Dividend Stocks In September 2022: ఈ 5 స్టాక్స్‌లో డివిడెండ్ రికార్డ్ డేట్స్ ఫిక్స్ చేశారు, ఆలసించిన ఆశాభంగం!
మన మార్కెట్‌లో ఇప్పుడు T+2 సెటిల్‌మెంట్‌ను ఫాలో అవుతున్నారు కాబట్టి రెండు రోజుల ముందే షేర్లను కొనాలి, రికార్డ్ తేదీ కల్లా అవి మీ డీమ్యాట్ అకౌంట్‌లో ఉండేలా చూసుకోవాలి.
Dividend Stocks In September 2022: క్రమం తప్పకుండా డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ కోసం స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేస్తుంటారు. సదరు స్టాక్స్‌ని భవిష్యత్ కోసం హోల్డ్‌లో పెట్టేసి, వర్తమానంలో డివిడెండ్‌ను ఎంజాయ్ చేయవచ్చన్నది వాళ్ల ఆలోచన. ఇక, 5 కంపెనీలు 'తుది డివిడెండ్' కోసం రికార్డు తేదీని నిర్ణయించాయి. ఈ నెలలోనే (సెప్టెంబర్) రికార్డ్ డేట్స్ ఉన్నాయి. ఈ రికార్డ్ డేట్ నాటికి ఎవరి పోర్ట్‌ఫోలియోలో ఆయా షేర్లు ఉన్నాయో, వాళ్లకు తుది డివిడెండ్ అందుతుంది. ఒక్కో షేరుకు కంపెనీ ప్రకటించిన మొత్తం చొప్పున, మీ దగ్గర ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లకు కలిపి మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు జమ అవుతుంది. మీ దగ్గర ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు లేకపోతే, మీకు డివిడెండ్ కావాలనుకుంటే, రికార్డ్ తేదీకి కనీసం రెండు రోజుల ముందు ఆయా షేర్లను కొనాలి. మన మార్కెట్‌లో ఇప్పుడు T+2 సెటిల్‌మెంట్‌ను ఫాలో అవుతున్నారు కాబట్టి రెండు రోజుల ముందే షేర్లను కొనాలి, రికార్డ్ తేదీ కల్లా అవి మీ డీమ్యాట్ అకౌంట్‌లో ఉండేలా చూసుకోవాలి. లేకపోతే డివిడెండ్ రాదు.
తుది డివిడెండ్ ప్రకటించిన కంపెనీలు, రికార్డ్ డేట్స్ ఇవి:
Mrs Bectors Food Specialities
2021-22 ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్ పొందేందుకు అర్హులైన వారిని గుర్తించేందుకు, ఈ నెల (సెప్టెంబర్) 23ను "రికార్డ్ తేదీ"గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు మధ్యంతర డివిడెండ్‌గా రూ.1.25 ప్రకటించింది. ఇప్పుడు అంతే మొత్తాన్ని తుది డివిడెండ్ ప్రకటించింది.
ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.376
52 వారాల గరిష్ట ధర రూ.443
52 వారాల కనిష్ట ధర రూ.245
కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2214 కోట్లు
DMR Hydroengineering & Infrastructures Ltd
తుది డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డు తేదీ ఈ నెల 20.
స్టాక్ ప్రస్తుత మార్కెట్ ధర రూ.22.20
52 వారాల గరిష్ట ధర రూ.44.25
52 వారాల కనిష్ట ధర రూ. 21
NLC India Ltd
2021-22 ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్ రికార్డు తేదీని ఈ నెల 22గా నిర్ణయించింది.
స్టాక్ ప్రస్తుత మార్కెట్ ధర రూ.81.35
52 వారాల గరిష్ట ధర రూ.92.40
52 వారాల కనిష్ట ధర రూ.51.55.
కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,280 కోట్లు.
Nitin Castings Ltd
తుది డివిడెండ్ కోసం రికార్డు తేదీ సెప్టెంబర్ 22, 2022గా నిర్ణయించింది.
స్టాక్ యొక్క ప్రస్తుత మార్కెట్ ధర రూ.141
52 వారాల గరిష్ట ధర రూ.169
52 వారాల కనిష్ట ధర రూ. 84
కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.72.75 కోట్లు.
Himatsingka Seide Ltd
తుది డివిడెండ్ చెల్లింపు కోసం ఈ నెల 21ని రికార్డ్ డేట్‌గా కంపెనీ నిర్ణయించింది.
స్టాక్ ప్రస్తుత మార్కెట్ ధర రూ.108
52 వారాల గరిష్ట ధర రూ.311
52 వారాల కనిష్ట ధర రూ.90
మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1066 కోట్లు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.