అన్వేషించండి

Maruti Electric Car: మారుతి ఇ-విటారా బ్లాక్‌ కలర్‌లో ఎందుకు కనిపించింది, లాంచింగ్‌ ఎప్పుడు?

Maruti Suzuki e-Vitara: స్టైలిష్‌గా కనిపించే కొత్త ఎలక్ట్రిక్‌ కార్‌ కోసం మీరు సెర్చ్‌ చేస్తుంటే, మారుతి సుజుకి ఇ-విటారా వివరాలను మీరు తెలుసుకోవాలి.

Maruti Suzuki e-Vitara Launch Date: మరికొంత కాలంలో, మారుతి సుజుకి భారతదేశంలో లాంచ్‌ చేయనున్న ఎలక్ట్రిక్ SUV ఇ-విటారా కోసం ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి, మారుతి నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ వాహనం ఇదే. ఈ ఏడాది జనవరిలో జరిగిన 'ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో' సందర్భంగా, మారుతి సుజుకీ, ఇ-విటారాను మొదటిసారిగా పరిచయం చేసింది. లాంచ్‌కు ముందు, ఇప్పుడు, ఇ-విటారా నలుపు రంగుతో ఎటువంటి కవర్ లేకుండా రోడ్డుపై కనిపించింది.

న్యూస్‌ వెబ్‌సైట్ రష్లేన్‌ రిపోర్ట్‌ చేసిన ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ SUV మారుతి గురుగావ్‌ క్యాంపస్ బయట కనిపించింది. ఎలక్ట్రిక్ SUV ఇ-విటారా లాంచ్ కోసం జరుగుతున్న సన్నాహాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయని ఈ సంఘనట సూచిస్తుంది.

డిజైన్ ఎలా ఉంది?
మారుతి సుజుకి E విటారా డిజైన్ పూర్తిగా ఆధునికంగా & దూకుడు (అగ్రెసివ్‌)గా ఉంది. నిగనిగలాడే నలుపు రంగులో ఈ కారు దర్శనమివ్వడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. కనెక్టెడ్‌ LED టెయిల్‌ల్యాంప్స్‌, షార్ప్‌ బంపర్ కట్స్‌, డ్యూయల్-టోన్ ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, C-పిల్లర్‌ మీద ఇంటిగ్రేటెడ్ డోర్ హ్యాండిల్స్ & మారుతి సిగ్నేచర్ స్టైల్‌ వంటి ముచ్చటగొలిపే ఎక్స్‌టీరియర్‌ను కూడా ఈ కారులో చూడవచ్చు. బోల్డ్ వీల్ ఆర్చ్‌లు & చూడచక్కటి సైడ్ ప్రొఫైల్ దీనిని మస్క్యులర్ & గ్లోబల్ లుక్‌లోకి మార్చాయి. భారతీయ కస్టమర్లతో పాటు అంతర్జాతీయ కస్టమర్లను కూడా ఆకర్షించేలా ఈ కారును డిజైన్‌ చేశారు.

బ్యాటరీ & రేంజ్‌
మారుతి ఇ-విటారాలో జనం ఎక్కువగా చూస్తున్న విషయం దాని బ్యాటరీ & రేంజ్. E Vitaraలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌ ఉంటాయి - మొదటిది 48.8 kWh స్టాండర్డ్ ప్యాక్, ఇది దాదాపు 450 కి.మీ. రేంజ్ ఇస్తుంది. రెండోది 61.1 kWh లాంగ్ రేంజ్ ప్యాక్, ఇది సింగిల్‌ ఛార్జ్‌లో 500+ కి.మీ. దూరాన్ని కవర్ చేయగలదు. ఈ కారు సింగిల్‌ మోటార్ సెటప్‌తో వస్తుంది. 

ఫీచర్లు & ఇంటీరియర్
ఫీచర్లు & ఇంటీరియర్ల విషయానికి వస్తే... E Vitara టెక్నాలజీ & లగ్జరీ-రిచ్ కారు. కంప్లీట్‌ డిజిటల్ ఇన్‌స్ట్రమెంట్‌ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & లెవల్-2 ADAS (లేన్ కీప్ అసిస్ట్ & ఆటోమేటిక్ బ్రేకింగ్ వంటివి) వంటి అధునాతన లక్షణాలు కారుకు ప్రీమియం ఫీల్‌ ఇస్తాయి. ఈ కారు డెల్టా, జీటా & ఆల్ఫా వేరియంట్‌లలో లాంచ్‌ చేయబోతున్నారు. తద్వారా కస్టమర్‌లు వారి అవసరాలు & బడ్జెట్ ప్రకారం వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

ఎలక్ట్రిక్ SUV విభాగంలో, e Vitara ఇప్పటికే ఉన్న ప్రధాన మోడళ్లతో పోటీ పడనుంది. డిజైన్ & టెక్నాలజీ పరంగా హ్యుందాయ్ క్రెటా EVతో; డ్రైవింగ్‌ రేంజ్‌ & సేఫ్టీ విషయంలో Tata Harrier EVతో; పెర్ఫార్మెన్స్‌లో Mahindra XUV 9eతో & డబ్బుకు తగిన విలువలో MG ZS EVతో పోటీ పడనుంది. e Vitaraను ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ సమయంలో లాంచ్‌ చేయవచ్చు. ప్రారంభ ధర దాదాపు రూ. 17 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. లాంచ్‌కు ముందే బుకింగ్స్‌ ఓపెన్‌ కావచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra డార్క్ ఎడిషన్ లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్, ఆన్ రోడ్ ధర వివరాలు
Tata Sierra డార్క్ ఎడిషన్ లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్, ఆన్ రోడ్ ధర వివరాలు
మీ బడ్జెట్‌లోనే 7 సీటర్‌ MPV.. నిస్సాన్‌ గ్రావైట్‌ CNG వెర్షన్‌ నిజజీవితంలో ఎంత మైలేజ్‌ ఇస్తుందంటే?
నిస్సాన్‌ గ్రావైట్‌ CNG రివ్యూ: బడ్జెట్‌ 7-సీటర్‌కు అదిరిపోయే మైలేజ్‌.. CNG వెర్షన్‌ ఎలా ఉందంటే?
టాటా నుంచి మరో కొత్త సెడాన్‌.. Tigor ప్లేస్‌లోకి Aeris.. ఇవే హైలైట్స్‌!
టాటా టిగోర్‌కు గుడ్‌బై.. 'ఏరిస్‌'కు వెల్‌కమ్‌! సెప్టెంబర్‌ 25న టాటా కొత్త సెడాన్‌ లాంచ్‌
రూ. 2.92 లక్షల RE హిమాలయన్ 440ని కేవలం రూ.30,000 కే ఇంటికి తెచ్చుకోండి! తక్కువ వడ్డీతో EMI లెక్కలు
అడ్వెంచర్‌ బైక్‌ RE హిమాలయన్ 440ని కొంటారా? - అతి తక్కువ డౌన్‌పేమెంట్‌, తక్కువ వడ్డీకే లోన్‌!

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politcis: కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు: పిఠాపురంలో పవన్ కళ్యాణ్
కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు: పిఠాపురంలో పవన్ కళ్యాణ్
Jurala Dam Protests: జూరాల జలాలపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు.. నీళ్లు వస్తున్నాయని తెలిసి బీఆర్ఎస్ హడావుడి -మంత్రి జూపల్లి
జూరాల జలాలపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు.. నీళ్లు వస్తున్నాయని తెలిసి బీఆర్ఎస్ హడావుడి -మంత్రి జూపల్లి
Andhra Pradesh Rains: బలపడుతున్న వాయుగుండం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు! శ్రీకాకుళంలో రోడ్లన్నీ జలమయం
బలపడుతున్న వాయుగుండం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు! శ్రీకాకుళంలో రోడ్లన్నీ జలమయం
CM Chandrababu: మున్సిపల్ చరిత్రలో సువర్ణాధ్యాయం.. కుప్పం నుంచి 11,359 కోట్ల పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
మున్సిపల్ చరిత్రలో సువర్ణాధ్యాయం.. కుప్పం నుంచి 11,359 కోట్ల పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
India First Gold Triumph:  ఆసియా క్రీడల్లో ఎదురులేని భారత్, వరుసగా రెండోసారి పసిడి కైవసం.. ఫైనల్లో లంక చిత్తు.. స‌త్తా చాటిన మంధాన‌, దీప్తి 
ఆసియా క్రీడల్లో ఎదురులేని భారత్, వరుసగా రెండోసారి పసిడి కైవసం.. ఫైనల్లో లంక చిత్తు.. స‌త్తా చాటిన మంధాన‌, దీప్తి 
Adilabad Rims: ఆదిలాబాద్ రిమ్స్ ‌అగ్నిప్రమాదంలో మరో శిశువు మృతి.. మూడుకు చేరిన మరణాలు, విచారణకు సీఎం ఆదేశాలు
ఆదిలాబాద్ రిమ్స్ ‌అగ్నిప్రమాదంలో మరో శిశువు మృతి.. మూడుకు చేరిన మరణాలు, విచారణకు సీఎం ఆదేశాలు
Chiranjeevi: నా రెమ్యూనరేషన్ ముందు ఆ డబ్బెంత? నేను బ్లడ్ అమ్ముకుంటానా? విమర్శలపై మెగాస్టార్ స్పందన
నా రెమ్యూనరేషన్ ముందు ఆ డబ్బెంత? నేను బ్లడ్ అమ్ముకుంటానా? విమర్శలపై మెగాస్టార్ స్పందన
Australia Immigration Policy: ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ నిబంధనల మార్పులు.. భారతీయ విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?
ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ నిబంధనల మార్పులు.. భారతీయ విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?
Embed widget