MG Baas Explained: కారు బ్యాటరీకి అద్దె - భారీగా తగ్గిపోనున్న ఎలక్ట్రిక్ కార్ల ధరలు - ఎంజీ సూపర్ స్కీమ్!
MG Baas: ఎంజీ విండ్సర్ ఈవీతో కంపెనీ ఒక సరికొత్త విధానానికి తెర తీసింది. అదే ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’. దీని ద్వారా బ్యాటరీ కాస్ట్‌ను కంపెనీ కారు ధర నుంచి తప్పిస్తుంది. కారు బ్యాటరీకి అద్దె విధిస్తుంది.
What is MG Baas: ఎంజీ మోటార్స్ ఇటీవలే మనదేశంలో ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ (BAAS) అనే కొత్త సర్వీసును మనదేశంలో లాంచ్ చేసింది. విండ్సర్ కారుతో పాటు ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఎంజీ కామెట్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ కార్లకు కూడా ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎంజీ కామెట్ ధర రూ.4.99 లక్షలకు తగ్గనుంది. బ్యాటరీ రెంటల్ కిలోమీటర్‌కు రూ.2.5గా నిర్ణయించారు. మరోవైపు ఎంజీ జెడ్ఎస్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలకు తగ్గనుంది. బ్యాటరీ రెంటల్ కిలోమీటరుకు రూ.4.5గా ఉంది. అంతే కాకుండా మూడు సంవత్సరాల తర్వాత వీటికి 60 శాతం బైబ్యాక్ వాల్యూ అందించనున్నట్లు ఎంజీ తెలిపింది.
‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ అంటే ఏంటి?
ఇప్పటివరకు మీరు ఏదైనా ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేస్తే బ్యాటరీ ధర కూడా అందులోనే ఉండేది కదా! కానీ ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ విధానంలో అలా ఉండదు. బ్యాటరీ కాస్ట్ లేకుండా వినియోగదారులకు కారును విక్రయిస్తారు. అంటే మీరు కారు కొనుగోలు చేసి అందులో ఉన్న బ్యాటరీకి అద్దె కడతారన్న మాట. ఈ అద్దె ఒక్కో కారుకు ఒక్కో లా ఉంది. ఎంజీ కామెట్‌కు బ్యాటరీ రెంటల్ కిలోమీటరుకు రూ.2.5గానూ, ఎంజీ విండ్సర్ ఈవీకి బ్యాటరీ రెంటల్ కిలోమీటరుకు రూ.3.5గానూ, ఎంజీ జెడ్ఎస్ ఈవీకి బ్యాటరీ రెంటల్ కిలోమీటరుకు రూ.4.5గానూ ఉంది.
‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ ఎలా తీసుకోవాలి?
ప్రస్తుతం బజాజ్ ఫిన్ సర్వ్, హీరో ఫిన్ కార్ప్, విద్యుత్, ఎకోఫై ఆటోవర్ట్ కంపెనీల ద్వారా ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ సర్వీసును అందుకోవచ్చు. మినిమం కిలోమీటర్ల లిమిట్ ద్వారా వేర్వేరు రెంటల్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కానీ దీనికి ముందుగా సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటరీ యూసేజ్‌ను ట్రాక్ చేయడానికి ఇందులో టెలిమాటిక్స్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారు. ఎంజీ కామెట్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీల్లో ఇది అందుబాటులో ఉంది.
అయితే రెంటల్ కాస్ట్‌లో బ్యాటరీ ఛార్జింగ్ కాస్ట్‌ను ఇన్‌క్లూడ్ చేయలేదు. అంటే బ్యాటరీకి ఛార్జింగ్ మీరే పెట్టుకోవాలి. దానికి అయ్యే కరెంటు ఖర్చు కూడా మీరే భరించాల్సి ఉంటుంది. ఎంజీ వీటి ఛార్జింగ్‌కు ఎటువంటి ఉచితమైన ఛార్జింగ్ పోర్టులు అందించబోదు. అయితే ఈ రెంటల్ ఆప్షన్ కాంప్లికేటెడ్‌గా ఉంది అనుకుంటే బ్యాటరీని కూడా కొనేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది.
Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!
‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’కు రెంట్ కట్టకపోతే ఏం అవుతుంది?
ఒకవేళ వినియోగదారుడు ఈ కారుకు రెంటు కట్టడం ఆపేస్తే కారును తిరిగి కంపెనీ తీసేసుకుంటుంది. ఆ వాహనానికి కట్టిన వెల నుంచి కొంత మొత్తాన్ని మినహాయించుకుని (ఈ మొత్తం కారు కండీషన్, ఎన్నాళ్లు ఉపయోగించారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది) మిగతా మొత్తాన్ని ఓనర్‌కి తిరిగి చెల్లిస్తారు.
‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ వల్ల ఉపయోగం ఏంటి?
దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులకు మరింత యాక్సెసబుల్‌గా మారతాయి. కొన్నాళ్లు డ్రైవ్ చేసి ట్రై చేద్దాం అనుకునే యూజర్లకు కూడా ఇది ఉపయోగపడతాయి. మూడు సంవత్సరాల పాటు దీన్ని ఉపయోగించినా 60 శాతం వరకు బై బ్యాక్ వాల్యూ లభిస్తుంది. ఈ స్కీమ్ మొదట విండ్సర్ ఈవీతో అందుబాటులోకి వచ్చింది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే