Safest Family Car: 2025లో సేఫెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే - క్రాష్ టెస్ట్‌లు, టెక్నాలజీలో టాప్ మార్క్‌లు
Safest Family Cars 2025: ఫ్యామిలీ కార్ కొనేప్పుడు, గరిష్ట భద్రత కోసం 5-స్టార్ గ్లోబల్ NCAP లేదా భారత్ NCAP రేటింగ్స్, ISOFIX మౌంట్స్ & మల్టీ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న మోడళ్లకు ప్రాధాన్యత ఇవ్వండి.

Safest Family Cars in 2025 in India: ఒకప్పటి విలాసాలు ఇప్పుడు అవసరాలుగా మారుతున్నాయి. కార్ కూడా అలాంటిదే. సొంత కార్ వల్ల ఎన్నో సౌలభ్యాలు. అయితే, బండి తీయాలంటే భయం. రద్దీ పెరుగుతోంది తప్ప రహదారుల వెడల్పు పెరగడం లేదు. కార్‌లో బయటకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చే వరకు రోడ్డు ప్రమాద భీతి నీడలా వెంటాడుతుంది. ఈ పరిస్థితుల్లో, కుటుంబ సభ్యులందరి భద్రత కోసం సురక్షితమైన కారు అవసరం. భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP), గ్లోబల్ ఎన్‌క్యాప్ (GNCAP) వంటి సంస్థలు కొత్త కార్‌లకు క్రాష్ టెస్ట్‌లు చేసి సేఫ్టీ రేటింగ్స్ ఇస్తాయి. ఈ రేటింగ్స్ పొందిన కార్లు ఫ్యామిలీ సేఫ్టీ కోసం ప్రత్యేకంగా నిలుస్తాయి.
మీరు సేఫెస్ట్ ఫ్యామిలీ కార్ కొనాలని భావిస్తుంటే, ముందుగా గ్లోబల్ NCAP & భారత్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్స్ చూడాలి. ఈ సంస్థలు.. సురక్షితమైన కార్‌లకు విభాగాలవారీగా మార్కులు, గరిష్టంగా 5-స్టార్ రేటింగ్ ఇస్తాయి. 2025లో, గ్లోబల్ NCAP & భారత్ NCAP ఫ్రెష్‌గా రేటింగ్స్ అందుకున్న కొన్ని ఫ్యామిలీ కార్‌లు అందుబాటులో ఉన్నాయి. పెద్దవాళ్లు & పిల్లల భద్రత, నిర్మాణంలో గట్టిదనం & అధునాతన భద్రత సాంకేతికత ఆధారంగా టాప్ ప్లేస్‌లో నిలిచిన SUVలు & సెడాన్‌లు ఇవిగో...
మన దేశంలో, సేఫ్టీ విషయంలో టాటా కార్‌లదే పైచేయి. Tata Harrier & Tata Safari మోడళ్లు సేఫెస్ట్ ఫ్యామిలీ కార్స్‌గా నిలిచాయి. ఈ కార్‌లలో ప్రయాణించే పెద్దవాళ్లు & పిల్లల రక్షణ విషయంలో ఇవి ఎక్కువ మార్కులు సాధించాయి. ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX మౌంట్స్ & ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ఎయిడ్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో అత్యధిక రేటింగ్స్ పొందాయి. ల్యాండ్ రోవర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా దృఢమైన నిర్మాణ నాణ్యతను ఈ టాటా కార్‌లు నిరూపించుకున్నాయి, భారతీయ రోడ్లకు ప్రత్యేకంగా నిలిచాయి.
Skoda Kushaq & Volkswagen Taigun కూడా పెద్దలు & పిల్లలు రెండు సెగ్మెంట్లలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించాయి. బలమైన నిర్మాణం & ISOFIX & మల్టీ ఎయిర్‌బ్యాగ్స్ వంటి కుటుంబ భద్రత ఏర్పాట్లు వీటిలో ఉన్నాయి.
Mahindra XUV700 లోని అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) & డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నప్పుడు హెచ్చరించే ఏర్పాటు (drowsiness detection) వల్ల ప్రత్యేకంగా నిలిచింది. కాబట్టి, ఈ మోడల్‌ను టెక్-ఫార్వర్డ్, ఫ్యామిలీ సేఫ్టీ SUVగా గుర్తింపు పొందింది.
Mahindra XUV400 EV కూడా సురక్షితమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా నిలిచింది. కార్‌లో ప్రయాణించే పెద్దవాళ్లు, పిల్లల రక్షణలో పరిపూర్ణ స్కోర్స్ సాధించింది.
కార్‌లలో సేఫ్టీ కోసం ఏ ఫీచర్లు చూడాలి?
ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్: పిల్లల సీట్లను సురక్షితంగా & సులభంగా ఇన్‌స్టాల్ చేసే ఫీచర్ ఇది. అన్ని టాప్-రేటెడ్ కార్‌లలో ఈ ఫీచర్ ప్రామాణికంగా కనిపిస్తుంది.
మల్టీ ఎయిర్‌బ్యాగ్స్: టాప్-రేటెడ్ కార్లు.. ముందు సీట్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌లతోపాటు, వెనుక సీట్‌లో కూర్చున్న ప్రయాణీకులకు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తాయి. సాధారణంగా, 6 లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP): స్కిడ్ అయ్యే సమయంలో కార్‌ను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది.
అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS): ప్రయాణీకులకు అదనపు భద్రత కోసం ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఇప్పుడు, ADAS లెవెల్-2 ఫీచర్లు వచ్చాయి.
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) & హిల్ హోల్డ్/డీసెంట్ కంట్రోల్: హైవేలు & కొండ ప్రాంతాలలో భద్రతను ఇవి మెరుగుపరుస్తాయి.
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS): కార్ చక్రాలు బిగుసుకుపోకుండా ఇది చూస్తుంది.
సేఫెస్ట్ సెడాన్‌ల విషయంలో... Volkswagen Virtus & Skoda Slavia ముందుంటాయి.





















