Yamaha XSR 155 లాంచ్, MT-15 తో పోలిస్తే ₹16,000 చవక - డిజైన్, ఫీచర్స్‌లో ఉన్న తేడాలేంటి?
Yamaha XSR 155 ఇండియాలో లాంచ్ అయింది. MT-15 కంటే ₹16,000 తక్కువ ధరతో, రెట్రో లుక్ & యూత్‌ఫుల్ పనితీరుతో బైక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. రెండిటి మధ్య తేడాలు ఇవే.

Yamaha XSR 155 - Yamaha MT15 Comparison: యమహా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న XSR 155 ఎట్టకేలకు ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది కూడా 155cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తోనే వచ్చినా... డిజైన్, స్టైల్, ఫీచర్ల పరంగా MT-15 తో పోలిస్తే పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా రెట్రో లుక్ ఇష్టపడే రైడర్ల కోసం ఈ బైక్ సరిగ్గా సరిపోతుంది.
డిజైన్ & స్టైలింగ్
XSR 155 రూపం చూడగానే “ఇదిగో కొత్తదనం!” అనిపిస్తుంది. MT-15 లో ఉన్న షార్ప్, ఫ్యూచరిస్టిక్ లుక్ కంటే XSRలోని నియో-రిట్రో డిజైన్ క్లాసిక్ ఫీల్ ఇస్తుంది. XSRలో రౌండ్ LED హెడ్‌ల్యాంప్స్, క్లాసిక్ స్టైల్ DRL లైట్లు, సింపుల్ రియర్‌వ్యూ మిర్రర్లు, టియర్ డ్రాప్ ట్యాంక్ డిజైన్ ఉంటే, MT-15లో మాత్రం స్పోర్టీ ట్యాంక్ డిజైనింగ్, ట్విన్ DRL “ఐస్” లుక్ వంటివి అట్రాక్షన్ సెంటర్‌గా మారాయి.
ట్యాంక్ పరంగా XSR 155 కొంచెం చిన్నగా కనిపించినా, 10 లీటర్ల సామర్థ్యం ఉంది, ఇది MT-15 తో సమానం. అంతేకాదు.. MT-15తో పోలిస్తే XSR 155 నాలుగు కిలోల తక్కువ బరువుతో వస్తుంది, అంటే సిటీ రైడ్ సమయంలో హ్యాండ్లింగ్ మరింత ఈజీగా ఉంటుంది. సీటింగ్ విషయంలో XSR 155 లో సింగిల్ పీస్ ఫ్లాట్ సీట్, MT-15 లో స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి.
బండి వెనుక భాగంలో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తుంది, XSRలో రౌండ్ LED టెయిల్ ల్యాంప్, MT-15లో మాత్రం హారిజాంటల్ స్ట్రిప్ ల్యాంప్ ఉంటుంది.
ఫీచర్స్ & టెక్నాలజీ
రెండు బైక్‌ల్లోనూ డ్యూయల్ చానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి. అయితే MT-15 టాప్ వెర్షన్‌లో కొత్త TFT డిస్‌ప్లే ఇచ్చారు, కానీ XSR 155 లో మాత్రం క్లాసిక్ రౌండ్ LCD మీటర్ ఉంది. ఇది యాప్-బేస్డ్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. అంటే మీ మొబైల్‌తో సింక్ చేసుకోవచ్చు.
ధర & వేరియంట్స్
XSR 155 ఒక్క వేరియంట్‌లోనే లభిస్తుంది. నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్న ఈ బైక్ ధర ₹1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది MT-15 బేస్ మోడల్‌కంటే ₹5,000 తక్కువ, టాప్ MT-15తో పోలిస్తే ₹16,000 తక్కువగా ఉంటుంది. దీంతో, XSR 155 మోడల్ యమహా లిక్విడ్-కూల్డ్ 155cc సెగ్మెంట్‌లోనే అత్యంత చవకైన బైక్‌గా నిలిచింది. అదే ఇంజిన్‌తో వచ్చినా, XSR 155 రైడింగ్ పొజిషన్, లుక్, ఫీల్ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి.
ఎవరికి బెటర్?
MT-15 స్పోర్టీ లుక్ ఇష్టపడే యంగ్ రైడర్స్‌కు సరిపోతే, XSR 155 మాత్రం రెట్రో స్టైల్ ప్రేమికులకు పర్ఫెక్ట్ ఛాయిస్. రైడింగ్‌లో ఫన్, స్టైల్‌లో క్లాసిక్, ప్రైస్‌లో స్మార్ట్ - ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ యమహా XSR 155 ఇప్పుడు యువతలో కొత్త క్రేజ్‌గా మారనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















