By: ABP Desam | Updated at : 17 Apr 2022 10:44 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
Yamaha_Neo
ప్రస్తుతం మనదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మెల్లగా డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ బ్రాండ్లతో పాటు స్టార్టప్‌లు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో కొత్త మోడళ్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు యమహా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను టీజ్ చేసింది. ఇవి త్వరలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటి ధర కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉంది.
యమహా నియో డిజైన్ చూడటానికి కాన్సెప్ట్ తరహాలో ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఏ లుక్‌లో ఉందో ఇప్పుడు కూడా అదే లుక్‌లో ఉంది. ఇతర మార్కెట్లలో ఈ స్కూటర్ చవకైన ధరలోనే లాంచ్ అయింది. ఇది మనదేశంలో కూడా చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు కోరుకునేవారిని ఆకర్షించనుంది.
ఇక దీని డిజైన్ విషయానికి వస్తే... ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి. దీని డిజైన్ ప్రస్తుతం మనదేశంలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే స్పోర్ట్స్ లుక్‌తో ఉంది. హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. రెండు లిథియం ఇయాన్ బ్యాటరీలు కూడా ఉన్నాయి. వీటిలో సింగిల్ బ్యాటరీ వెర్షన్ 37.5 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇక రెండు బ్యాటరీల వెర్షన్ 68 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
దీన్ని చార్జింగ్ పెట్టడానికి 8 గంటల సమయం పట్టనుంది. వేర్వేరు రైడింగ్ మోడ్స్‌ను కూడా ఈ స్కూటీలో అందించారు. ప్రస్తుతం బౌన్స్ ఇన్‌ఫినిటీ ఈ1 తరహాలో మార్చదగ్గ బ్యాటరీ సిస్టం ఇందులో ఉంది. స్టాండర్డ్ 50 సీసీ స్కూటర్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్ తరహాలో ఈ స్కూటర్ ఉంది.
ఈ స్కూటర్ ధర మనదేశంలో ఎంత ఉండనుందనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. యూరోప్‌లో దీని ధర రూ.2.5 లక్షల రేంజ్‌లో ఉంది. కానీ మనదేశంలో దీని ఫీచర్లతో మార్పులు చేయడంతో పాటు ధరను కూడా కచ్చితంగా తగ్గించే అవకాశం ఉంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
New Brezza: కొత్త బ్రెజాలో అదే హైలెట్ - లాంచ్ త్వరలోనే - లుక్ ఎలా ఉందంటే?
Kia EV6 Review: ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఎస్యూవీ " కియా ఈవీ 6 "
Jeep Meridian: ఫార్చ్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు