది. అదానీ పవర్ (Adani Power Ltd) షేర్‌ ప్రైస్‌ 5 శాతం పడిపోయి రూ. 262.20 వద్ద ముగిసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy Limited) షేర్లు 8.67 శాతం క్షీణించి రూ. 1,809 వద్దకు దిగి వచ్చాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission) స్క్రిప్‌ 9.84 శాతం క్షీణించి రూ. 2,270 వద్ద, అదానీ పోర్ట్స్ & సెజ్‌ (Adani Ports and SEZ Ltd) కౌంటర్‌ 7.33 శాతం నష్టంతో రూ. 794 వద్ద ముగిశాయి.

కీలక రూ.500 మార్క్‌ దిగువకు అదానీ విల్మార్‌
2022లో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్‌ అందించిన అదానీ విల్మార్ (Adani Wilmar) స్టాక్ భారీగా క్షీణించింది. దాదాపు 10 శాతం నష్టంతో, BSEలో, కీలకమైన రూ. 500 మార్క్‌ దిగువకు పడిపోయి రూ. 499 వద్ద ముగిసింది. 2022 ఫిబ్రవరిలో ఈ కంపెనీ IPOకి వచ్చింది. ఒక్కో షేరును రూ. 230కి అమ్మింది. ఏడాది కూడా గడవక ముందే ఈ షేరు ధర రూ. 870 గరిష్ట స్థాయికి చేరింది. అక్కడి నుంచి రూ. 499కి దిగజారింది. అంటే, ఈ స్క్రిప్‌ గరిష్ట స్థాయి నుంచి 43 శాతం నష్టపోయింది.

గుర్తుండిపోయే సంవత్సరం 2022 
ఏడాది క్రితం అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ రూ. 9.6 లక్షల కోట్లు ఉండగా..., అది దాదాపు రెట్టింపై ప్రస్తుతం రూ. 19 లక్షల కోట్లకు చేరుకుంది. సంపద వృద్ధి విషయంలో, అదానీ గ్రూప్ అద్భుతమైన పెరుగుదలకు 2022 సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇండివిడ్యువల్‌ షేర్లు తప్పితే, ఏ ఇతర గ్రూప్‌ షేర్లు ఇంతలా పెరగలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భారీ బూమ్‌ను ఎంజాయ్‌ చేసిన అదానీ గ్రూప్‌ షేర్లకు ఇప్పుడు బ్రేక్‌ పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Tamannaah Bhatia : అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
Zomato: జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Embed widget