Salman Khan Bulletproof Car: సల్మాన్ ఖాన్ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు మామూలుగా లేదు మావా!, రేటెంతో తెలుసా?
Sallu Bhai New Bulletproof Car: సల్మాన్ ఖాన్ దగ్గర కొన్ని బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి, వాటిలో ఒకటి టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200. బలమైన బాడీ & అదరగొట్టే ఆఫ్-రోడింగ్ కెపాసిటీ దీని సొంతం.

Salman Khan Bulletproof Mercedes Maybach GLS600 SUV: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌లాగా మరే ఇతర యాక్టర్ కూడా తరచుగా న్యూస్ హెడ్‌లైన్స్‌లోకి రాలేదేమో. సల్లూభాయ్‌కి మిత్రులతో పాటు శత్రువులు కూడా ఉన్నారు. ప్రాణ రక్షణ కోసం, ఈ సిల్వర్ స్క్రీన్ హీరో, బుల్లెట్ ప్రూఫ్ కార్లలోనే ప్రయాణిస్తుంటాడు. సల్మాన్ ఖాన్ ఇటీవలే ఒక బుల్లెట్ ప్రూఫ్ లగ్జరీ SUV కొని మళ్లీ వార్తల్లో నిలిచాడు.
రీసెంట్‌గా, సల్మాన్ ఖాన్, కొన్ని కోట్ల రూపాయల విలువైన మెర్సిడెస్ మేబాక్ GLS600 SUVని కొనుగోలు చేశాడు. ఈ కారు ఫ్రంట్ సీట్‌లో సల్మాన్ ఖాన్ కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కారు ధర, ఫీచర్ల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
సల్మాన్ ఖాన్ కొత్త కారులో అద్భుతమైన ఫీచర్లు
మెర్సిడెస్ మేబాక్ GLS600ని సూపర్ కార్‌తో పోల్చవచ్చు. 4.0-లీటర్ V8 బైటర్బో (twin turbochargers) హైబ్రిడ్ ఇంజిన్‌తో నడిచే పవర్‌ఫుల్ పెర్ఫార్మర్ & లగ్జరీ SUV ఈ కారు. ఈ ఇంజిన్ ఆశ్చర్యపరిచే 557 PS పవర్ & 730 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇంకా.. మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ అదనంగా 22 PS పవర్‌ను & 250 Nm టార్క్‌ను జోడిస్తుంది.
మీరు 5, 6 లేదా 7 గేర్‌బాక్స్‌లు ఉన్న కార్లను చూసి ఉంటారు లేదా విని ఉంటారు. సల్లూభాయ్ కొన్న మెర్సిడెస్ మేబాక్ GLS600 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన 4MATIC ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఉంటుంది. ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.35 కోట్ల నుంచి రూ. 3.70 కోట్ల మధ్య ఉంటుంది. అన్ని ఖర్చులు, పన్నులు కలుపుకుంటే ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపు 4 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ కారు లోపల భాగంలో అత్యత ఖరీదైన ఏర్పాటు ఉంటాయి. లాంజ్ స్టైల్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, రియర్-సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, కాంపాక్ట్ రిఫ్రిజిరేటర్, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ & వర్చువల్ అసిస్టెంట్ సహా బోలెడన్ని ప్రీమియం ఫీచర్ల కలబోత ఈ కారు. ఒక్క మాటలో చెప్పాలంటే, దీనిని "కదిలే రాజభవనం"గా అభివర్ణించవచ్చు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక చిత్రంలో, సల్మాన్ ఖాన్ Mercedes-Maybach GLS600 SUV ముందు ప్యాసింజర్ సీట్లో కూర్చుని కనిపిస్తున్నాడు. ఆ పోస్ట్‌లో, ఇది సల్మాన్ కొత్త Mercedes-Benz GLS600 SUV అని రాసి ఉంది.
సల్మాన్ ఖాన్ కార్ కలెక్షన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కార్లు
సల్మాన్ ఖాన్ దగ్గర టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200 బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది. ఈ SUV బాడీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ కారు హైవే మీదే కారు మట్టిరోడ్ల మీద కూడా దుమ్మురేపుతూ దూసుకెళ్లగలదు. సల్మాన్ దగ్గర నిస్సాన్ పెట్రోల్ SUV కూడా ఉంది. ఈ SUV భారతదేశంలో లేదు, సల్మాన్ దానిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ దగ్గర బుల్లెట్ ప్రూఫ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఉంది, ఇది ప్రీమియం ఇంటీరియర్ లేఅవుట్ & మెరుగైన రోడ్ ప్రెజెన్స్‌తో పాపులర్ అయింది. బుల్లెట్ ప్రూఫ్ కాని మరికొన్ని లగ్జరీ కార్లు కూడా సల్మాన్ ఇంటి గరాజ్‌లో పార్క్ చేసి ఉంటాయి.
సల్మాన్ ఖాన్ భద్రతకు ముప్పు ఉందన్న న్యూస్ తరచుగా కనిపిస్తుంటుంది. ఈ బాలీవుడ్ నటుడిపై కొన్ని హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. కాబట్టి, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉండటం సల్మాన్‌కు అవసరం.





















