అన్వేషించండి

Budget : "దేశం" అడుగుతోంది.. ఈ బడ్జెట్ ఎవరి కోసం ?

దేశమంటే మట్టి కాదు..మనుషులు. బడ్జెట్ కూడా మనుషుల కోసమే. మనుషులంటే ఒక్క బడా కార్పొరేట్లు మాత్రమే కాదు 90 శాతానికి పైగా ఉండే ఎగువ, దిగువ మద్యరగతి, పేద, నిరుపేద వర్గాలు. మరి వారి కోసం ఈ బడ్జెట్‌లో ఏముంది ?

" బడ్జెట్ " అంటే పద్దు. ఈ ఏడాది ఎంత ఆదాయం వస్తుంది ? దేని కోసం ఖర్చు చేయాలి ? అని సగటు మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబం కోసం వేసుకునే లెక్కలే బడ్జెట్. తన ఆదాయాన్ని ఓ కుటుంబ పెద్ద ఎలా ఖర్చు పెడతారంటే ముందుగా కూడు, గుడ్డ, నీడ, పిల్లల చదువులు ,ఆరోగ్యం ఇలా ప్రయారిటీ పెట్టుకుంటాడు. కొంత మంది వేరే రకంగా పెట్టుకోవచ్చు. ఎవరు ఎలా పెట్టుకుంటారనేది ఆ కుటుంబ పెద్ద ఆలోచనలు.. బాధ్యతల గుర్తిచే విధానం బట్టి ఉంటుంది. అదే ప్రభుత్వం దేశాన్ని ఓ కుటుంబంగా భావించి లెక్కలేసి మనకు చెబితే యూనియన్ బడ్జెట్ అంటాం.  కేంద్రం దాదాపుగా రూ. 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను సిద్ధం చేసింది. మరి మన దేశ కుటుంబ పెద్ద ప్రయారిటీలు ఎలా తీసుకున్నారు ?  తమ బిడ్డలయిన ప్రజల కడుపు నింపే ప్రాధాన్యత తీసుకున్నారా ? వారికి నీడ అందించేందుకు లక్ష్యం పెట్టుకున్నారా ?  ఏ లక్ష్యాన్ని టార్గెట్ చేసి బడ్జెట్ లెక్కలు సిద్ధం చేశారు. ఇవన్నీ కాస్త కన్ఫ్యూజింగ్‌గా ఉంటాయి కానీ సామాన్యుడి కోణంలో ఆలోచిస్తే మాత్రం ఎన్నో .. ఎన్నెన్నో  డౌట్లు వస్తాయి..? మా గురించి ఎందుకు పట్టించుకోలేదనే నిరాశా.. నిస్పృహలు కలుగుతాయి. కేంద్రం ఎందుకిలా ఆలోచించలేదు ? 


రాజ్యమంటే మట్టి కాదు మనుషులు.. వారు బాగుంటేనే రాజ్యం బాగున్నట్లు !

రాజ్యం అంటే ఏమిటి ? శక్తి వంతమైనది.. సర్వసత్తాకమైనది సార్వభౌమాధికారం ఉన్నది.. ఇవన్నీ ! మహానుభావులు చెప్పినట్లు దేశమంటే మట్టికాదు మనుషులు.. రాజ్యం అన్నా మనుషులే. వారు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వం విశాలంగా ఆలోచించాలి. రాజ్యం ప్రధాన కర్తవ్యం... ప్రజల క్షేమం.. సంక్షేమం..ప్రగతి. వీటి కోసమే ప్రభుత్వం ఉంటుంది.  అది ఐదేళ్ల కొకసారి మారుతూ ఉంటుంది. ప్రతి ఏడాది బడ్జెట్ పేరుతో ఓ రకంగా ప్రగతిని ఆవిష్కరిస్తూ ఉంటుంది ప్రభుత్వం. మన బాగుకోసం.. ఏం చేస్తున్నారో చూపించే లెక్క అది. అసలు దేశంలో సగం మందికి తమ కోసం ఒక బడ్జెట్ ఉంటుందని తెలీదు. ఆ సగంలో మరో సగం మందికి బడ్జెట్‌లో ఏముుంటుందో.. తెలీదు.. చాలా మందికి  తమకేం కావాలో తెలీదు. చాలా కొద్ది మందికి తమకేం కావాలో తెలుసు.. అది బడ్జెట్‌లో ఉందో లేదో చూస్తారు. ఇక బడ్జెట్‌ అంటే .రకరకాల లెక్కలు ఆర్థికలోట్లు, ద్రవ్యలోటు.. మూలధన వ్యయం, వృద్ధి రేటు.. ఇలా.. ఆర్థిక నిపుణలకు అర్థమయ్యే పదాలు ఎక్కువ. మామూలు జనాలకు ఇది అర్థంకాకపోయినా  వాటి వల్ల ఎక్కువుగా ఎఫెక్ట్ అయ్యేది ఆ మామూలు జనాలే. ఆ సంగతి వాళ్లకి తెలిసేందుకు ఆర్థిక అక్షరాస్యత మన దేశంలో పెరగకపోవడం ఓ సమస్య. 

బడ్జెట్‌లో ప్రజలను ఆర్థికంగా బాగు చేసే ప్లాన్లు కనిపించాయా? 

ప్రాజెక్టులు..  పైపులైన్లు.. గ్యాస్‌ మాటలు ఏమీ వద్దు.. ప్లెయిన్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నేళ్లుగా బడ్జెట్‌ వస్తుంది. సంవత్సరాలు మారుతాయి.. ప్రభుత్వాలు మారుతారు.. అంకెలు మారుతాయి. .ఇన్ని మారతాయి.. మా జీవితాలు మారవ్.. అన్నట్లుగానే పేదవాళ్ల పరిస్థితి ఉంటుంది. దేశం అభివృద్జి చెందుతుంది.. కానీ జనం పేదవాళ్లు లాగానే ఉంటారు. జస్ట్ స్థానభ్రంశం జరుగుతుంది  మార్జినల్ సెక్షన్లు.. బాగా పేదవాళ్లకు అసలు బడ్జెట్‌ వల్ల ఏదైనా జరుగుతుంది అన్న ఊహే ఉండదు కాబట్టి సమస్య లేదు. వచ్చిన ఆదాయంలో సగం వరకూ టాక్సులకు సమర్పించుకునే నెల జీతగాళ్లు.. తమకు ఏమైనా మేలు జరుగుతుందా.. తమను పట్టించుకుంటారా అని ప్రతీసారీ ఎదురు చూడటం.. నిరాశ పడటం సహజంగా జరిగిపోతోంది. ప్రతీ సారీ జరిగే తంతే.. ఇది.. ఈసారి కూడా అంతే.. ఎందుకంటే.. ఇన్‌ కమ్ టాక్స్ శ్లాబులేం మారలేదు. 

బడ్జెట్‌లో ప్రజలు ఏం కోరుకున్నారో రాజ్యం ఓ సారి ఆలోచించిందా? 

అసలు ఈ సారి బడ్జెట్‌లో ప్రజలు ఏం కోరుకున్నారు. అంటే.. ఒక జాతీయ పత్రిక దీనిపై ప్రీ బడ్జెట్‌ సర్వే చేసింది. తమకు ఉద్యోగాలు కావాలని ఎక్కువ మంది అన్నారు.  మరో 28శాతం మంది పన్నుల శ్లాబులుమార్చాలన్నారు.  అంటే దేశంలో 60శాతం మంది ప్రధానమైన ఆవేదన ఏంటంటే..  సగం మందికి ఉద్యోగాలు లేవు అని.. మరో సగం మంది.. ఉద్యోగం చేస్తున్నా.. ప్రభుత్వం దోచేస్తోంది.. అని.. ఈ రెండింటికీ కూడా బడ్జెట్‌లో లో సమాధానం లేదు. ఉద్యోగాల గురించి జనాలకు అర్థం కానీ భాషలో అమృత్ కాల్ , వికాస్  అని ఏదో చెబుతారు. ఆదుకోవడం గురించి ఆత్మనిర్భర్ అంటారు.  కరోనా దేశాన్ని చిదిమేసింది. మొత్తం 97శాతం మంది ప్రజలు కరోనా దెబ్బకు ఆదాయాన్ని కోల్పోయారు. .అని కేంద్ర సంస్థలే లెక్క తేల్చాయి. అంటే ఈ బడ్దెట్‌లో చేయాల్సింది..  ఆదాయాన్ని కోల్పోయిన వారికి లబ్ది చేకూర్చడం.. గ్రోత్‌ పెంచడం.. కరోనా కారణంగా దెబ్బతిన్నరంగాలకు రూ. 20లక్షల కోట్ల స్టిమ్యులేట్ ప్యాకేజ్ అన్నారు.. కానీ దీని వల్ల ఎవరు బాగుపడ్డారు ? కేవలం 10-12 శాతం. దేశంలోని ఆర్థిక నిపుణలు చెబుతున్న మాట ఇది. జనధన్ ఖాతాల్లో వేసిన కొద్ది మొత్తమే కొద్దిగా ఆదుకుంది. ఇక చిన్న పరిశ్రమలను ఆదుకోవడానికి.. మధ్య తరగతికి కొనుగోలు శక్తి పెంచడానికి ఇచ్చిన స్టిమ్యులేషన్ పనిచేయలేదు మరి. ఈ లెక్కలు కేంద్రం ఎప్పుడూ బయట పెట్టదు. 

వ్యాక్సిన్ గొప్పలే కానీ వైద్య మౌలికసదుపాయాలు... గ్రామీణ ఉపాధి సంగతేంటి ? 

కరోనా సెకండ్‌వేవ్‌లో దేశం ఎలా వణికిపోయిందో మనం చూశాం. ఆక్సిజన్‌ దొరక్క జనాలు రోడ్లపైన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. శవాలను సామూహికంగా తగులబెట్టారు. అవన్నీ కూడా మన దేశ మెడికల్‌ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సామర్థ్యాన్ని నేకెడ్‌గా మనకు చూపించాయి. ఉన్నోళ్లు .. ఉన్నారు.. పోయినోళ్లు పోయారు.. అన్నట్లుగా నడిచింది. మళ్లీ మూడోవేవ్ వచ్చింది. కానీ.. వ్యాధి తీవ్రత తక్కువుగా ఉన్నాం కాబట్టి బ్రతికిపోయాం. అయితే ప్రభుత్వం మరీ ఏం చేయలేదు అని చెప్పలేం. సెకండ్‌ వేవ్ తర్వాత కొంత నేర్చుకుని.. కొంత వరకూ ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్ ఇంప్రూవ్ చేశారు. కానీ.. అవసరం  ఆమడ దూరం.. అందింది అడుగు దూరం అన్నట్లుగానే ఉంటుంది.. పరిస్థితి.  వైద్య సదుపాయాలు మెరుగు చేయడం అన్నది దీర్ఘ కాలిక ప్రణాళిక. జీడీపీలో పదిశాతం వైద్యానికి ఖర్చు చేయాలని దేశంలో మేధావులు మొత్తుకుంటున్నారు. కరోనాతో ఇంత జరిగాక కూడా ఈ ప్రభుత్వాలు.. వైద్యానికి కేటాయింపులు పెంచింది లేదు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఇదే  ఇదే అంశాన్ని పాయింటవుట్ చేశారు. లాక్‌డవున్ టైమ్ లో లక్షలమంది పల్లెల బాట పట్టారు. పల్లెల్లో ఉపాధి లేదు. ఈ సమయంలో వారిని ఆదుకోవడానికి.. ఉపాధి హామీ పథకం బాగా పనికొస్తుంది. దానికి కేటాయింపులు పెంచాలి. కానీ కేటాయింపులు పెంచకపోగా.. తగ్గించారు.దాదాపు పాతిక వేల కోట్లు తగ్గించారు. ఇందులో ఎకనామిక్సే కాదు కామన్ సెన్స్‌ కూడా లేదు. 

ప్రజాస్వామ్యం కాస్త పన్నుస్వామ్యంగా మార్చేసి అదే అభివృద్ధి అనుకుంటే ఎలా ?

జనవరిలో నెలల రూ. లక్షా 41వేల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది అది అత్యధికం అని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇంత కంటే అభివృద్ధి ఏముంది అని మంత్రులు వంత పాడారు. ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడమే అభివృద్ధా అని సామాన్యులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. దేశంలో ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉందో.. ప్రజలు ఉపాధి విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో కళ్ల ముందే కనిపిస్తోంది. కానీ ప్రజల వద్ద నుంచి రికార్డు స్థాయిలో పన్నులు వసూలు చేయడాన్ని గొప్పగా కేంద్రం చెబుతోంది. ఇక్కడ ఓ కఠోరమైన వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి. 
" వెయ్యి రూపాయలు నువ్వు బ్యాంకులో దాచుకుంటే నీకు వచ్చే వడ్డీ 5శాతం అంటే.. ఏడాదికి 50 రూపాయలు.  అదే బ్యాంకు నుంచి నువ్వు తీసుకుంటే ఇవ్వాల్సింది రూ. 90. కొన్ని సార్లు రూ. 150 కూడా అవుతుంది. అదే వెయ్యి రూపాయల ఫుడ్ బయట నువ్వు తింటే అయ్యే ఖర్చు రూ. 1180. అంటే.. 18శాతం జీఎస్‌టీ. సినిమాకు వెళ్లినా , ఏదైనా వస్తువు కొన్నా అంతే.. అంటే ఏ మనిషైనా వెయ్యి ఖర్చు పెట్టాలంటే. 1180 సంపాదించాలన్న మాట. అదే.. ఓ ఐదులక్షల జీతం దాటిన వ్యక్తి ఏడాది కి ఐదు లక్షలు ఖర్చు చేయాలనుకోండి అది రూ. 1486 అవుతుంది. అంటే ఆ వ్యక్తి 20శాతం ఇన్ కమ్ టాక్స్ కూడా కట్టాలి. అంటే 48శాతం ప్రత్యక్ష. పరోక్ష పన్నులు అన్నమాట.  అదే. నెలకు లక్ష రూపాయల జీతం ఉన్న వ్యక్తి అయితే.  ఇంకో పదిశాతం. అటే తన సంపాదన కంటే... పన్నులే ఎక్కువ. దేశంలో ఎవ్వరూ పన్నుల నుంచి తప్పించుకోలేరు. ఆదాయపు పన్ను మాత్రమే కడుతున్నామని చాలా మంది భ్రమిస్తూ ఉంటారు. కానీ మనది పన్ను స్వామ్యం. సంపాదించినందుకు పన్నే కాదు ఖర్చు పెట్టినందుకూ పన్ను కట్టాలి. బిచ్చమెత్తుకునే వాళ్లు కూడా తాము కొనుక్కునే చిన్న బన్ను.. బిస్కెట్లకు.. జీఎస్‌టీ కట్టాల్సిందే.. పరోక్ష పన్నులు ఆ రకంగా ఉంటాయి. మరి జీతాలు పెరుగుతన్నాయి.. అభివృద్ధి జరుగుతోంది.. కానీ.. జీవితాలు మారడం లేదే.. అనే కదా ఈ గోలంతా.. 

పేద, మధ్యతరగతి వర్గాలను కాస్త కనికరించే బడ్జెట్ ఎప్పుడు ? 

రూ. 5 లక్షల వరకూ పన్ను లేదు అంటారు. కానీ రూ. 5 లక్షలు దాటగానే రెండున్నర లక్షల నుంచి పన్ను బాదుతున్నారు. జీతాలు పెరిగాయి కదా.. అంటారు. కానీ.. పెట్రోలు రేటు.. పదేళ్లలో 90శాతం పెరిగింది.. అని చూడరు. రెంట్లు, రేషన్, వైద్యం ఆహారం, వైద్యఖర్చులు అన్నీ పెరిగినప్పుడు.. ఇంకేంముంటుంది. ఏమీ ఉండని వాడి దగ్గర టాక్సులతో పిండేస్తుంటే ఇంకేముంటుుంది.?  ఫ్రస్టేషనే ఉంటుంది. పదిలక్షల జీతం దాటిన అతను 58శాతం టాక్స్ కట్టాలి. స్టాక్‌ మార్కెట్‌లో ఒకటి రెండు రోజుల్లో వచ్చే సంపాదన.. అది. అంటే  రోజంతా 10-12గంటలు కష్టపడ్డా రావడం లేదని.. దాని బదులు ఈజీ మనీ వచ్చే మర్గాలు చూసుకుంటే..! పైగా కష్టపడిన దాంట్లో సగానికిపైగా ప్రభుత్వం కొల్ల గొడుతోందనే భావన సగటు మనిషికి రావొచ్చు. ప్రొడక్టివిటీకి వాల్యూ లేకుండా పోతోంది అని జనం అనుకోవడం తప్పు కాదు కదా..!  సరే పేదవాళ్ల పాట్లు ఇలా ఉంటే.. . మధ్య తరగతి వాళ్ల బాధలు ఇంకోలా ఉంటాయి.. డబ్బులున్న వాళ్లు టాక్సు రిబేట్లు తీసుకుంటారు. డబ్బులు లేని వాళ్లు టాక్సులే కట్టరు.  ఎటొచ్చీ తామే అన్యాయం అయిపోతున్నామన్న బాధ వాళ్లది..  నిజం కూడా ! ఎందుకంటే.. ఉద్యోగులకు జీతంలోనే టాక్స్ కట్ చేసి ఇస్తారు. కచ్చితంగా తప్పించుకోలేరు. ఓ మోస్తరు జీతం వచ్చే వాళ్లు లక్షల్లో టాక్స్‌లు కడుతుంటారు. వాళ్లది అదో బాధ. అలాగే చిన్నా చితకా జీతాలకు పనిచేసేవాళ్లు.. రూ.  40వేలకు పైన సంపాదించే వాళ్లు... సిటీలో వాళ్ల ఖర్చులకు మిగిలేది ఏముంటుంది.? . ఈఎంఐలు తీస్తే.. బ్యాంకులో ఎప్పుడూ  నెగటివ్ అమౌంటే.. వాళ్లు కూడా టాక్సు కట్టాల్సి రావడం.. ప్రతీసారీ టాక్సులు మారతాయా... అని .. తమ జీవితాలు మారతాయోమో అన్నంత ఆత్రంగా చూస్తుంటారు. కానీ.. ఏముండదు.. !

ప్రస్తుతం రాజ్యంలో ప్రజలు కష్టపడి సంపాదించినదాంతో  సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ తమ ఆదాయంలో సగం ప్రభుత్వమే పన్నుల రూపంలో లాగేస్తూంటే ఎలా సర్దుకుపోవాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. నలిగిపోతున్నారు. కుంగిపోతున్నారు. వీరి ఆవేదనను తొలగించే బడ్జెట్ కావాలి ! అది కలల బడ్జెట్ కావొచ్చు.. బడుగుల బడ్జెట్ కావొచ్చు..! దాని కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్ మాత్రం వంద శాతం అలాంటిది కాదు ! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
YSRCP Kannababu: పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
TV Movies: సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Bigg Boss Telugu Season 8: డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
Embed widget