![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aadhar: ఇల్లు మారారా? ఆధార్‌లో అడ్రస్ మార్చుకోండి, పూర్తి ఉచితంగా!
ఆధార్ కార్డ్‌లో చిరునామా మార్చుకోవడం సహా అన్ని వివరాలు అప్‌డేట్ చేయడానికి, తప్పులు సరి చేసుకోవాలనుకోవడానికి ఇప్పుడు ఫ్రీ ఆఫర్ (Update Aadhaar Details For Free) నడుస్తోంది.
![Aadhar: ఇల్లు మారారా? ఆధార్‌లో అడ్రస్ మార్చుకోండి, పూర్తి ఉచితంగా! Aadhar updation at free of cost last date is extended to 14 June 2024 address change in aadhaar card Aadhar: ఇల్లు మారారా? ఆధార్‌లో అడ్రస్ మార్చుకోండి, పూర్తి ఉచితంగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/c3591097ef9d6132befa5f47974d84691710317902809545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Update Address in Aadhaar Card By Online: మీరు ఇటీవలే ఇల్లు మారారా?, మీ ఆధార్ కార్డ్‌లో కొత్త ఇంటి చిరునామాను యాడ్ చేయాలా? మీ దగ్గర సరైన ప్రూఫ్ ఉంటే, ఇది చాలా చిన్న పని. మీ ఆధార్ వివరాల్లో కొత్త చిరునామా ఈజీగా యాడ్ చేయవచ్చు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, పూర్తి ఉచితంగా ఈ పని పూర్తి చేయొచ్చు.
ఆధార్ కార్డ్‌లో చిరునామా మార్చుకోవడం సహా అన్ని వివరాలు అప్‌డేట్ చేయడానికి, తప్పులు సరి చేసుకోవాలనుకోవడానికి ఇప్పుడు ఫ్రీ ఆఫర్ (Update Aadhaar Details For Free) నడుస్తోంది.
మీ ఆధార్ కార్డ్‌ను ఉడాయ్ (UIDAI) పది సంవత్సరాలకు ముందు జారీ చేసి ఉన్నా, గత పదేళ్లుగా ఆధార్ వివరాల్లో మీరు ఎలాంటి మార్పులు చేయకపోయినా.. 'ఫ్రీ ఆధార్ అప్‌డేషన్' అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది. ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే చివరి తేదీ ఈ నెల (మార్చి) 14, 2024తో ముగుస్తుండగా, ఉడాయ్ ఆ గడువును మరో మూడు నెలలు పొడిగించింది.
ఇప్పుడు, 2024 జూన్ 14వ తేదీ వరకు, ఇంటి అడ్రస్ సహా ఆధార్ వివరాలను ఉచితంగా (Last Date For Update Aadhaar Details) అప్‌డేట్ చేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసే వాళ్లకే ఈ ఛాన్స్. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం రాకపోతే.. ఆధార్ కేంద్రం/CSCకి వెళ్లి, అడ్రస్ సహా ఆధార్ సమాచారాన్ని మార్చుకోవచ్చు. దీనికి కొంత రుసుము చెల్లించాలి.
ఆధార్ కార్డ్‌లో అడ్రస్ వివరాలను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలి? (How Update Address in Aadhaar Card For Free?)
ఉడాయ్ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి మీ ఆధార్ కార్డ్‌లోని అడ్రస్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేయొచ్చు. దీనికోసం, మీ దగ్గర తగిన రుజువు పత్రాలు ఉండాలి. మీ అడ్రస్‌ను మార్చుకోవడానికి... మీ ఆధార్ నంబర్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉన్న ఫోన్, స్కాన్ చేసిన ఐడీ ప్రూఫ్‌లు ను దగ్గర పెట్టుకోవాలి.
ఇప్పుడు, myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
మీ ఆధార్ నంబర్‌ను సంబంధింత గడిలో పూరించండి
మీ ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్‌కు వచ్చే OTPని కూడా పూరించి, లాగిన్ అవ్వండి
మీ పేరు/ జెండర్/ పుట్టిన తేదీ, చిరునామాలో ఒక ఆప్షన్ ఎంచుకోండి
'అప్‌డేట్ ఆధార్' ఆప్షన్ ఎంచుకోండి
ఇప్పుడు, ఇంటి చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్ కాపీలను అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను (Demographic data) అప్‌డేట్ చేయండి
ఇప్పుడు మీకు అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ (URN) వస్తుంది. ఆ నంబర్‌ను జాగ్రత్త చేయండి. ఆధార్ అప్‌డేషన్ స్టేటస్ తనిఖీ చేయడానికి URN ఉపయోగపడుతుంది. ఈ నంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు, రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్‌కు కూడా వస్తుంది. అప్‌డేట్ చేసిన రెండు, మూడు రోజుల తర్వాత https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్ ద్వారా పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ అప్‌డేషన్ స్టేటస్ (Track Aadhaar Updation Status) తనిఖీ చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)