అన్వేషించండి

Gold Prices: పసిడి ఉత్పత్తి తగ్గుతోంది, కొత్త గనుల్లేవు - చావు కబురు చల్లగా చెప్పిన WGC

Gold Prices Today: ఇకపై తమకు గోల్డ్‌ అక్కర్లేదన్న డ్రాగన్ కంట్రీ ప్రకటనతో బంగారం ధరలు దిగొస్తాయని జనం ఆశ పడ్డారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ‍‌(WGC) ఆ ఆశలపై నీళ్లు చల్లింది.

Latest Gold-Silver Prices June 2024: బంగారం అంటే బంగారమే. ఒక సాధారణ కుటుంబాన్నే కాదు, అగ్రరాజ్యాలను కూడా కష్టకాలంలో ఆదుకుంటుంది. ఆర్థిక మాద్యం భయాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా చాలా దేశాల కేంద్ర బ్యాంక్‌లు నెలనెలా టన్నుల కొద్దీ పసిడిని కొంటున్నాయి. డిమాండ్‌ పెరిగేసరికి ఎల్లో మెటల్‌ సామాన్యుడికి అందనంత ఎత్తు ఎక్కి కూర్చుంది. తాజాగా, గోల్డ్‌ కొనడం ఆపేశామన్న చైనా కేంద్ర బ్యాంక్‌ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ప్రకాశం తగ్గింది.

రేట్ల పెరగడమేగానీ తగ్గడం జరగదు!
ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కొంటోంది చైనానే. ఇకపై తమకు గోల్డ్‌ అక్కర్లేదన్న డ్రాగన్ కంట్రీ ప్రకటనతో బంగారం ధరలు దిగొస్తాయని జనం ఆశ పడ్డారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ‍‌(WGC) ఆ ఆశలపై నీళ్లు చల్లింది. కొత్త నిక్షేపాలు కనిపెట్టడం కష్టంగా మారడంతో బంగారం ఉత్పత్తిలో వృద్ధి కనిపించడం లేదంటూ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. దీనివల్ల, సప్లై తగ్గి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

“2023 మొదటి త్రైమాసికంతో (జనవరి-మార్చి కాలం) పోలిస్తే, 2024 మొదటి త్రైమాసికంలో బంగారు గనుల ఉత్పత్తి 4% పెరుగుతుందని అంచనా వేశాం. కానీ అలా జరగలేదు. 2016, 2018 సంవత్సరాల్లో ఎంత తవ్వి తీశారో ఇప్పటికీ అదే స్థాయిలో మైనింగ్‌ జరుగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి వృద్ధి లేదు. 2008 నుంచి 10 సంవత్సరాల పాటు వేగంగా పెరిగిన మైనింగ్‌ ఇండస్ట్రీ, గత వైభవాన్ని కొనసాగించడానికి ఇప్పుడు కష్టపడుతోంది" - WGC చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ జాన్ రీడ్

ఇంటర్నేషనల్ ట్రేడ్ అసోసియేషన్ డేటా ప్రకారం, 2022తో పోలిస్తే, 2023లో గ్లోబల్‌గా గోల్డ్‌ మైనింగ్‌ 0.5% మాత్రమే పెరిగింది. 2022లో వృద్ధి సంవత్సరానికి 1.35%, 2021లో 2.7%గా ఉంది. 2020లో అయితే 1% క్షీణించింది.

WGC ప్రకారం, ప్రపంచంలో ఉన్న బంగారు గనులన్నింటినీ ఇప్పటికే కనుగొన్నారు. కొత్త నిక్షేపాలు దాదాపుగా లేవు. ఒకవేళ ఉన్నా కనిపెట్టడం కష్టం. ఒక గోల్డ్‌ మైన్‌ను కనిపెట్టాక దానిలో మైనింగ్‌ చేయడం సామాన్యమైన విషయం కాదు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, మైనింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌, ఆధునిక పరికరాలు కావాలి. ఒక గనిని ఉత్పత్తికి సిద్ధం చేయడానికి సగటున 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు... కనిపెట్టిన ప్రతి గనిలో పసడి పుష్కలంగా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. కనిపెట్టిన గనుల్లో కేవలం 10% వాటిలో మాత్రమే మైనింగ్‌కు తగినంత ఎల్లో మెటల్‌ ఉంటుంది.

ఇక మిగిలింది 57,000 టన్నులే! 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 1,87,000 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తవ్వి తీశారు. దీనిలో ఎక్కువ మొత్తం చైనా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న మైన్స్‌లో సుమారు 57,000 టన్నుల ముడి పసిడి ఉంటుందని అంచనా.

బంగారాన్ని కనిపెట్టడమే కాదు, దానిని తవ్వి తీసేందుకు ప్రభుత్వ అనుమతులు పొందడం కూడా కష్టమే. అన్ని రకాల లైసెన్స్‌లు పొందడానికి ఏళ్ల సమయం పడుతోంది, గోల్డ్‌ మైనింగ్‌ ఇండస్ట్రీని ఈ ప్రక్రియ చాలా ఇబ్బంది పెడుతోంది.

ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు (28.35 గ్రాములు) 2,294.3 డాలర్లుగా ట్రేడవుతోంది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget