News
News
X

Adani Enterprises FPO: ఆటుపోట్ల మధ్యే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవో ప్రారంభం, బిడ్‌ వేస్తారా?

FPO కోసం దరఖాస్తు చేసుకోవాలని భావించే పెట్టుబడిదార్ల కోసం ఈ ఆఫర్ జనవరి 31, 2023 వరకు ఓపెన్‌లో ఉంటుంది.

FOLLOW US: 
Share:

Adani Enterprises FPO: అదానీ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) నేటి (శుక్రవారం, జనవరి 27, 2023) నుంచి ప్రారంభమైంది. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఎఫ్‌పీఓ. దీని ద్వారా రూ. 20,000 కోట్లను సమీకరించేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ సిద్ధమైంది. 

FPO కోసం దరఖాస్తు చేసుకోవాలని భావించే పెట్టుబడిదార్ల కోసం ఈ ఆఫర్ జనవరి 31, 2023 వరకు ఓపెన్‌లో ఉంటుంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల GMP
అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) గురువారం రూ. 45గా ఉంది, బుధవారం రోజుతో పోలిస్తే GMP రూ. 55 రూపాయల మేర తగ్గింది. బుధవారం కంపెనీ షేర్ల GMP రూ.100 వద్ద ఉంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPO ప్రైస్‌ బ్యాండ్ & ఇతర వివరాలు:

FPO ద్వారా, మార్కెట్ నుంచి రూ. 20,000 కోట్లను అదానీ ఎంటర్‌ప్రైజెస్ సమీకరించబోతోంది. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA), అల్ మెహ్వార్ ఇన్వెస్ట్‌మెంట్స్, సిటీ గ్రూప్ గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాచ్స్, LIC, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, SBI పెన్షన్ ఫండ్ వంటి ప్రముఖ కంపెనీలు సహా 30కి పైగా సంస్థాగత పెట్టుబడిదార్ల నుంచి ఈ కంపెనీ దాదాపు రూ. 6,000 కోట్లను ఇప్పటి వరకు సమీకరించింది. 

FPO ద్వారా సమీకరించిన మొత్తంలో రూ. 4170 కోట్లను రుణం చెల్లించేందుకు వినియోగించనుంది. కంపెనీ విస్తరణ ప్రణాళిక కోసం మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. 

FPO తర్వాత ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 3.5 శాతం తగ్గుతుంది. సెప్టెంబర్ 2022 డేటా ప్రకారం, కంపెనీలో ప్రమోటర్ల వాటా 72.63 శాతంగా ఉంది. LICకి 4.03 శాతం వాటా ఉంది. ఇది కాకుండా, నోమురా సింగపూర్, APMS ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్‌లు కంపెనీలో దాదాపు 1 నుంచి 2 శాతం వాటా కలిగి ఉన్నాయి. 

అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPO ప్రైస్‌ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ. 3112 నుంచి రూ. 3276గా నిర్ణయించారు. 

FPOలో 35 శాతం కోటాను రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ రిజర్వ్ చేసింది.

రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రత్యేక డిస్కౌంట్‌ రేట్‌కు షేర్లను కంపెనీ జారీ చేస్తోంది. ఒక్కో షేరు మీద రూ. 64 ప్రత్యేక తగ్గింపు ఇస్తోంది. 

యాంకర్ ఇన్వెస్టర్లు FPO ప్రారంభానికి రెండు రోజుల ముందు, అంటే జనవరి 25, 2023న అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPOలో దరఖాస్తు చేసుకున్నారు. 

FPO ద్వారా పాక్షిక చెల్లింపు ప్రాతిపదికన షేర్లను (Fully Paid Shares) అదానీ ఎంటర్‌ప్రైజెస్ జారీ చేస్తుంది. 

FPOలో వాటాలు పొందిన రిటైల్ పెట్టుబడిదారులను రెండు లేదా మూడు వాయిదాల్లో పూర్తి మొత్తాన్ని చెల్లించమని అదానీ ఎంటర్‌ప్రైజెస్ కోరవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూలోనూ ఇదే జరిగింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 27 Jan 2023 11:24 AM (IST) Tags: Adani Group Stocks Adani Enterprises share price Adani Enterprises FPO Price Band Adani Enterprises FPO dates Gautam Adani

సంబంధిత కథనాలు

Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య

Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య

2023 Honda SP 125: కొత్త హోండా షైన్ వచ్చేసింది - రూ. లక్ష లోపే!

2023 Honda SP 125: కొత్త హోండా షైన్ వచ్చేసింది - రూ. లక్ష లోపే!

WhatsApp Banking: IPPB సేవల్లో మరింత సౌలభ్యం, ఇకపై వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌

WhatsApp Banking: IPPB సేవల్లో మరింత సౌలభ్యం, ఇకపై వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్‌!

OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్‌!

టాప్ స్టోరీస్

RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..

RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ -  కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..

Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్ 

Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్ 

LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!

LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!

Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు

Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు